1 )అన్నపూర్ణ ,ధౌళ గిరి , కాంచనగంగ , ఎవరెస్ట్ ,
లోట్సే, మకాలు అనే పర్వతాలు దేని లో భాగం ?
ఎ )వింధ్య శ్రేణి
బి ) హిమాలయాలు
సి ) తూర్పు కనుమలు
డి ) పశ్చిమ కనుమలు
జవాబు : బి
2) యూరోపియన్ కౌన్సిల్ కి ప్రెసిడెంట్ గా డోనాల్డ్ టస్క్ ఉన్నాడు . బ్రేక్సిట్ కి ఫ్లెక్స్ టెన్షన్ (ఫ్లెక్సిబుల్ ఎక్స్
టెన్షన్ )జనవరి 31,2020 వరకు ఇచ్చింది, EU27. EU27 అనగా ఏమిటి ? వివరాలు
ఏవి
ఎ ) యూరోపియన్ యూనియన్ లో నుండి
, బ్రిటన్ తప్పు కుంటే మిగిలి ఉండేవి
27 దేశాలు
బి ) యురోపెయన్ యూనియన్ నుండి బ్రిటన్ తప్పుకో
దల్చింది. దీన్నే బ్రిటన్ ఎగ్జిట్ అంటున్నారు. షార్ట్ కట్ లో ‘బ్రేక్సిట్’
అంటున్నారు .
సి ) యూరోపెయన్ యూనియన్ వాళ్ళు యూరప్ దేశాలకు ‘యూరో’
అనే కామన్ కరెన్సీ ను కూడా వాడుకుంటున్నారు
.
డి ) పైవన్నీ
జవాబు : డి
3) ఇటీవల సూపర్ సైక్లోన్ ‘క్యార్ర్ ‘ భారత సముద్ర
తీరం నుండి దూరంగా వెళ్ళిపోయింది, ఏ దిశగా ?
ఎ )సెంట్రల్ అరేబియా సముద్రం నుండి పయనించి ,
ఈడెన్ గల్ఫ్ వైపు మరియు ఓమన్- యెమన్ దేశాల
సముద్ర తీరం వైపు
బి ) హిందూ మహా సముద్రం వైపు
సి ) ఆస్ట్రేలియా వైపు
డి ) ఇవేవి కావు
జవాబు : ఎ
4)500 సంవత్సరాల క్రితం శ్రీమంత శంకర దేవ అభివృద్ధి
చేసిన ‘బ్రజవలి’ భాష ఏ రాష్ట్రములో ప్రధానం
గా సంఘ సంస్కరణ లో భాగం అయ్యింది ?
ఎ ) మధ్య ప్రదేశ్
బి )అస్సాం
సి ) గుజరాత్
డి ) రాజస్తాన్
జవాబు : బి
5) బ్రిక్స్ (BRICS) దేశాల సమావేశం ఇటీవల ఎక్కడ
నిర్వహించారు ?
ఎ ) దక్షిణ
ఆఫ్రికా
బి ) అర్జెంటినా
సి ) బ్రెజిల్
డి ) ఈజిప్ట్
జవాబు : సి
6) భారత దేశ సుప్రీమ్ కోర్ట్ కి 47 వ ప్రధాన న్యాయ
మూర్తిగా నవంబర్ 2019 లో ఎవరు బాధ్యతలు చేపట్టనున్నారు ?
ఎ ) హెచ్. జే. కానియా
బి ) జస్టిస్ సరద అరబింద్ బొబ్డే
సి ) ఎం.పతంజలి శాస్త్రి
డి ) మెహర్ చంద్ మహాజన్
జవాబు : బి
7) తమిళనాడు లో కుడంకులం న్యూక్లియర్ పవర్ ప్లాoట్ ను ఏ దేశ సహకారం తో నిర్మించారు ?
ఎ ) USA
బి ) రష్యా
సి ) ఫ్రాన్స్
డి ) కెనడా
జవాబు : బి
8)గిరీష్ చంద్ర ముర్ము. జమ్మూ & కాశ్మీర్
కేంద్ర పాలిత ప్రాంతానికి లెఫ్టి నేంట్ గవర్నర్ పదవి చేపట్టారు . రాధా కృష్ణ
మాథుర్ లడక్ కేంద్ర పాలిత ప్రాంతానికి లెఫ్టి నెంట్ గవర్నర్ పదవి చేపట్టారు . వీరి
చేత పదవి ప్రమాణస్వీకారం ఎవరు చేయించారు ?
ఎ ) చీఫ్ జస్టిస్
రాఘవేంద్ర చౌహాన్
బి ) ప్రధాన న్యాయమూర్తి గీత మిట్టల్ , J&K
హై కోర్ట్
సి ) చీఫ్ జస్టిస్ సి హెచ్ ప్రవీణ్ కుమార్
డి ) చీఫ్ జస్టిస్ రవీంద్రన్ మీనన్
జవాబు : బి
9) ‘ఘోస్ట్ క్యాట్ ‘ అనే మాల్ వేర్ , వేటిని
లక్ష్యం చేసుకుని ప్రవేశిస్తుంది ?
ఎ ) టెలివిజన్
బి ) రేడియో
సి ) మొబైల్ ఫోన్లు / అటువంట్ పరికరాలు / (మొబైల్
బ్రౌజర్లు , ప్రకటనల ద్వారా )
డి ) గ్జీరాక్స్ మెషిన్
జవాబు : సి
10) నిర్విక్ (Nirvic) (నిర్యాత్ రిన్ వికాస్ యోజన )
అనే పధకాన్ని ఎగుమతులను ప్రోత్సహించటానికి , కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
దీన్ని ఏ సంస్థ ద్వారా అమలు చేస్తారు ?
