1)92వ అకాడమీ అఫ్
మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ & సైన్స్ (ఆస్కార్ అవార్డ్ లు ) ఇటీవల వేటికి
ఇచ్చారు ?
ఎ )ఉత్తమ చిత్రం : ‘పారసైట్’ ( దక్షిణ కొరియా
దేశ, బోంగ్ జూన్ – హో నుండి వచ్చిన
చిత్రం.
బి)ఉత్తమ నటుడు : జోక్విన్ ఫీనిక్స్ (సినిమా :
‘జోకర్ ‘ )
సి)ఉత్తమ నటి : రెనీ జెల్ వెగర్ (సినిమా : ‘జూడి ‘)
డి )పైవన్నీ
జవాబు : డి
2)’ఆపరేషన్ వానిల్లా ’ దేనికి సంబంధించినది ?
వివరాలు ఏవి ?
ఎ ) మడగాస్కర్ దేశం లో తీవ్ర తుఫాను తర్వాత
జరిగిన ప్రాణ నష్టం , ఆస్థి నష్టం ను తగ్గించటానికి భారత దేశం చేసే సహాయ సహకారాలకు
సంబంధించినది
బి) హిందూ మహాసముద్రం లో ఉన శ్రీ లంక, మాల్దీవులు
, మారిషస్ , సీషెల్స్ లను కూడా వానిల్లా ఐలాండ్స్ (దీవులు ) అని విదేశాంగ శాఖ
వారు పిలుస్తున్నారు
సి)INS అరిహాంత్ ఇటీవల మడగాస్కర్ కి కావాల్సిన
ఆహారం, వస్త్రాలు , మందులు , నీరు వంటి రిలీఫ్ మెటీరియల్ సరఫరా చేసింది
డి )పైవన్నీ
జవాబు : డి
3 ) ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) COVID-19 అనే
కొత్త పేరు దేనికి పెట్టింది ?
ఎ )రుబెల్లా
బి)
నావెల్ కోరోనా వైరస్ వ్యాధి (co అంటే కోరోనా ; vi అంటే వైరస్ ; d అంటే
డిసీజ్ ; 19 అంటే 2019 సంవత్సరం ). సి) ఎబోలా
డి )జికా
జవాబు : బి
4) 31.1.2020 అర్ధ రాత్రి యూరోపియన్ యూనియన్ నుండి
బ్రిటన్ నిష్క్రమించింది . ఇప్పుడు ఇంకా EU లో ఉన్న దేశాల వారి వివరాలు ఏవి ?
ఎ )27 సభ్య దేశాలు
బి) 450 మిలియన్ పౌరులు
సి)20 మిలియన్ కన్నా ఎక్కువ వ్యాపారాలు
డి ) పైవన్నీ
జవాబు : డి
5) ‘ఎలక్షన్ ఇంజనీరింగ్ ‘ అనే ప్రక్రియ లో ఏ అంశాలను పరిశీలిస్తారు ?
ఎ )పూర్తిగా వెనక బడిన వర్గాల వారి సంక్షేమం
బి)మహిళల సంక్షేమం
సి)అనాదికాలం నుండి సాంఘికంగా , సామాజికంగా
వెలివేయబడిన వారి జీవన సమస్యలు
డి )పైవన్నీ
జవాబు : డి
6)DICGC ద్వారా బ్యాంకు డిపాజిట్ల కు ఇన్సురెన్సు కవర్ ను
ఎంతవరకు పెంచారు ?
ఎ ) రు.5 లక్షల వరకు
బి) రు.10 లక్షల వరకు
సి) రు.15 లక్షలు వరకు
డి )ఇవేవి కావు
జవాబు : ఎ
7) 2020-20 21 కేంద్ర బడ్జెట్ లో, ఈ కింది వాటిలో ఏ టాక్స్ ను ఎత్తి
వేసారు?
ఎ ) DDT ( డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ టాక్స్ )
(గతం లో ఇది 15 % ఉంది )
బి)ప్రాపర్టీ టాక్స్
సి) ప్రోఫెషనల్ టాక్స్
డి )ఇవేవి కావు
జవాబు : ఎ
8) త్వరగా పాడై పోయే వ్యవసాయ పంటలు / ఉత్పత్తు ల
రవాణా కోసం వేటిని ప్రారంభించ దలిచారు ?
ఎ ) కిసాన్ రైల్
బి) కిసాన్ ఉడాన్ ( ఈశాన్య రాష్ట్రాల నుండి )
సి) రిఫ్రిజిరేటేడ్ వ్యాన్ లు
డి )పైవన్నీ
జవాబు : డి
9) ఆదాయం పన్ను కట్టే వారి హక్కులు తెల్సుకునేందుకు , ఇన్ కం టాక్స్ చట్టానికి
దేన్నీ చేర్చ నున్నారు ?
