Sunday, 5 January 2020

Vignana Vipanchi January 2020 ఇన్నర్ లైన్ పర్మిట్ (ILP) సిస్టం (వ్యవస్థ ) ఉన్న ఈశాన్య రాష్ట్రాలు ఏవి ?


1) నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్  2011-12 సర్వే  లెక్కల ప్రకారం భారత దేశం లో మొత్తం శ్రామికుల  సంఖ్య 47.41  కోట్లు . వీరిలో  ఎంత మంది  గ్రామాలలో పనిచేసే  కార్మికులు ఉన్నారు ? ( కోట్ల లో )
ఎ )11.50
బి) 13.72
సి) 33.69
డి )23.18
జవాబు :  సి   
2)’ఆపరేషన్ క్లీన్ ఆర్ట్ ‘ దేనికి సంబంధించినది ?
ఎ )ముంగీస అనే జంతువుల కేశాలతో పెయింటర్ లు వాడే కుంచెలు తయారు చేసే చట్ట వ్యతిరేక వ్యాపారాన్ని నిలుపు దల చేయటానికి
బి) ఫోటో లు తీయటానికి
సి) శిల్పాలు చెక్కటానికి
డి ) నగలు చేయటానికి
జవాబు :   
3 )ఏనుగులను మచ్చిక చేసుకుని ‘మనిషికి – జంతువులకు ‘ మధ్య వచ్చే స్పర్ధ ను తగ్గించేందుకు , దక్షిణ భారత దేశం లో చాలా తరాలుగా కృషి చేస్తున్న తెగల వారెవరు ?
ఎ ) కురుంబ
బి) మల సార్
సి)కుట్ట నాయకర్
డి ) పై అందరూ
జవాబు :   డి
4) ఎక్స్ టెండేడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ (ఉత్పత్తి దారులకు పొడిగించబడిన బాధ్యత ) అంటే ఏమిటి ?  
ఎ ) ప్లాస్టిక్ , ఎలక్ట్రానిక్ వంటి వస్తువులను వినియోగ దారులకు సరఫరా చేసిన తర్వాత , ప్లాస్టిక్ వంటి ప్యాకేజింగ్ మెటీరియల్ ను తిరిగి సేకరించటం మరియు  పర్యావరణాన్ని కాపాడటం 
బి) నగలు తయారు చెయ్యటం
సి) మార్కెటింగ్ చేసుకోవటం
డి ) బిజినెస్ పెంచుకోవటం
జవాబు : ఎ    
5) ఇన్నర్ లైన్ పర్మిట్ (ILP) సిస్టం (వ్యవస్థ ) ఉన్న ఈశాన్య రాష్ట్రాలు ఏవి ?
ఎ ) అరుణాచల్ ప్రదేశ్
బి) మిజోరాం
సి)నాగాలాండ్
డి )పైవన్నీ
జవాబు :   డి
6) రెండేళ్ళ కోసారి విడుదల చేసే ‘ఇండియా స్టేట్ అఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ‘ (ISFR) లో ఏ ఏ అంశాలు ఉంటాయి ?
ఎ )అటవీ ప్రాంతం ; అడవి లో ఉన్న మొక్కల సాంద్రత
బి) రాష్ట్రాలలో మొక్కలు ఉన్న విస్తీర్ణత
సి) అధికారికంగా ‘అడవి ‘ అని తెల్పిన ఏరియా కు బయట ఉన్న ప్రదేశాలలో పెంచుతున్న చెట్ల అభివృద్ధి
డి ) పైవన్నీ
జవాబు :   డి
7) INSTEX (ఇన్స్ట్రుమెంట్ ఇన్ సపోర్ట్ అఫ్ ట్రేడ్ ఎక్స్ చేంజెస్ ను ) బార్టర్ (వస్తు మార్పిడి ) మెకానిజం ను ఫ్రాన్స్, జర్మనీ , యునైటెడ్ కింగ్ డం , ప్రారంభించాయి . దీనిలో  ఏ దేశాలు చేరటానికి సిద్ధం గా ఉన్నాయి  ?