ఎ ) నేషనల్ హౌసింగ్ బ్యాంకు
బి ) స్టేట్ ఫైనాన్సు కార్పోరేషన్
సి ) ఎక్స్ పోర్ట్ క్రెడిట్ గారెంటీ కార్పోరేషన్
డి ) ఎ. ఐ. ఎఫ్
జవాబు : సి
11)ప్రాంతీయ
సమగ్ర ఆర్ధిక భాగస్వామ్యం (RCEP)(రీజినల్ కాం
ప్రే హేన్సివ్ ఎకనమిక్ పార్టనర్ షిప్ ) గురించి చర్చించేందుకు నవంబర్ , 2019 లో ఎక్కడ నిర్వహించారు ?
ఎ ) బ్రెజిల్
బి ) రష్యా
సి )బ్యాంకాక్
, థాయిలాండ్
డి ) సౌదీ అరేబియా
జవాబు : సి
12) ఈ కింది వాటిల్లో ఏది ఉంటె, ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO)లో ఏ దైనా
దేశానికీ , ‘అభివృద్ధి చెందుతున్న దేశం ‘ కింద లభించే స్పెషల్ & డిఫరెన్షియల్
(S&DT)సదుపాయాలు లభించవు,అని ప్రతిపాదిస్తున్నారు ?
ఎ )OECD లో సభ్యత్వం ఉన్న (లేక ) కోరినా
బి )G-20 లో సభ్యత్వం ఉన్నా
సి ) ప్రపంచ ఎగుమతులలో ఒక దేశం యొక్క షేర్ (వాటా )0.5 %
కన్నా ఎక్కువ ఉన్నా ; ప్రపంచ బ్యాంకు చేత ‘హై – ఇన్ కం ‘ గ్రూప్ గా వర్గీ కరించ
బడినా
డి ) పైవన్నీ
జవాబు : డి
13) బేరియం నైట్రేట్ , యాంటి మోని లేకుండా CSIR-NEERI
నేతృత్వం లో గ్రీన్ స్పార్క్లర్స్ (పర్యావరణ హిత దీపావళి కాకర పువ్వత్తుల ) ను దేనితో తయారు
చేస్తారు ? [వీటి వల్ల గాలి లో పార్టిక్యు
లేట్ మాటర్ PM10 మరియు PM 2.5 (ధూళి కణాలు ) 30 % కి తగ్గుతాయి . ]
ఎ ) పొటాషియం నైట్రేట్ 32%
బి ) అల్యూమినియం పౌడర్ 40 % ; అల్యూమినియం
చిప్స్ 11 %
సి )17 % ప్రొప్రైటరీ ఎడిటివ్స్ (ప్రధానం గా ప్రత్యేకం గా కలిపేవి )
డి ) పైవన్నీ కలిపి
జవాబు : డి
14)ఇటీవల బుకర్ బహుమతి (ప్రైజ్ ) ఎవరెవరికి కలిపి
ఇచ్చారు ?
ఎ ) బెర్నిస్ రుబెర్న్స్
బి )మార్గరెట్ ఆ ట్ వుడ్ (రాసిన పుస్తకం : ‘ది
టెస్ట్ మెంట్స్’ ) & బెర్నా ర్డైన్ ఎవారి స్టొ (రాసిన పుస్తకం : ‘గర్ల్ ,
వుమన్, అదర్’ )
సి ) ఆంథోనీ బెర్జేస్
డి ) జార్జ్ శాoడర్స్
జవాబు : బి
15) సింధు నాగరికత వెల్లి విరిసిన ‘కోట్ దిజి’ ,
మొహంజొదారో , హరప్పా ప్రస్తుతం ఏ దేశం లో ఉన్నాయి ?
ఎ ) ఆఫ్ఘనిస్తాన్
బి ) ఇరాన్
సి )పాకిస్తాన్
డి ) ఇరాక్
జవాబు : సి
16) హర్యానా లో ముఖ్యమంత్రి గా మనోహర్ లాల్ ఖత్తర్ ,
ఉప ముఖ్యమంత్రి గా దుష్యoత్ చౌతాలా పదవీ ప్రమాణం చేశా రు . దుష్యంత్ చౌతాలా ఏ
పార్టి కి చెందినవారు ?
ఎ ) హర్యానా జన హిత్ కాంగ్రెస్
బి ) ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (INLD)
సి ) జన్ నాయక్ జనతాపార్టీ ( JJP)
డి ) సమాజ్ వాది పార్టీ
జవాబు : సి
17) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ )SAFAR (సఫర్ ) : సిస్టం అఫ్ ఎయిర్ క్వాలిటీ &
వెదర్ ఫోర్ కాస్టింగ్
బి )GRAP(గ్రాప్) :గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్
ప్లాన్
సి ) AQI(ఎ క్యు ఐ ) : ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (వాయు
నాణ్యత సూచిక )
డి ) పైవన్నీ ( ఢిల్లీ లో వాయు కాలుష్యం తీవ్రం గా ఉంది, దీపావళి అనంతరం )
జవాబు : డి
18) ఉత్తర ప్రదేశ్ లో రామజన్మ భూమి అయోధ్య ఏ నది
ఒడ్డున ఉంది ?