ఎ ) ‘టాక్స్ పేయర్స్ చార్టర్’
బి) కాంట్రాక్టు ఆక్ట్
సి) ID ఆక్ట్
డి ) RBI ఆక్ట్
జవాబు : ఎ
10) 2020- 2021 కేంద్ర బడ్జెట్ లో, ఈ కింది
వాటిల్లో వేటి పై కస్టమ్స్ డ్యూటీ పెంచారు ,?
ఎ )దిగుమతి చేసుకునే , చిన్న పిల్లల ఆట వస్తువులు
బి)దిగుమతి చేసుకునే బూట్లు / కాళ్ళ చెప్పులు
సి) పూర్తిగా నిర్మించబడిన కమర్షియల్ వాహనాలు
డి )పైవన్నీ
జవాబు : డి
11) 2025 నాటికీ భారత దేశం లో పాల ఉత్పత్తి ఇంతకు
చేరాలని నిర్దేశించారు, ఇటీవలి కేంద్ర
బడ్జెట్ లో ( మిలియన్ టన్నులలో ) ?
ఎ ) 150
బి)108
సి) 170
డి ) 200
జవాబు : బి
12) ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ , ఎక్కడ
నిర్వహించదలిచారు ? వివరాలు ఏవి ?
ఎ )KIIT యూనివర్సిటీ కాంపస్, భుబనేశ్వర్
బి)117 ఇన్స్టిట్యూట్ లు పాల్గొంటాయి
సి)3340 క్రీడాకారులు పాల్గొంటారు
డి ) పైవన్నీ
జవాబు : డి
13 ) సుమారు 1000 సంవత్సరాల క్రిందట
నిర్మించిన బృహదీశ్వరాలయం ఎక్కడ ఉంది ?
ఎ ) మైసూరు
బి)తంజావూరు , తమిళనాడు
సి) శ్రావణ బెలగోళ
డి ) హుబ్లి
జవాబు : బి
14) సుప్రీమ్ కోర్ట్ తీర్పు ను అనుసరించి ఏర్పాటు
కానున్న , శ్రీ రామ జన్మభూమి తీర్థ
క్షేత్ర ట్రస్ట్ వివరాలు ఏవి ?
ఎ )దీనిలో 15 మంది సభ్యులు ఉంటారు
బి) ట్రస్ట్ లో శ్రీ కే. పరా శరన్ ఉంటారు
సి)కేంద్ర ప్రభుత్వం సుమారు 67 .703 ఎకరాల భూమిని
ట్రస్ట్ కి బదిలీ చేస్తుంది
డి )పైవన్నీ
జవాబు : డి
15) ఈ కింది వాటిల్లో ఏవి ఎక్క డెక్కడ ఉన్నాయి ?
ఎ ) రాఖి గర్హి : హర్యానా లో ఉంది ; హస్తినాపూర్ :
ఉత్తర ప్రదేశ్ లో ఉంది
బి)శివ సాగర్ : అస్సాం లో ఉంది ; ధోలా వీరా :
గుజరాత్ లో ఉంది
సి)ఆడిఛనల్లూర్ : తమిళనాడు లో ఉంది
డి ) పైవన్నీ ( ఇక్కడ పురావస్తు ప్రదర్శన శాలలు
నిర్మించ నున్నారు )
జవాబు : డి
16) 2020 - 20
21 కేంద్ర బడ్జెట్ లో వైద్య రంగానికి ఏవేవి తెలిపారు ?
ఎ )ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన (PMJAY) కి
రు.6,400 కోట్లు కేటాయించారు
బి)PMJAYకోసం 20,000 ఏమ్పానేల్ డ్ హాస్పిటల్ లు
ఉన్నాయి
సి) PPP పధ్ధతి లో ప్రతి జిల్లాలో ఉన్న ప్రభుత్వ
ఆసుపత్రికి అను బంధం గా ఒక మెడికల్ కలేగే ని ప్రతిపాదించారు
డి )పైవన్నీ ( మొత్తం వైద్య రంగానికి రు.69,000
కోట్లు కేటాయించారు )
జవాబు : డి
17) ఇటీవలి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో న్యుమిస్మాటిక్స్ (నాణాల సేకరణ ) మరియు ట్రేడ్ (వాణిజ్యం
) కి సంబంధించిన మ్యూజియం ఎక్కడ ఏర్పాటు చేయదలిచారు ?
ఎ )హైదరాబాద్
బి) ఓల్డ్ మింట్ బిల్డింగ్ , కోల్ కత
సి)చెన్నై
డి ) ఢిల్లీ
జవాబు : బి
18) 2020 - 20
21 కేంద్ర బడ్జెట్ లో LIC లో షేర్లు IPO
ద్వారా అమ్మటం వంటి పద్ధతులలోను మరియు ప్రభుత్వ రంగ సంస్థ లలో పెట్టుబడుల ఉప సంహరణ
లక్ష్యం గా ఎంత తెలిపారు ? ( రు. కోట్ల లో
)
ఎ ) రు.3 లక్ష కోట్లు
బి) రు.2,10,000
సి) రు.3.4
లక్ష ల కోట్లు
డి )ఇవేవి కావు
జవాబు : బి
19)నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) రివర్స్
ఆస్మాసిస్ (RO) వాటర్ ప్యూరి ఫయర్ల వాడకాన్ని నిషేధించింది ఎందువల్ల ? కారణాలేవి?