ఎ )బెల్జియం , డెన్మార్క్
బి)ఫిన్లాండ్ , ది నెదర్లాండ్స్
సి)నార్వే , స్వీడన్
డి )పైవన్నీ
జవాబు :   డి
8) ‘మాల్టా ‘ దీవి ఏ సముద్రం లో ఉంది ?
ఎ ) బంగాళా ఖాతం
బి)మధ్య ధరా సముద్రం
సి) అరేబియా సముద్రం
డి ) సౌత్ చైనా సముద్రం
జవాబు :   బి
9) ‘అమూర్ నది ‘ (హీలాంగ్ జి యాంగ్ నది లేక బ్లాక్ డ్రాగన్ నది )  రష్యాలో ఏ దేశానికీ సరిహద్దు లో పారుతోంది ?
ఎ ) జపాన్
బి) థాయిలాండ్
సి)చైనా
డి ) వియత్నాం
జవాబు : సి    
10) భారత దేశాన్ని సందర్శించిన కింగ్ కార్ల్ XVI గుస్తాఫ్ మరియు క్వీన్ సిల్వియా  ఏ దేశ పాలకులు ?
ఎ ) ఇంగ్లాండ్
బి) ఆస్ట్రియా
సి) స్వీడన్
డి ) పోలాండ్
జవాబు :   సి
11) కొత్తగా ఏర్పాటు చేసిన ‘చీఫ్ అఫ్ డిఫెన్సు స్టాఫ్ ‘ (CDS) చేసే పనులు ఏవి ?
ఎ )ప్రభుత్వానికి సింగల్ పాయింట్ సలహా దారు 
బి) మిలిటరీ కొనుగోళ్ళు , మరియు స్ట్రాటజిక్ అంశాలపై పర్యవేక్షణ
సి) ట్రైనింగ్ మరియు లాజిస్టిక్స్
డి )పైవన్నీ
జవాబు :   డి
12) FASTag (ఫాస్టాగ్ ) వివరాలు ఏవి ?
ఎ )రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ఎనేబుల్డ్ టాగ్
బి) ప్రి పెయిడ్ ఫాస్టాగ్ కోసం , ముందుగా డబ్బు చెల్లించి , జాతీయ రహదారుల పై ఉన్న టోల్ గేటు ల గుండా వాహనం లో వెళ్ళ వచ్చును
సి) ఇది ఎలక్ట్రానిక్ పద్ధతిలో టోల్ చెల్లించే విధానం . దీన్ని డిసెంబర్ 15 , 20 19 నుండి అన్ని వాహనాలకు అమలు చేయదలిచారు
డి )పైవన్నీ
జవాబు :   డి
13 ) రు.700 కోట్ల ఖర్చు తో , 63 ఎకరాల విస్తీర్ణం లో,  1.10 లక్షల మంది ప్రేక్షకులు కూర్చో గల సర్దార్ పటేల్ స్టేడియం ను ఎక్కడ నిర్మిస్తున్నారు ?   
ఎ ) కాన్పూర్
బి) మోతేరా, అహమ్మదాబాద్ , గుజరాత్
సి) ఇండోర్
డి ) భువనేశ్వర్
జవాబు :   బి
14) 13 వ సౌత్ ఆసియా గేమ్స్ ( SAG) (దక్షిణ ఆసియా క్రీడలు ) ఎక్కడ నిర్వహించారు ?
ఎ ) కొలంబో
బి)ఖాట్మండు , నేపాల్
సి) ఢాకా
డి ) ఇస్లామాబాద్
జవాబు :   బి
15) లియోనెల్ మెస్సి అందుకున్న బహుమతులు ఏవి ?
ఎ ) లాలిగా
బి)కోపా డెల్ రే
సి) ఛాంపియన్స్ లీగ్ ; బాలన్ డి ఓ రో
డి )పై వ న్నీ
జవాబు :   డి
16) ది ఫెడరల్ మింట్ , స్విస్ మింట్ (స్విస్ దేశానికీ చెందిన ఫెడరల్ టంకశాల ) తొలి సారిగా 20 ఫ్రాంక్ ల వెండి నాణా న్ని ఏ క్రీడాకారుడి  కోసం విడుదల చేసింది ?