ఎ ) నర్మదా నది
బి ) సబర్మతి నది
సి ) లోకల్ పేరు : ‘సరయూ నది’ (దీన్నే
కొందరు ‘ఘఘ్రా ‘ నది అని కూడా అంటారు. ఘఘ్రా నది
మానస సరోవర్ (టిబెట్ అటానమస్ రీజియన్ ) దగ్గర పుట్టి, హిమాలయాల గుండా ప్రవహించి, నేపాల్
గుండా ప్రవహించి, అయోధ్య /ఫైజాబాద్ కువచ్చి , ఆతర్వాత బీహార్ లోని చాప్రా పట్టణం దగ్గర గంగా నదిలో కలుస్తుంది . ఇది గంగా నదికి ఉప నది .
నేపాల్ లో ఈ నదిని ‘కర్నాలి’ నది అంటారు. )
డి ) తపతి నది
జవాబు : సి
19)ఇటీవల భారత దేశాన్ని సందర్శించిన ప్రపంచ బ్యాంకు
అధ్యక్షుడు డేవిడ్ మాల్పాస్ ఏ విషయాల గురించి ప్రస్తావించాడు ?
ఎ ) ‘ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ ‘ ర్యాంకు ల లో
భారత దేశం 63 వ స్థానం లో ఉంది
బి )సంవత్సరానికి US $ 5 – 6 బిలియన్ లు
చొప్పున రుణాలు భారత దేశానికీ రానున్నాయి ( అనుకున్న 97 ప్రాజెక్ట్ లకు US 24 బిలియన్ లు )
సి ) ఆర్ధికాభివృద్ధి రేట్ బాగుండటానికి భారత
దేశం నిర్మాణాత్మకంగా బాగుపడే చర్యలు తీసుకోవాలి
డి ) పైవన్నీ
జవాబు : డి
20) 19 వ అలీనోద్యమ సదస్సు (NAM) అక్టోబర్ , 2019 లో
ఎక్కడ నిర్వహిoచారు ?
ఎ ) వెనెజులా
బి ) బాకు , అజర్ బైజాన్
సి )బాండుంగ్
డి ) బెల్ గ్రేడ్
జవాబు : బి
21)ఇండియా – చైనా మధ్య సరిహద్దు గా ఉన్న సుమారు 3488 కి.మీ. పొడవున్న ఆక్ట్యువల్ నియంత్రణ రేఖ ( LAC) లో , చాలా కారణాల చేత , ఏ ఏ ప్రాంతాలలో సరిహద్దు
స్పష్టం గా నిర్ధారణ జరగలేదు అంటున్నారు ఇండో – టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) వారు ?
ఎ ) లడక్ లో ( 3 ప్యాకెట్ లలో /చోట్ల లో )
బి ) ఉత్తరాఖండ్ ( 1 ప్యాకెట్ లో )
సి ) అరుణాచల్ ప్రదేశ్ ( 1 ప్యాకెట్ లో )
డి ) పై వన్ని
జవాబు : డి
22) బి.సి.సి.ఐ (BCCI) అధ్యక్షుడి గా సౌరవ్ గంగూలి
పదవీ బాధ్యతలు చేపట్టాడు . BCCI అపెక్స్ కౌన్సిల్ లో ఇంకా ఎవరెవరు ఉన్నారు ?
ఎ ) మహీం వర్మ : ఉపాధ్యక్షుడు
బి ) జయ్ షా : సెక్రటరీ
సి ) ప్రభ్ తేజ్ సింగ్ భాటియా : కౌన్సిలర్
డి ) పై
అందరూ
జవాబు : డి
23)2020-21 రబీ సీజన్ లో గోధుమ పంట కనీస మద్దతు ధర (MSP)
క్వింటాల్ కి రు.1925 కి పెంచారు . గోధుమతో పాటు ఇంకా ఏ ఏ పంటలకి MSP పెంచారు ? (ఒక క్వింటాల్
కి, రూపాయలలో )
ఎ ) బార్లీ : రు.1525 /-
బి )శనగలు : రు.4875/-
సి )ఆవాలు : రు .4425 /-
డి ) పైవన్నీ
జవాబు : డి
24) ‘గుప్త వంశీక్ వీర్ : స్కంధ గుప్త విక్రమాదిత్య
కా ఇతిహాస్ పునః స్మరణ్ ‘ అనే పరిశోధనా పుస్తకం ను రాకేశ్ ఉపాధ్యాయ్ రాశాడు. స్కంధ
గుప్తుడు ఏ కాలం లో భారత దేశం లో పరిపాలన
చేశాడు ?
ఎ ) క్రీస్తు శకం 345 సంవత్సరం
బి ) సుమారు క్రీస్తు శకం 455 సంవత్సరం
సి ) క్రీస్తు శకం 645 సంవత్సరం
డి ) క్రీస్తు శకం 78 సంవత్సరం
జవాబు : బి
25)ప్రపంచ బ్యాంకు తయారు చేసే ‘ఈజ్ అఫ్ డూయింగ్
బిజినెస్ 2020 ‘ ఇండెక్స్ / రిపోర్ట్ కోసం పరిగణన లో కి తీసుకునే 10 అంశాలు ఏవి ?
ఎ )వ్యాపారం మొదలు పెట్టటం ; నిర్మాణాల అనుమతులు ,
విద్యుచ్ఛక్తి సరఫరా పొందటం , స్థిరాస్థి
రిజిస్ట్రేషన్ , అప్పులు పొందటం
బి )మైనారిటీ పెట్టుబడి దారులను రక్షిం చటం ;
పన్నులు కట్టటం , దేశ సరిహద్దు లు దాటి విదేశాలలో వ్యాపారం చేయటం
సి )కాంట్రాక్టు లు అమలు చేయటం ; దివాలా సమస్యలు
పరిష్క రించటం
డి ) పైవన్నీ
జవాబు : డి
26) యూరోపెయన్ పార్లమెంట్ ఇచ్చే సఖరోవ్ మనవ హక్కుల
బహుమతి ఇటీవల ఎవరికీ ప్రకటించారు ?