ఎ )టోటల్ డిజాల్వ్ డ్ సాలిడ్స్ (TDS) ఒక లీటర్
నీటిలో 500 mg కన్నా తక్కువ ఉన్న చోట్ల
బి)RO లు నీటిని వృధా చేస్తున్నాయి , నీటి నుండి
లవణాలు తొలగించే ప్రక్రియ లో . RO లు తాగే
నీటిలో లో అవసరమైన లవణా ల ను కూడా తొలగిస్తున్నాయి
సి) RO లు బాక్టీరియా ఏజెంట్ లను, ట్రేస్ కెమికల్స్
ను పూర్తిగా తొలగించ లేవు
డి ) పైవన్నీ
జవాబు : డి
20)ఇంటర్నేషనల్ మారి టైం ఆర్గనైజేషన్(IMO) , జనవరి
1, 2020 నుండి 0.5 % కంటే ఎక్కువ సల్ఫర్ ఉన్న శిలాజ ఇంధనాన్ని వినియోగించరాదని
తెల్పింది . IMO లో ఎన్ని దేశాలకు సభ్యత్వం ఉంది ?
ఎ ) 193
బి) 174 దేశాలు ( మరియు 3 అసోసియేట్ సభ్యులు కూడా
ఉన్నారు )
సి) 15
డి ) 28
జవాబు : బి
21) క్రీస్తు శకం 1810 - 1899 మధ్యకాలం లో ఈ కింది వారిలో ఎవరి సారధ్యం
లో జమ్మూ & కాశ్మీర్ మ్యాప్ ను అక్కడున్న
భారత దేశ పర్వత శిఖరాలను లెక్క కట్టటానికి
కృషి చేశారు ?
ఎ ) విలియం లాంబ్ టన్
బి)జార్జ్ ఎవరెస్ట్ ( ఎవరెస్ట్ శిఖరం కు ఈయన పేరు పెట్టారు )
సి)ఆండ్రూ వాగ్ ;
డి ) కెప్టెన్ థామస్ జార్జ్ మాంట్ గోమెరీ
జవాబు : డి
22)ఇటీవల ‘కామన్ వెల్త్’ లో 54 వ దేశం గా ఏది
చేరింది ?
ఎ ) స్విట్జర్లాండ్
బి) మాల్దీవులు
సి)ఆస్ట్రియా
డి )మంగోలియా
జవాబు : బి
23 )ఇటీవల వేటిని రామ్ సార్ సైట్స్ గా
ప్రకటించారు ?
ఎ )మహారాష్ట్ర లో ఉన్న నందూర్ మాధమేశ్వర్
బి )కేషో పూర్ మియానీ, బియాస్ కన్సర్వేషన్
రిజర్వు , నంగల్ (పంజాబ్ )
సి )నవాబ్ గంజ్ , పార్వతి ఆగ్రా , సామాన్,
సంసాపూర్ , సాంది, సర్సా నవార్ (ఉత్తరప్రదేశ్ )
డి )పైవన్నీ ( భారత దేశం లో మొత్తం 37 రామ్ సార్
సైట్స్ ఉన్నాయి . 1971 లో ఇరాన్ లో ఉన్న రాం సార్ సిటీ లో చిత్తడి నేలలు పరిరక్షించుకునేందుకు
అంతర్జాతీయ ఒప్పందం పై ప్రపంచ దేశాలు సంతకాలు చేసాయి )
జవాబు : డి
24) 2020 లో డాఫ్నే ఆఖర్ స్ట్ మెమోరియల్ కప్ (ఆస్ట్రేలియా
ఓపెన్ ) మహిళల సింగిల్స్ విజేత ఎవరు ?
ఎ ) గార్బైన్మురుగుజా
బి) సోఫియా కేనిన్
సి)వీనస్ విలియంస్
డి )పెట్రా క్విటోవా
జవాబు : బి
25) 2020 ఆస్ట్రేలియా ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేత
ఎవరు ?
ఎ )నోవాక్ డిజోకోవిక్ ( సెర్బియా దేశం )
బి)డొమినిక్ థీం
సి) అలెగ్జాండర్ జేవ్ రేవ్
డి )స్టేఫనోస్ త్సిత్సిపాస్
జవాబు : ఎ
26) 2020 - 20
21 కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో, కొత్త
ఇన్ కం టాక్స్ విధానం లో గల స్లాబ్ లు ఏవి ?
ఎ ) 0
నుండి రు. 2.5 లక్షలు; రు.2.5 లక్షల నుండి రు. 5 లక్షలు ; రు.5 లక్షల నుండి
రు. 7.5 లక్షలు ;
బి) రు.7.5 లక్షల నుండి రు. 10 లక్షలు; రు.10
లక్షల నుండి రు. 12 .5 లక్షలు ;
సి) రు.12.5 లక్షల నుండి రు. 15 లక్షలు; రు.15
లక్షలు ఆపైనా
డి ) పైవన్నీ
జవాబు : డి
27) SAGAR వివరాలు ఏవి ?