ఎ )రోజర్ ఫెదరర్
బి) క్రిస్టియానో రోనాల్డో
సి) సోఫీ డి వైన్
డి )మోహుల్ భౌమిక్
జవాబు : ఎ   
17) కోల్ కతా లో బ్రిటిష్ వారి పరిపాలనా కాలం లో (క్రీస్తు శకం 1787 లో )  నిర్మించిన చర్చి లో ఎవరెవరి సమాధులు  ఉన్నాయి ?
ఎ )జార్జ్ చార్నోక్ (కోల్ కోత ని నిర్మించాదంటారు . క్రీస్తు శకం 1693 జనవరి లో మరణించాడు )
బి)వైస్ అడ్మిరల్ చార్లెస్ వాట్సన్ ( ఈయన రాబర్ట్ క్లైవ్ తో పాటు మద్రాస్ నుండి బెంగాల్ వచ్చాడు. బెంగాల్ నవాబు నుండి కోల్ కత ని జయించటానికి )
సి)లార్డ్ బ్రా బౌర్న్ ; లేడీ కానింగ్ ; ఫ్రాన్సిస్ (బేగం ) జాన్సన్
డి ) పై అందరూ (ఇందు లోనే ఒక రూమ్ లో వారెన్ హేస్టింగ్ ఆఫీస్ ఉండేది . ఆయన శిరోజాలు, ఒక సీసాలు భద్ర పరిచారు )
జవాబు :    డి
18) ఇటీవల దాద్రా & నాగర్ హవేలీ మరియు డయ్యూ & డామన్ లను కలిపి ఒకే కేంద్ర పాలిత ప్రాంతం గా చేయ సంకల్పించారు . దీని ద్వారా ప్రభుత్వ సేవలు ఉత్తమం గా అందుతాయి. దీని తర్వాత భారత దేశం లో మొత్తం  ఎన్ని కేంద్ర పాలిత ప్రాంతాలు ఉంటాయి ?
ఎ ) 8  
బి) 4
సి) 2
డి ) 3
జవాబు : ఎ   
19) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ ) MNPSP : ఎం ఎన్ పి యస్ పి : మొబైల్ నెంబర్ పోర్ట బిలిటి సర్వీస్ ప్రొవైడర్   
బి) UPG: యు పి జి : యూనిక్ పోర్టింగ్ కోడ్ ( ఇది 8 డిజిట్ ల ఆల్ఫా న్యుమేరిక్ కోడ్ )
సి) TRAI : టెలికాం రెగ్యులేటరి అథారిటీ అఫ్ ఇండియా
డి ) పై వన్ని
జవాబు :   డి
20) పోలార్ సైన్సు (ధ్రువ ప్రాంత   విజ్ఞానం ) మీద , భారత దేశం ఇటీవల ఏ దేశం లో ఒప్పందం చేసింది ? 
ఎ ) ఇటలీ
బి) స్వీడన్
సి) మెక్సికో
డి ) ఆర్జెంటినా
జవాబు :   బి

21) పీక్టు పర్వత ప్రాంతం లో ‘శామిజ్యోన్’ అనే ఆధునిక నగరాన్ని ఏ దేశం లో ప్రారంభించారు ?
ఎ ) మంగోలియా
బి) ఉత్తర కొరియా
సి) తైవాన్
డి ) ఫిలిప్పీన్స్
జవాబు :   బి
22) భారత దేశ యొక్క  విదేశీ ద్రవ్య నిధుల నిల్వలు డిసెంబర్ 3 , 20 19 నాటికీ ఎంత ? ( బిలియన్ US $ లలో )  
ఎ ) 274.8
బి) 451.7
సి) 175
డి ) 38.8
జవాబు : బి   
23 ) భారత దేశ జి డి పి (GDP) వృద్ధి రేటు ప్రస్తుత ఆర్ధిక సంవత్సరపు ( 2019 – 2020 ) రెండవ త్రైమాసికం (క్వార్టర్ ) లో ఎంత ?
ఎ ) 4.5 %
బి) 5 %
సి) 6 %
డి ) 7 %
జవాబు :   
24) కోల్ ఇండియా లిమిటెడ్ వేటిని నాన్ - రెగ్యులేటెడ్ సెక్టార్స్ (NRS) అంటోంది , పేమెంట్ ఫెసిలిటీ కోసం ?  