ఎ ) డేవిడ్ సస్సోలి
బి )నెల్సన్ మండేలా
సి ) ఇల్హాం తోహ్తి ( ఉహుర్ , చైనా )
డి ) ఒలేగ్ సెన్టోవ్
జవాబు : సి
27) 2019 మహారాష్ట్ర
అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ కి ఎన్ని సీట్లు వచ్చాయి ?
ఎ ) భారతీయ
జనత పార్టీ : 105
బి ) శివ సేన : 56
సి ) నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ : 54 ; ఇండియన్
నేషనల్ కాంగ్రెస్ : 44
డి ) పైవన్నీ
జవాబు : డి
28) బిట్ర , ఛే ట్ లాట్ , కిల్టాన్ , కిడ్ మత్
దీవులు ఎక్కడున్నాయి ?
ఎ ) అండమాన్
& నికోబార్ దీవులు
బి ) లక్ష ద్వీప్
సి ) మాల్దీవులు
డి ) మార్షల్ దీవులు
జవాబు : బి
29) ‘పెగా సస్ ‘ అనే స్పై వేర్ (గూఢచారి పని చేసే
కంప్యూటర్ సాఫ్ట్ వేర్ ) దేని ద్వారా మొబైల్ ఫోన్ లలోకి ప్రవేశిస్తుంది , అని
వార్తల్లో ఉంది ?
ఎ ) వాట్సాప్
బి ) పేస్ బుక్
సి ) ట్విట్టర్
డి ) ఇంస్టా గ్రాo
జవాబు : ఎ
30) జార్ఖండ్ లో అసెంబ్లీ ఎన్నికలు 5 దశలలో
నిర్వహించ నున్నారు . జార్ఖండ్ అసెంబ్లీ లో ఎన్ని సీట్ల కు ఎన్నికలు నిర్వహిస్తారు
?
ఎ ) 81
బి ) 2 8 8
సి ) 90
డి ) 123
జవాబు : ఎ
31)సిరియా దేశానికీ ఈశాన్య దిశలో , (మరియు
టర్కీ దేశానికీ సరిహద్దులో) ఉన్న టెల్ రిఫాత్ , మన్ బిజ్ నగరాలనుండి ఏ సేనలు
తప్పుకోనున్నాయి ? (తాల్ అబ్యాడ్ , కొబానే ప్రాంతాలు సిరియా దేశానికీ సరిహద్దులో
ఉన్నాయి )
ఎ )ఖుర్దిష్ YGP సేనలు (ఖుర్దిష్ పీపుల్స్
ప్రొటెక్షన్ యూనిట్స్ )
బి ) ఈజిప్ట్
సేనలు
సి ) ఇస్రాయెల్ సేనలు
డి ) ఇవేవి కావు
జవాబు : ఎ
32) మంచు చిరుత పులి ( స్నో లియో పార్డ్) భారత దేశం
లో ఏ ప్రాంతాలలో జీవిస్తోంది ?
ఎ )కాశ్మీర్ , లడక్
బి )హిమాచల్ ప్రదేశ్ , ఉత్తరాఖండ్
సి ) సిక్కిం , అరుణాచల్ ప్రదేశ్
డి ) పైవన్నీ ( హిమాలయాలలో ఎత్తైన ప్రాంతాలలో )
జవాబు : డి
33) నాగాలాండ్ కి ఉన్న యిరుగుపొరుగు న ఉన్న ఈశాన్య
రాష్ట్రాలు ఏవి ?
ఎ ) అరుణాచల్ ప్రదేశ్
బి ) అస్సాం
సి ) మణిపూర్
డి ) పైవన్నీ
జవాబు : డి
34) కొత్త సమాచార హక్కు చట్టం (RTI) రూల్స్ ప్రకారం ,
ఇన్ఫర్మేషన్ కమీషనర్ ల పదవీ కాలం 5 సంవత్సరాల నుండి ఎంతకు తగ్గించారు ?
ఎ ) 3 సంవత్సరాలు
బి ) 6 నెలలు
సి ) 12 నెలలు
డి ) 24
నెలలు
జవాబు : ఎ
35) ‘థాo లూంగ్ ‘ గుహ (ఉత్తర చియాంగ్ రాయ్
ప్రావిన్స్ లో ) ఏ దేశం లో ఉంది ?
ఎ ) ఇండోనేషియా
బి ) థాయిలాండ్
సి ) కంబోడియా
డి ) వియత్నాం
జవాబు : బి
36) ప్రతి ఏటా గోవా లో నిర్వహించే భారత దేశ అంతర్జాతీయ
ఫిలిం ఫెస్టివల్ నిర్వహిస్తారు . ఈసారి నిర్వహించే 50 వ IFFI
వివరాలేవీ ?
ఎ ) రజనీకాంత్ కి గోల్డెన్ జూబిలీ ఐకాన్ అవార్డు
ఇవ్వనున్నారు .
బి ) దాదాపు 200 విదేశీ సినిమా లు ప్రదర్శిస్తారు
సి ) రష్యా ఈ పండుగకు భాగస్వామి గా ఉంటుంది
డి ) పైవన్నీ
జవాబు : డి
37) ‘ఖిలా – ఎ – ముబారక్ ‘ అనే పేరు ఢిల్లీ లో దేనికి ఉండేది ?