ఎ )సెక్యూరిటీ & గ్రోత్ ఫర్ అల్ ఇన్ ది
రీజియన్
బి)ఇండియన్ ఓషన్ రీజియన్ (IOR) లో ఉన్న దేశాలకు ,
దీవులకు సంబంధించినది
సి) దీన్ని మార్చ్ 2015 లో భారత ప్రధాన మంత్రి మారిషస్
వెళ్ళినప్పుడు ప్రకటించారు
డి )పైవన్నీ
జవాబు : డి
28) 57 సభ్య దేశాలున్న ఆర్గనైజేషన్ అఫ్ ఇస్లామిక్
కోపరేషన్ (OIC) ఇటీవల ఎక్కడ సమావేశం అయ్యింది ?
ఎ ) కైరో
బి) జెడ్డా , సౌదీ అరేబియా
సి)ట్రిపోలి
డి ) సనా
జవాబు : బి
29) వూహాన్ వివరాలు ఏవి ?
ఎ ) ఇది చైనా లో ఉంది
బి) ఇటీవల ఇక్కడ నావెల్ కోరోనా వైరస్ తీవ్రం గా
ప్రబలింది , చాలా మంది మరణించారు
సి) నావెల్
కోరోనా వైరస్ , జంతువుల నుండి మనుషులకు సోకినట్లు అనుమానిస్తున్నారు
డి ) పైవన్నీ
జవాబు : డి
30) గంగా నది , దాని ఉప నదులు పుట్టిన చోటు నుండి (
హిమానీ నదాల నుండి ) , హరిద్వార్ వరకు గల ప్రవాహ మార్గం లో , ఆయా నదులలో ఎంతెంత e-ఫ్లో
( ఎకలాజికల్ ఫ్లో ) (పర్యావరణ పర ప్రవాహం ) ఉండాలి , సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC)
ప్రకారం ?
ఎ )నవంబర్ , డిసెంబర్, జనవరి , ఫెబ్రవరి , మార్చ్
మాసాలలో : ఈ సీజన్ కి ముందుగా ఉన్న నెల వారి సగటు ప్రవాహం లో 10 % నుండి 20 % వరకు
బి) అక్టోబర్ , ఏప్రిల్, మే నెలలో : సగటు ప్రవాహం
లో 25 %
సి) జూన్ నుండి సెప్టెంబర్ వరకు : సగటు నెలసరి
ప్రవాహం లో 30 %
డి ) పైవన్నీ ( ఇది డిసెంబర్ 20 19 నుండి అమలు
లోకి వచ్చింది )
జవాబు : డి
31) నావెల్ కోరోనా వైరస్ వివరాలు ఏవి ?
ఎ ) దీని మధ్య భాగం లో వైరల్ రైబో న్యూక్లిక్ యాసిడ్
(RNA) ఉండి , జెనెటిక్ బ్లూ ప్రింట్ ని మోసుకు పోతుంది
బి) ఈ వైరస్ కి
బాహ్య పొర ‘ప్రోటీన్ షెల్’ ఉండి ,
లోపల ఉన్న RNA ని రక్షిస్తుంది
సి) ఈ వైరస్ బాహ్య పొర మీద ఉన్న పోగులలో గ్లై కో ప్రోటీన్
ఉంటుంది , ఇది హోస్ట్ యొక్క జీవ కణాలకు అతుక్కుని , ఇన్ ఫెక్షన్ కల్గ చేయటానికి
కారణం అవుతుంది
డి ) పైవన్నీ
జవాబు : డి
32)రాణి రామ్ పాల్ దేనిలో ప్రఖ్యాత క్రీడా కారిణి(ఈమె వరల్డ్ గేమ్స్ అథ్లెట్ అఫ్ ది
ఇయర్ బహుమతి పొందింది ) ?
ఎ ) చెస్
బి)హాకీ
సి) ఫుట్ బాల్
డి ) టెన్నిస్
జవాబు : బి
33 ) GDP దృష్ట్యా( US $ 2.9 ట్రిలియన్ ) 2019 లో భారత దేశ ఎకానమీ సైజు ప్రపంచం లో 5 వ
స్థానం. ఈ అంశం లో , ఏ దేశం ప్రధమ స్థానం లో ఉంది ?
ఎ ) USA ( US $ 21.4
ట్రిలియన్ )
బి) చైనా ( US $ 14.1
ట్రిలియన్ )
సి) జపాన్ ( US $ 5.2
ట్రిలియన్ )
డి ) జర్మనీ ( US $ 3.9
ట్రిలియన్ )
జవాబు : ఎ
34)2019 - 2020 (BE) లో భారత దేశ GDP లో ఫిస్కల్
డెఫిసిట్ (లోటు ) శాతం ఎంత ?