ఎ ) స్టీల్
బి) స్పాంజ్
సి) సిమెంట్, అల్యూమినియం
డి )పైవన్నీ
జవాబు :    డి
25) టైఫాయిడ్ జ్వరం దేని వల్ల వస్తుంది ?
ఎ ) సాల్మొనెల్లా టైఫి బాక్టీరియా
బి) క్లోస్ట్రిడియం దిఫిసిలి
సి) మైకో బాక్టీరియమ్ ట్యూబర్ క్యు లో సిస్
డి ) ఈ . కోలి
జవాబు :    
26) పెరల్ హార్బర్ బేస్ ఎక్కడుంది ?
ఎ ) కెనడా
బి) హవాయ్ , USA
సి) ఫ్రాన్స్
డి ) ఇటలీ
జవాబు :   బి
27) ‘ఖ మిష్లి’ అనే నగరం , (డి ఫాక్టో రాజధాని ) ఎవరిదీ ?
ఎ ) సిరియన్ ఖుర్ది ష్ ల కు
బి) పాలస్తీనావాసులు
సి) ఈజిప్ట్
డి ) యెమెన్
జవాబు :   
28) బారేలా , భిల్ , కొర్కు ట్రైబల్ జాతుల వారు ఎక్కడ నివసిస్తున్నారు ?
ఎ ) తమిళనాడు
బి) కర్ణాటక
సి) బుర్హాన్ పూర్ , ఖండ్వా జిల్లా
డి )కేరళ
జవాబు :   సి
29)55వ జ్ఞాన పీఠ బహుమతి ఎవరికిచ్చారు ?
ఎ ) అక్కిథం అచుతన్ నంబూద్రి 
బి) జి. శంకర కురూప్
సి)అమితావ్ ఘోష్
డి )కృష్ణ సోబ్తి
జవాబు :   
30 ) శాంతి దీవి (ఐ ల్ అఫ్ పీస్ ) లేక అల్ -  బకౌరా ఏ దేశానికీ చెందినది ? ( ఇక్కడ నుండి పిన్ హాస్ రూటెన్ బెర్గ్ యొక్క నాహా రాయిమ్ జలవిద్యుత్ కేంద్రాన్ని చూడచ్చు )
ఎ ) జోర్డాన్
బి) కువైట్
సి) యు.ఏ.ఈ .
డి ) ఇథియోపియా
జవాబు :   

31 ) ఎంప్లాయిస్ స్టాక్ ఆప్షన్ ప్లాన్ (ESOP) గురించి ఏది కరెక్ట్ ?
ఎ )తాము పని చేసే కంపెనీ యొక్క షేర్ల ను కొనుక్కోటానికి , ఆ కంపెనీ ఉద్యోగస్తులకు ఇచ్చే ఒక అవకాశo ఇది
బి) వీటి ద్వారా ఉద్యోగస్తులకు , కంపెనీ లాభాలలో వాటా లభిస్తుంది , మీటింగ్ లలో పాల్గొన వచ్చును
సి) ఇటీవల కొన్ని కంపెనీ లు , రి స్ట్రిక్టేడ్ స్టాక్ యూనిట్ (RSU) పేరుతొ ESOP లాంటివి ఇస్తున్నాయి
డి )పైవన్నీ
జవాబు :    డి

32) ఈ కింది రాష్ట్ర అసెంబ్లీ లలో , దేనిలో , ‘కంపోజిట్ ఫ్లోర్ టెస్ట్ ‘ నిర్వహించారు, ఫెబ్రవరి 1998 లో  ?
ఎ )ఉత్తర ప్రదేశ్
బి) కర్ణాటక
సి)మహారాష్ట్ర
డి ) గోవా
జవాబు : ఎ 

33 ) కాఫీ తోటలు , కర్ణాటక , కేరళ , తమిళ నాడు  , ఆంధ్ర ప్రదేశ్ ( అరకు లోయ ) లో ఉన్నాయి. కాఫీ పౌడర్ లో కలిపే ‘చికోరి ‘ మొక్కలను ( భారత దేశానికీ కావాల్సిన దానిలో 97 % వరకు )   ఎక్కడ పెంచుతారు ?