ఎ ) ఎర్ర కోట , ఢిల్లీ (ఈ ప్రాంతానికి షాజహానా బాద్ అనే పేరు కూడా ఉంది )
బి ) ఆరంగాబాద్ కోట
సి ) గొల్కొoడ కోట
డి ) వరంగల్ కోట
జవాబు : ఎ
38) ఇటీవల భారత దేశం RCEP లేక ఫ్రీ ట్రేడ్
అగ్రిమెంట్ (FTA) నుండి డ్రాప్
అవుతున్నట్లు ప్రకటించింది . RCEP (ఆర్. సి.
ఈ . పి )వల్ల ప్రధానం గా ఎవరికీ నష్టం కలుగు తుంది ?
ఎ ) రైతులకి
బి ) MSME (మైక్రో, స్మాల్ & మీడియం ఎంటర్
ప్రైజెస్ ) సెక్టార్ కి
సి ) డైరీ సెక్టార్ ( పాల పరిశ్రమ కి )
డి ) పై అందరూ
జవాబు : డి
39) ASEAN(ఆసియాన్) తో కలిపి మొత్తం 16 దేశాలు RCEP
(ప్రాంతీయ సమగ్ర ఆర్ధిక భాగస్వామ్యం) గురించి చర్చించాయి , ఇటీవల బ్యాంకాక్ ,
థాయిలాండ్ లో. ASEAN(ఆసియాన్ ) లో ఉన్న 10 దేశాలు కాకుండా , మిగిలిన దేశాలు ఏవి ?
ఎ ) చైనా , దక్షిణ కొరియా
బి ) భారత్ , జపాన్
సి ) ఆస్ట్రేలియా , న్యూ జిలాండ్
డి ) పైవన్నీ
జవాబు : డి
40) నవంబర్ , డిసెంబర్ మాసాలలో , ఢిల్లీ లో గాలి
వేగం ఎంత కన్నా తక్కువకు పడిపోతే , వాయు కాలుష్యం తీవ్రత ఎక్కువగా ఉంటుంది ?
ఎ ) గంటకు 10 కి.మీ.
బి ) గంటకు 20 కి.మీ.
సి ) గంటకు 30 కి.మీ.
డి ) గంటకు 40 కి.మీ.
జవాబు : ఎ
41) ఈ కింది వాటిలో ఏది కరెక్ట్ ?
ఎ ) ట్రాక్ దీవి : అండమాన్ & నికోబార్
బి ) కాల్ పే ని
దీవి : లక్ష ద్వీప్
సి ) బోర బోర దీవి : పసిఫిక్ మహాసముద్రం
డి ) పైవన్నీ
జవాబు : డి
42) కెనడా దేశ దిగువ సభ ఇటీవల ఎన్నికల్లో ఏ పార్టి కి ఎన్ని సీట్లు వచ్చాయి ?
ఎ ) లిబరల్ పార్టీ : 157 సీట్లు ( జస్టిన్ ట్రూ
డో )
బి )కన్సర్వేటివ్స్ : 26 సీట్లు
సి ) న్యూ డెమోక్రాట్స్ : 24 సీట్లు ( జగ్ మీత్
సింగ్ )
డి ) పైవన్నీ ( కెనడా దేశ దిగువ సభ లో మొత్తం 338
సీట్లు ఉన్నాయి )
జవాబు : డి
43) జపాన్ దేశ ‘చేమంతి’ సింహాసనాన్ని అధిష్టిoచిన
కొత్త చక్రవర్తి ఎవరు(వరుస క్రమం లోఈయన 126 వారు ) ?
ఎ ) నారు హితో చక్రవర్తి
బి ) అకి హితో
సి ) షింజో అబే
డి ) హిరో హితో
జవాబు : ఎ
44) కల్నల్ ఛేవాంగ్ రిన్ చెన్ బ్రిడ్జి ని తూర్పు
లడక్ లో ఏ నది మీద నిర్మించి ప్రారంభోత్సవం చేశా రు ?
ఎ ) ష్యోక్ నది
బి ) సింధు నది
సి ) జీలం నది
డి ) బియాస్ నది
జవాబు : ఎ
45) ఇటీవల విడుదల చేసిన ‘ఈ – ఫ్లో ‘ నోటిఫికేషన్ ప్రకారం గంగానది
ప్రవహించే ఏ ఏ ఎగువ భాగాలలో (అనగా గంగా నది ఉద్భవించిన చోటునుండి హరిద్వార్ వరకు)
ఎంతెంత నీరు ఉండాలి ?
ఎ ) 20 % నవంబర్ & మార్చ్ లలో (డ్రై సీజన్ ) , [నెలవారీ ప్రవాహం లో , రోజుల
ముందుగా ]
బి ) 25 % సగటు : అక్టోబర్ , ఏప్రిల్ & మే
నెలలో
సి ) 30 % నెలవారి సగటు : వర్షాకాల సీజన్ లో జూన్
– సెప్టెంబర్ మధ్య కాలం లో
డి ) పైవన్నీ
జవాబు : డి
46) ఏ ఈశాన్య రాష్ట్రాల గుండా కర్కాటక రేఖ (
ట్రాపిక్ అఫ్ కాన్సర్ ) పోతోంది ?