ఎ ) 5.4
బి)3.7
సి)3.3
డి )3.4
జవాబు : సి
35) జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ (ZBNF) అంటే
ఏమిటి ? వివరాలు ఏవి ?
ఎ ) 1990 దశకం మధ్య భాగం లో సుభాష్ పాలేకర్ ,
మహారాష్ట్ర వ్యవసాయదారుడు ఈ పధ్ధతి ప్రారంభించాడు
బి)రసాయనిక ఎరువులతో వచ్చిన హరిత విప్లవానికి (
గ్రీన్ రివల్యూషన్) మారుగా ఇది వచ్చింది. ఈ వ్యవసాయం లో ఎలాంటి కెమికల్ ఫెర్టిలైజ
ర్స్/క్రిమి సంహారక రసాయనాలు వాడరు
సి) జీవామృతాన్ని (ఆవు మూత్రం , బెల్లం , పప్పుల
పొడి , నీరు , మట్టి కలిపి దీన్ని తయారు చేస్తారు
) వ్యవసాయం లో వాడతారు
డి )పైవన్నీ
జవాబు : డి
36) 2019
లో పద్మ విభూషణ్ ఎవరికిచ్చారు ?
ఎ ) శ్రీ విశ్వేశ తీర్థ స్వామి
బి)M.C.మేరికాం
సి)ఛన్నూ లాల్ మిశ్ర
డి )పై అందరూ
జవాబు : డి
37) భారత దేశం లో తలపెట్టిన, ‘బ్లూ ఎకానమీ ‘ వివరాలు ఏవి ?
ఎ )2024 – 2025 నాటికీ రు. లక్ష కోట్ల విలువ గల
చేపల ఎగుమతులు భారత దేశం నుండి
చేయాలి
బి)2022 -
2023 నాటికీ 200 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి చేయాలి
సి) ఆల్గే పెంచటం , సముద్ర నాచు , ‘కేజ్ కల్చర్ ‘
వంటివి ప్రోత్సహించాలి
డి )పైవన్నీ
జవాబు : డి
38) ఫెబ్రవరి 2019 నుండి అక్టోబర్ 2019 మధ్య కాలం
లో, మొత్తం గా, RBI వడ్డీ రేట్ లు ఎన్ని
bps (బేసిస్ పాయింట్ లు ) తగ్గించింది ?
ఎ ) 15
బి) 25
సి) 135
డి ) 20
జవాబు : సి
39) రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా , వాణిజ్య బ్యాంకు
లకు ఒక లక్ష కోటి రూపాయల వరకు ఎంత శాతం రేపో రేట్ పై రుణాలు ఇవ్వదలచింది ?
ఎ ) 6 %
బి) 7 %
సి) 5.15 %
డి ) 10 %
జవాబు : సి
40) వాణిజ్య బ్యాంకు లు జనవరి 31, 2020 నుండి జూలై
31 , 20 20 వరకు ఇచ్చే ఎలాంటి రుణాల మీద CRR 4 % చొప్పున మెయిన్ టైన్ చేయనవసరం
లేదని రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా తెల్పింది ?
ఎ ) గృహ రుణాలు
బి) ఆటో రుణాలు
సి) MSME రుణాలు
డి ) పైవన్నీ
జవాబు : డి
41) డెఫ్ ఎక్స్ పో (డిఫెన్సు ఎక్స్ పో ) ఇటీవల ఎక్కడ
నిర్వహించారు . ఇక్కడ తొలి ఇండియా- ఆఫ్రికా డిఫెన్సు మినిస్ట ర్స్ కాన్
క్లేవ్ లో చేసిన డిక్లరేషన్ లో ‘టెర్రరిజం’
అంశాన్ని ప్రముఖం గా ప్రస్తావించారు ?
ఎ ) లక్నో
బి) పాట్నా
సి) డార్జిలింగ్
డి ) ప్రయాగ
జవాబు : ఎ
42) ఈ కింది వాటిల్లో ఏవి ల్యాండ్ లాక్డ్ (అనగా
సముద్ర తీరం లేని దేశాలు ) మధ్య ఆసియా దేశాలు ?
ఎ ) కజక్ స్తాన్ ; కిర్గి స్తాన్ ;
బి)తజకి స్తాన్ ;
సి)తుర్క్ మెని స్తాన్ ; ఉజ్ బెకి స్తాన్
డి ) పైవన్నీ
జవాబు : డి
43 ) ప్రస్తుతం సెంట్రల్ ఆసియా దేశాలతో ,
భారత దేశం వేటి ద్వారా వాణిజ్యం చేస్తోంది
?
ఎ ) బందర్ అబ్బాస్ , ఇరాన్ ద్వారా
బి)ఉత్తర యూరోప్ ద్వారా
సి) చైనా ద్వారా
డి )పైవన్నీ
జవాబు : డి
44) అస్సాం లో ఉండే బోడో లతో ఎప్పుడెప్పుడు ఒప్పందాలు చేసుకున్నారు ?
ఎ ) 1993 ఒప్పందం
బి) 2003 ఒప్పందం ( దీని ద్వారా బోడో ల్యాండ్
టెర్రిటోరియల్ కౌన్సిల్ ఏర్పడింది )
సి)2020 ఒప్పందం
డి )పైవన్నీ
జవాబు : డి
45) జపాన్ లో ఫుకుషిమా న్యూక్లియర్ పవర్ రియాక్టర్ ల
లోని అణుఇంధనాన్ని కూల్ చేయటానికి నీటిని వాడతారు . ఇలా రియాక్టర్ ల నుండి బయటికి
వచ్చిన నీటిలో చాలా స్వల్పం గా ఉండే ‘ట్రి షియం’ , ఏ మూలకం యొక్క ఐసోటోప్ ?
ఎ ) ఆక్సిజన్
బి) హైడ్రోజన్
సి)నైట్రోజన్
డి ) అమోనియా
జవాబు : బి
46) చైనా లో వ్యాపించిన నావెల్ కోరో నా వైరస్
వ్యాధి లక్షణాలు దేనికి దగ్గర పోలికలతో ఉంది ?
ఎ )స్మాల్ పాక్స్
బి) సివియర్ యా క్యూట్ రేస్పి రేటరి సిండ్రోమ్
(SARS)
సి)చికెన్ పాక్స్
డి )మీజిల్స్
జవాబు : బి
47)2019- 2020 లో LIC యొక్క గ్రాస్ ఈక్విటీ పెట్టు బడులు
రు.72,000 కోట్లు. సెప్టెంబర్ 20 19
నాటికీ , LIC యొక్క ఆస్తులు రు.32.26 లక్షల కోట్లు . LIC చైర్మన్ ఎవరు ?
ఎ )పద్మజ చుండ్రు
బి) M.R.కుమార్
సి) అశోక్ కుమార్ ప్రధాన్
డి )మృత్యుంజయ్ మహాపాత్ర
జవాబు : బి
48) కీ బుల్ లాం జావో నేషనల్ పార్క్ , ఏ సరస్సు లో
ఉంది ?
ఎ ) దాల్ సరస్సు
బి) సాంభార్ సరస్సు
సి) లోక్ తక్ సరస్సు , మణిపూర్
డి ) చిలకా
సరస్సు
జవాబు : సి
49) ఇండియన్ నేషనల్ ఆర్మీ ( స్వతంత్ర సంగ్రామ కాలం
లో బ్రిటిష్ వారిని ఓడించిన తర్వాత ) ఎక్కడ హెడ్ క్వార్టర్స్ ఏర్పరచుకున్నది ?
ఎ ) కటక్
బి) మొయి రాంగ్ , మణిపూర్
సి) భుబనేశ్వర్
డి ) ఆలిపూర్
జవాబు : బి
50) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ? (అడవులు : గిరిజనుల
హక్కులు )
ఎ ) FRA: ఫారెస్ట్ రైట్స్ యాక్ట్
బి)IFR : ఇండివిడ్యు వల్ ఫారెస్ట్ రైట్స్
సి)CFR : కమ్యూనిటీ ఫారెస్ట్ రైట్స్ ( గిరిజనుల ను
అభివృద్ధి లో భాగస్వామ్యులు చేశారు, మహారాష్ట లో )
డి ) పైవన్నీ
జవాబు : డి
51)బంగ్లా దేశ్ - భూటాన్- ఇండియా- నేపాల్ మోటార్
వెహికల్స్ అగ్రిమెంట్ (BBIN-MVA) నుండి ఏ దేశం తప్పుకుంటా నన్నది ?
ఎ )శ్రీ లంక
బి) భూటాన్
సి) మాల్దీవులు
డి ) మారిషస్
జవాబు : బి
52) విదేశాల నుండి వచ్చే టూరిస్ట్ ల మీద రోజుకి రు.1200 టూరిజం ఫీజు
వసూలు చేయాలని ,ఇటీవల ఏ దేశం ప్రతిపాదించింది
?
ఎ )ఇండోనేషియా
బి)ఫిలిప్పీన్స్
సి)భూటాన్
డి )మలేసియా
జవాబు : సి
53 ) ‘సా గోల్ కాంగ్ జీ ‘ అనే పోలో గేమ్ ని
మణిపూర్ లో గుర్రాల మీద కూచుని అడతారు .
భారత దేశం లో ఉన్న గుర్రాల జాతులు ఏవి ?
ఎ ) మార్వారీ ; కథియ వారి
బి )జన్ స్కా రి ; స్పితి
సి)మణిపురి పోనీ
డి )పైవన్నీ
జవాబు : డి
54)బోడో ల్యాండ్ టెర్రిటోరియల్ ఏరియా డిస్ట్రిక్ట్ (BTAD)
ఏ జిల్లా లను /ప్రాంతాలను కలుపు తూ ఉంది ?