ఎ ) నాగాలాండ్
బి ) మణిపూర్
సి ) త్రిపుర & మిజోరాం
డి ) అస్సాం
జవాబు : సి
47) ఇండియన్ కౌన్సిల్ ఫర్ ఫారెస్ట్రీ రీసెర్చ్ &
ఎడ్యుకేషన్ (ICFRE) డెహ్రాడున్ కి 9 నదుల బేసిన్(river basin) ల లో ప్రవహించే 13 నదులపై డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR) తయారు
చేయమని బాధ్యత అప్పగించారు . ఆ నదులు ఏవి ?
ఎ ) గోదావరి , కృష్ణ నదులు (ఆంధ్ర
ప్రదేశ్ , తెలంగాలలో ప్రవహించేవి )
బి ) బియాస్ , చీనాబ్ , జీలం , రావి, సట్లేజ్
సి ) యమునా , బ్రహ్మపుత్ర , మహానది , నర్మదా ,
కావేరి , లూని
డి ) పైవన్నీ
జవాబు : డి
48) తెలంగాణా రాష్ట్ర ఫైనాన్సు కమిషన్ చైర్ పర్సన్
ఎవరు ?
ఎ ) సురేష్ చంద్ర
బి )G . రాజేషం గౌడ్
సి ) ఎం. చెన్నయ్య కురుమ
డి ) వీరెవరు కారు
జవాబు : బి
49) రియల్ ఎస్టేట్ రంగం (స్థిరాస్తి రంగం ) ను సపోర్ట్ చేయటం కోసం కేంద్ర ఆర్ధిక మంత్రి ప్రతిపాదించిన
రు.25,000 కోట్ల అల్టర్నేటివ్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ (AIF) కి ఎవరెవరు ఆర్ధికంగా
దోహద పడనున్నారు ?
ఎ ) కేంద్ర ప్రభుత్వం : రు.10,000 కోట్లు
ఇస్తుంది
బి )
స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా
సి ) లైఫ్ ఇన్సురన్సు కార్పొరేషన్ అఫ్ ఇండియా
డి ) పై అందరూ ( SBICAP వెంచర్స్ AIF కి యాజమాన్యం
వహిస్తుంది )
జవాబు : డి
50) నాన్- బ్యాంకింగ్ ఫైనాన్సు కంపెనీ ( NBFC) లు గత 12 నెలల కాలం లో తమ రుణాలను అమ్మి
ఎంత ధనం సేకరించాయి ( లక్షల కోట్ల రు. లలో
)
ఎ ) 1.3
బి ) 2.36
సి ) 5.0
డి ) ఇవేవి కావు
జవాబు : బి
51)బంగ్లాదేశ్ తో అస్సాం , మేఘాలయ , మిజోరo , త్రిపుర , పశ్చిమ
బెంగాల్ రాష్ట్రాలకు సరిహద్దు ఉంది . సరిహద్దు రేఖ పొడవు సుమారు 4096 కి.మీ.
అస్సాం రాష్ట్రానికి బంగ్లా దేశ్ కి మధ్య గల సరిహద్దు పొడవు సుమారు 263 కి.మీ.
ఇందులో 119.1 కి.మీ .పొడవునా నది ప్రవహిస్తుంటుంది. మేఘాలయ నుండి కూచ్ బెహర్
(WB)వరకు గల దుబ్రి సెక్టార్ నుండి ఏ నది , బంగ్లాదేశ్ లోకి ప్రవహిస్తోంది ?
ఎ ) తీస్తా నది
బి ) బ్రహ్మపుత్ర
సి ) హుగ్లీ నది
డి ) దామోదర్ నది
జవాబు : బి
52) ‘బ్రు’ లేక ‘రియాంగ్ ‘ అనే ప్రజలు ఏ రాష్ట్రము
లో నివసిస్తున్నారు ? (వారు ‘డంబార్ మాన్ డ్యాం ప్రాజెక్ట్’ వల్ల తాము
నివసిస్తున్న భూమి నుండి తొలగించబడ్డారు . )
ఎ ) త్రిపుర
బి ) ఒడిష
సి ) బీహార్
డి ) ఉత్తర ప్రదేశ్
జవాబు : ఎ
53) అస్సాం రైఫిల్స్ ని , ఇండో – టిబెటన్ బోర్డర్
పోలీస్ (ITBP) తో కలప దల్చుకున్నారు . అస్సాం రైఫిల్స్ గురించి వివరాలు ఏవి ?
ఎ ) క్రీస్తు శకం 1835 లో ‘కచార్ లెవీ’ గా
ప్రారంభించారు
బి )క్రీస్తు శకం 1870 సంవత్సరం లో అస్సాం
మిలిటరీ పోలీస్ బెటాలియన్ గా పేరు మార్చారు
సి )లూషాయ్ హిల్స్ బెటాలియన్ , లఖింపూర్
బెటాలియన్ , నాగా హిల్స్ బెటాలియన్ ఇంకా
దర్రాంగ్ బెటాలియన్ ఇందులో ఉండేవి. ( 1962 లో అరుణాచల్ ప్రదేశ్ లో చైనా దళాలు
ప్రవేశించ ప్రయత్నించినప్పుడు , అస్సాం రైఫిల్స్ , భారత సైన్యం అధీనం లోకి
వచ్చింది )
డి ) పైవన్నీ
జవాబు : డి
54)భారత దేశం లో పశువుల పాడి పరిశ్రమ ప్రత్యక్షం గా గ్రామ
ప్రాంతాలలో , ఎన్ని మిలియన్ కుటుంబాలకు జీవనోపాధి కల్పిస్తోంది ? (ప్రతిగ్రామీణ
సాధారణ రైతు కుటుంబం 2 పాడి పశువులు కల్గి
ఉంటోంది ).