ఎ )కొక్రా ఝార్ ; చిరాంగ్
బి)బాక్సా
సి)ఉదాల్ గురి
డి )పై వన్ని
జవాబు : డి
55)ఈ కింది వాటిల్లో ఏవి ఎయిర్ ఇండియా కి
సంబంధించినవి ?
ఎ )146 ఎయిర్ క్రాఫ్ట్ లున్నాయి ( వీటిలో 56 %
స్వంతవి )
బి)మహారాజా , ఫ్లయింగ్ స్వాన్ , సూర్యుడు , అనే మూడు లోగోలు ఉన్నాయి
సి)9617 మంది పెర్మనెంట్ ఉద్యోగులు ఉన్నారు
డి ) పైవన్నీ
జవాబు : డి
56) ఢిల్లీ లో ఉన్న చారిత్రాత్మక ప్రదేశాలు ఏవి ?
ఎ )ఖిలా రాయ్ ఫితోరా (11 వ శతాబ్దం నాటిది) (
ఇక్కడ ఢిల్లీ ఆర్ట్ హిస్టరీ మ్యూజియం రానున్నది )
బి)సిరి ఫోర్ట్ ; తుగ్లకా బాద్ ; జహానా పనాహ్
సి)ఫిరోజా బాద్ ; పురానా ఖిలా ; షాజహానా బాద్
డి ) పైవన్నీ
జవాబు : డి
57)10.2.1929 నాడు ది ఏరో క్లబ్ అఫ్ ఇండియా &
బర్మా (ఇది రాయల్ ఏరో క్లబ్ అఫ్ గ్రేట్ బ్రిటన్ కి అను సంధాన మైనది )నుండి ఏవియేటర్స్
సర్టిఫికేట్ (ఫ్లైయింగ్ లైసెన్స్ ) తీసుకున్న తొలి భారతీయుడు ఎవరు ?
ఎ ) రాకేశ్ శర్మ
బి)JRD టాటా
సి)ఆదిత్య మిశ్రా
డి )సునీతా విల్లియమ్స్
జవాబు : బి
58) భారత దేశం లో 29,964 ఏనుగులు ఉన్నాయి. వీటిని
వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ యొక్క షెడ్యూల్ 1 లో చేర్చాలి. కన్సర్వేషన్ అఫ్ మైగ్రేటరి
స్పీసీస్ అఫ్ వైల్డ్ యనిమల్స్ (CMS) యొక్క 13వ కాన్ఫరెన్స్ అఫ్ పార్టీస్ (CoP-13 )
ను ఫెబ్రవరి 2020 లో ఎక్కడ నిర్వహించ దలిచారు ?
ఎ )కోట రాజస్తాన్
బి)గాంధీ నగర్ , గుజరాత్
సి) ఇండోర్ , మధ్య ప్రదేశ్
డి )భోపాల్
జవాబు : బి
59)ఇండియన్ నేషనల్ డిఫెన్సు యూనివర్సిటీ (INDU)
వివరాలు ఏవి ?
ఎ ) కార్గిల్ రివ్యూ కమిటీ (1999 లో ) INDU ను
ఏర్పాటు చేయ్యమని రికమేండ్ చేసింది
బి)మే 2010లో కేంద్ర కాబినెట్ సూత్రప్రాయం గా
ఆమోదం తెలిపింది . రు.395 కోట్లు ప్రాజెక్ట్ వ్యయం అనుకున్నారు. (ఇప్పుడిది రు.4,00.22
కోట్లకు రివైజ్ చేయబడింది )
సి)సెప్టెంబర్ 2012 లో గూర్గావ్ లో ఏర్పాటు
చేయదలిచారు
డి )పైవన్నీ (ఇంకా మిగిలిన పనులపై ప్రయత్నాలు కొనసాగుతున్నాయి )
జవాబు : డి
60) భారత దేశానికీ చెందినా తొలి ‘గగన్ యాన్ ‘ లో
ప్రయాణించే అంతరిక్ష యాత్రీకులకు శిక్షణ ఇచ్చే ‘గ్లావ్ కాస్మోస్ ‘ సంస్థ ఏ దేశానికీ చెందినది ?
ఎ )ఫ్రాన్స్
బి) బ్రిటన్
సి)రష్యా
డి ) చైనా
జవాబు :సి
61) కావేరి డెల్టా వివరాలేవీ ?
ఎ ) తమిళనాడు లో దీన్ని ‘రైస్ బౌల్ ‘ అంటారు
బి)కావేరి డెల్టా లో 8 జిల్లాలు ఉన్నాయి
సి) ఇక్కడ 28 లక్షల ఎకరాల్లో 33 లక్షల టన్నుల వరి
ధాన్యాన్ని పండిస్తారు
డి ) పైవన్నీ [ కావేరి డెల్టా ని ఇప్పుడు
ప్రొటెక్టెడ్ స్పెషల్ అగ్రికల్చరల్ జోన్ (PSAZ) ప్రకటించ దలిచారు ]
జవాబు : డి
62) నావెల్ కోరోనా వైరస్ ని అంతర్జాతీయ పబ్లిక్
హెల్త్ ఎమర్జెన్సీ గా ఎవరు పరిగణించారు ?