ఎ ) 20
బి ) సుమారు 80
సి ) 30
డి ) 25
జవాబు : బి
55) 2033 నాటికీ భారత దేశo లో పాల ఉత్పత్తి 330 MMT
కి చేరవచ్చును . అప్పడు పాల కోసం డిమాండ్ ఎంత ఉండవచ్చును ? ( మిలియన్ మెట్రిక్
టన్నులలో )
ఎ ) 292
బి ) 55.6
సి ) 176.3
డి ) 50
జవాబు : ఎ
56) NavIC (నావిక్) (నావిగేషన్ ఇన్ ఇండియన్ కాన్
స్టెలేషన్ ) వివరాలు ఏవి ?
ఎ ) ISRO (ఇస్రో ) యొక్క 8 ఉపగ్రహాల భారత దేశ
కమ్యూనికేషన్ వ్యవస్థ ఇది
బి ) వ్యాపారం , వ్యక్తుల గురించిన సమాచారం ,
వారు ఎక్కడ ఉనది, వ్యాపార వస్తువులు ఎక్కడ ఉన్నది తెలుప గల సమాచార విధానం ఇది
సి ) ఇది లొకేషన్ బేస్డ్ (LBS)సర్వీస్ . US దేశపు
GPS వంటిది . ఇది భారత ఉప ఖండం లోని సుమారు
1500 కి.మీ. పరిధి లోనే పనిచేస్తుంది
డి ) పైవన్నీ
జవాబు : డి
57) ధనుష్ ‘ఆర్టిలరి గన్’
వివరాలు ఏవి ?
ఎ ) 155 mm , 45 – కాలిబర్ ఆర్టిలరి’ గన్ ఇది
బి ) దీని రేంజ్ : 36 కి.మీ.
సి )గన్ క్యారేజ్ ఫ్యాక్టరీ , జబల్పూర్ కి
భారీస్థాయి లో ఉత్పత్తి కి ఆర్డర్ పంపారు (ఇది బోఫోర్స్ గన్ మోడల్ లో ఉంటుంది )
డి ) పైవన్నీ
జవాబు : డి
58) మనాలి – కీలాంగ్ జాతీయ రహదారి లో ఉన్న ‘రోహ
తాంగ్ పాస్ ‘ ( 3980 మీటర్ల ఎత్తులో ) ఏ రాష్ట్రము లో ఉన్నది ?
ఎ ) అరుణాచల్
ప్రదేశ్
బి ) హిమాచల్ ప్రదేశ్
సి ) ఉత్తరాఖండ్
డి ) సిక్కిం
జవాబు : బి
59) అంతర్జాతీయ ద్రవ్య నిధి ( IMF) లో ఏ దేశానికీ
ఎంత శాతం కోటా ఉంది ( కోటా అనేది IMF
నిధులకు ప్రాధమిక వనరులు కల్పిస్తుంది ) ?
ఎ ) ఇండియా : 2.76 %
బి ) చైనా : 6.41 %
సి ) USA : 17.46
డి ) పైవన్నీ ( కోటా ను ఆ దేశ GDP , ఆర్ధిక ఓపెన్ నెస్ ,
ఆర్ధిక వేరియబిలిటి , ఇంటర్నేషనల్ రిజర్వు ల ప్రకారం నిర్ధారిస్తారు )
జవాబు : డి
60) ప్రవింద్ కుమార్ జుగ్ నాద్ , ఇటీవల ఏ దేశ ప్రధాన
మంత్రి గా ఎన్నికయ్యాడు ?
ఎ ) శ్రీలంక
బి ) మారిషస్
సి ) వియత్నాం
డి ) సూరినాం
జవాబు : బి
61) భారత రాజ్యాంగం లోని ఆర్టికల్ 142 ప్రకారం , భారత సుప్రీమ్ కోర్ట్ అయోధ్య పై తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు కు కోసం చేసిన వాదోపవాదములు , పత్రాలు ,
మొదలైనవాటికి ఉన్న ప్రత్యేకతలు ఏవి ?
ఎ ) మొత్తం కేసు కి సంబంధించి పరిశీలించి నవి : 54
వాల్యూం లు ;13 ,42 6 పేజీలు; 533 ఎగ్జి బిట్ లు;
బి ) కేవలం తీర్పు (జడ్జ్ మెంట్ ) ఉన్న భాగం :
1045 పేజీలు
సి ) కేశవా నంద భారతీకేసు విచారణ 68 రోజులు
కొనసాగింది(ఇది మొదటి స్థానం లో ఉంది ) . అయోధ్య కేసు విచారణ ఏక బిగిన 40 రోజులు
కొనసాగి, రెండవ స్థానం లో ఉంది.
డి ) పైవన్నీ
జవాబు : డి
62) భారత దేశం లో మహిళల ప్రసూతి కాల మరణ రేటు (మేటర్నల్
మోర్టాలిటి రేట్ MMR)2015 – 2017 కాలం లో ఇంతకు తగ్గింది ? ( ప్రాణం తో ఉన్న ఒక
లక్ష జన నాలకు )
ఎ )122
బి )130
సి ) 90
డి ) 80
జవాబు : ఎ
63) శ్రీ నగర్ – జమ్మూ జాతీయ రహదారి లో కాకుండా
మొఘల్ రోడ్ లో ఆపిల్ పండ్లను లారీ లలో రవాణా చేయదలిచారు . J&K లో దేనికి ‘యాపిల్
టౌన్ ‘ అనే పేరు దేనికి ఉంది ?