ఎ )UNESCO
బి) WHO
సి)UNICEF
డి )ILO
జవాబు : బి
63 )కరప్షన్ పర్ సెప్షన్ ఇండెక్స్ (CPI-2019)
లో భారత దేశ స్థానం ఎంత ?
ఎ ) 80
బి)12
సి)28
డి )32
జవాబు : ఎ
64)ఢిల్లీ లో ఇటీవల నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికలలో
ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్ని సీట్లలో గెలుపొందింది ?
ఎ )67
బి)70
సి)62
డి )10
జవాబు : సి
65 )
యూరోపెయన్ యూనియన్ నుండి బ్రిటన్ తప్పుకున్నది . బ్రిటన్ దేశ జాతీయ జెండా ను ఏమని
పిలుస్తారు ?
ఎ )నిస్షోకి
బి) యూనియన్ జాక్ ఫ్లాగ్
సి)రెడ్ ఫ్లాగ్
డి )స్విస్ క్రాస్ ఫ్లాగ్
జవాబు : బి
66) 71 వ రిపబ్లిక్ డే పెరేడ్ లో ప్రదర్శించిన వి
ఏవి ?
ఎ ) A-SAT :యాంటి శాటిలైట్ మిస్సైల్ సిస్టం (DRDO
దీన్ని మిషన్ శక్తి గా పేర్కొన్నది )
బి)ADCTR :ఎయిర్ డిఫెన్సు టాక్టికల్ కంట్రోల్
రాడార్
సి) CH-47F(I) :ఛినూక్ హెలికాప్టర్లు ఆకాశo లో
ఎగిరాయి
డి )పైవన్నీ
జవాబు : డి
67) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ )తుపాకుల గూడెం బారేజ్ : దీనికి సమ్మక్క వన
దేవత పేరు నిర్ణయించారు
బి)అంజన గిరి రిజర్వాయర్ ; పాలమూరు - రంగారెడ్డి
లిఫ్ట్ ఇర్రిగేషన్ స్కీం లో ప్రధాన భాగం
సి)ప్రాణ హిత నుండి లక్ష్మి బారేజ్ వరకు వరద
నీటిని ఎప్పటికప్పుడు పంప్ చేయాలనీ తెలిపారు
డి )పైవన్నీ
జవాబు : డి
68)71 వ రిపబ్లిక్ డే ఉత్సవాలకు ముఖ్య అతిథి గా
వచ్చిన బ్రెజిల్ అధ్యక్షుడు ఎవరు ?
ఎ ) జైర్ బోల్సోనారో
బి)బోరిస్ జాన్సన్
సి) డో నాల్డ్
ట్రంప్
డి )వ్లాదిమిర్ పుతిన్
జవాబు : ఎ
69) అహిల్యా బాయ్ హోల్కర్ (మాల్వా మహారాణి ) పేరు
మీద విశ్వవిద్యాలయం లో చైర్ ను ఏ రంగం లో ఏర్పాటు చేస్తారు ?
ఎ ) ప్రదర్శన కళలు
బి) అడ్మినిస్ట్రేషన్ ( పరిపాలన )
సి) విద్యా సంస్కరణలు
డి ) వైద్యం
జవాబు : బి
70) భారత దేశం లో ప్రధానం గా ఉన్న పగడాల రీఫ్ లు (కాల్షియమ్
కార్బోనేట్ తో ఏర్పడినవి ) ఎక్కడున్నాయి ?
ఎ ) అండమాన్ & నికోబార్ ; లక్ష ద్వీప్
బి)మన్నార్ గల్ఫ్
సి) కచ్ గల్ఫ్ ( మిథా పూర్ సముద్ర తీరానికి
దగ్గరలో బయో రాక్ స్ట్రక్చర్ ని , జూలాజికల్ సర్వే అఫ్ ఇండియా ఏర్పాటు చేసింది )
డి )పై వ న్ని
జవాబు : డి
71) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ )’ఎ బై డ్ విత్ మీ ‘ : హెన్రీ ఫ్రాన్సిస్ లైట్
బి)’వందే మాతరం ‘ : బంకించంద్ర చట్టర్జీ
సి) ‘సారే జహాసే అచ్చా’ : మొహమ్మద్ ఇక్బాల్
డి )పైవన్నీ
జవాబు : డి
72)మొతేరా , అహ్మదాబాద్ లో నిర్మించిన సర్దార్
వల్లభాయ్ పటేల్ క్రికెట్ స్టేడియం వివరాలు ఏవి ?
ఎ ) సీటింగ్ కెపాసిటీ : 1.10 లక్షల మంది
బి)15,000 మంది స్టేజి ముందు గ్రౌండ్ మీద కూర్చో
పెట్టవచ్చును
సి ) ప్రపంచం లోనే అతి పెద్దది
డి )పైవన్నీ
జవాబు : డి