ఎ ) షోపియాన్
బి ) సిమ్లా
సి ) ధర్మశాల
డి ) కాంగ్రా
జవాబు : ఎ
64) బిబేక్ దేబ్రాయ్ చైర్మన్ గా ఉన్న PMEAC (ప్రధాన
మంత్రి ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ ) లో
కొత్తగా ఎవరు సభ్యులుగా చేరారు ?
ఎ ) నీల కం ఠ మిశ్ర
బి ) నీలేష్ షా
సి ) U . అనంత నాగేశ్వరన్
డి ) పై
ముగ్గురూ
జవాబు : డి
65) అయోధ్య రామ జన్మ భూమి పై భారత సుప్రీమ్ కోర్ట్
ఇచ్చిన తీర్పును 5 మంది న్యాయమూర్తులు కల్సి ఇచ్చారు . వీరిలో ప్రధాన న్యాయమూర్తి
రంజన్ గగోయ్, న్యాయమూర్తి ఎస్ . ఏ.బొబ్డే ఉన్నారు. ఈ రాజ్యాంగ ధర్మాసనం లో వీరు
గాక ఇంకా ఎవరెవరు ఉన్నారు ?
ఎ )జస్టిస్ డి.వై.చంద్ర చూడ్
బి ) జస్టిస్ అబ్దుల్ నజీర్
సి ) జస్టిస్ అశోక్ భూషణ్
డి ) పై అందరూ
జవాబు : డి
66) అయోధ్య లోని రామజన్మభూమి - బాబ్రీ మసీదు ఉన్న 2.77 ఎకరాల తో సహా మొత్తం 67.73
ఎకరాలను కేంద్ర ప్రభుత్వం 1993 లో స్వాధీనం చేసుకుంది . ఇప్పుడు భారత దేశ సుప్రీమ్ కోర్ట్ ఈ కేసు లో ఏమి చేయాలనే తీర్పు ఇచ్చింది ? వివరాలు ఏవి ?
ఎ ) కేంద్ర ప్రభుత్వం ఒక స్కీం తయారు చేయాలి.
బి ) ఒక ట్రస్ట్ ని ఏర్పాటు చేయాలి . ట్రస్ట్
వారే మొత్తం స్థలం లో ఆలయ నిర్మాణం చేయాలి
సి ) ముశ్లిం పార్టి లకు , ప్రత్యేకం గా 5 ఎకరాల
భూమిని ప్రభుత్వం ఇవ్వాలి
డి ) పై వ న్ని
జవాబు : డి
67) క్రీస్తు శకం 1722 ప్రాంతం లో ముఘల్ పాలకులు నవాబ్
సాదత్ అలీ ఖాన్ , బుర్హాన్ ఉల్ ముల్క్ ని ‘ఆవద్ సుబా’ కి అధిపతిగా చేశారు. ఫైజాబాద్ ని
రాజధాని గా చేసుకుని ‘అవద్’ (ఔద్ ) నవాబులు పరిపాలన చేశారు. నవాబ్ సాదత్ అలీ ఖాన్ , అయోధ్య ప్రాంతానికి ఫైజాబాద్ అనే పేరు పెట్టాడు
. 4వ నవాబు అసఫ్ ఉద్ దౌలా , క్రీస్తు శకం
1775 లో రాజధానిని ఫైజాబాద్ నుండి లక్నో కి మార్చారు. ఉత్తర ప్రదేశ్ లోని అవద్ ప్రాంతాన్ని , బ్రిటిష్
వారు ఏ సంవత్సరం తర్వాత పూర్తిగా తమ అధీనం లోకి తీసుకున్నారు ?
ఎ ) 1757
బి ) క్రీస్తు శకం 1857 సంవత్సరం (సుమారు )
సి ) 1773
డి ) 1805
జవాబు : బి
68) వర్షాల
వల్ల పెరిగే అడవులున్న నాంధాపా ఏ రాష్ట్రములో ఉంది ?
ఎ ) సిక్కిం
బి ) అరుణాచల్ ప్రదేశ్
సి ) త్రిపుర
డి ) మణిపూర్
జవాబు : బి
69) ఏ ప్రాంతాలు , తమిళనాడు రాష్ట్ర సముద్ర తీరం లో
ఉన్నాయి ?
ఎ ) మండపం ,
బి ) థోo డి ,
సి ) రామేశ్వరం
డి ) పైవన్నీ
జవాబు : డి
70)డ్రాఫ్ట్ నేషనల్ వాటర్ పాలసీ (జాతీయ జల పాలసీ )
తయారు చేసేందుకు కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ ఇటీవల నియమిoచిన కమిటీ చైర్మన్ ఎవరు ?
ఎ ) శశి శేఖర్
బి )మిహిర్ షా
సి ) ఎ.బి.పాండ్య
డి ) హర్ష భన్ వాల
జవాబు : బి
71) జాబెర్వాన్ రేంజ్ ఎక్కడుంది ?
ఎ ) డెహ్రాడున్
బి ) శ్రీ నగర్ , J&K
సి ) గాంగ్ టక్
డి ) డార్జీలింగ్
జవాబు : బి
72) లా పాజ్
నగరం ఏ దేశపు పరిపాలనా పర రాజధాని ? (దీనికి ‘సుక్రే’ న్యాయపర రాజధాని. )
ఎ ) మెక్సికో
బి ) బొలీవియా
సి ) పెరాగ్వే
డి ) క్యూబా
జవాబు : బి