ఎ ) గుజరాత్, ఉత్తరప్రదేశ్
బి) ఆంధ్ర ప్రదేశ్
సి) ఒడిష
డి ) కేరళ
జవాబు :   
34  ) ‘బుల్ బుల్ ‘ అనే తూఫాను ఏ ప్రాంతాన్ని తాకింది ?
ఎ ) గుజరాత్
బి) పశ్చిమ బెంగాల్ లోని కోస్తా జిల్లాలను 
సి) రాజస్తాన్
డి ) పంజాబ్
జవాబు :   బి
35  ) క్రీస్తు శకం 1912 – 19 13 మధ్య కాలం లో సర్ ఎడ్విన్ లూట్యేన్స్ మరియు సర్ హెర్బర్ట్ బేకర్ , ఢిల్లీ లో ఉన్న పార్లమెంట్ భవనాన్ని డిజైన్ చేశారు . 1921 లో నిర్మాణం ప్రారంభ మయ్యి , 1927 లో భవనం  పూర్తయ్యింది . దీని వృత్తాకార డిజైన్ కి స్పూర్తి నిచ్చిన 11వ శతాబ్దపు చౌ సాత్ యోగిని ఆలయం (లేక ) ఏక త్తార్సో మహాదేవ ఆలయం ఎక్కడుంది ?    
ఎ )మోరేనా జిల్లా, మధ్య ప్రదేశ్
బి) కోణార్క్ , ఒడిష
సి) మహాబలిపురం
డి ) చిదంబరం
జవాబు : ఎ    
36) భారత రాజ్యాంగం లోని అధికరణలు (ఆర్టికల్స్) 163(2) & 164(1) ఎవరి అధికారాలను తెలుపు తాయి ?  
ఎ ) రాష్ట్ర హై కోర్ట్ న్యాయమూర్తుల
బి) అడ్వకేట్ – జనరల్
సి) రాష్ట్ర గవర్నర్ ల
డి ) డిజిపి
జవాబు :   సి
37)  వ్యవసాయ దారులు వాడుకునే  విత్తనాల కు సంబంధించి  ఏ ఏ  అంశాలు చర్చలలో ఉన్నాయి  ?
ఎ ) ట్రేడ్ రిలేటెడ్ యా స్పెక్ట్స్ అఫ్ ఇంట లేక్ట్యువల్ ప్రాపర్టీ రైట్స్ (TRIPS). (వ్యాపార సంబంధిత మేధో సంపత్తి హక్కులు ) దీనిపై భారత దేశం 1992 లో సంతకం చేసింది
బి) ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ది ప్రొటెక్షన్ అఫ్ న్యూ వెరైటీస్ అఫ్ ప్లాంట్స్ (UPOV) (కొత్త రకాల మొక్క ల రక్షణ కు అంతర్జాతీయ యూనియన్ ) లో 2002 లో భారత దేశం చేరింది
సి) కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటి (1992 ) (జీవ రాశుల వైవిధ్యపు సమావేశం ) ; ఇంటర్నేషనల్ ట్రీయటి ఆన్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్ ఫర్ ఫుడ్ & అగ్రికల్చర్ (2001 ) . ఇవి రైతుల హక్కులను రక్షిస్తున్నాయి . 2001 లో భారత దేశం చేసిన ప్రొటెక్షన్ అఫ్ ప్లాంట్ వెరైటీస్ & ఫార్మర్స్ రైట్స్ (PPVFR) చట్టం మేధో సంపత్తి హక్కుల ఆశయాల్ని కాపాడుతోo ది
డి )పైవన్నీ
జవాబు :   డి
38) 2019 - 20 ఆర్ధిక సంవత్సరం లో భారత దేశం లో   గూడ్స్ & సర్వీసెస్ టాక్స్ వసూళ్లు ఏ నెలలో అతి తక్కువగా ఉంది ?
ఎ )అక్టోబర్
బి) మే
సి) సెప్టెంబర్ , 2019
డి ) జూన్
జవాబు : సి   
39) సెప్టెంబర్ 2018 లో ప్రకటించిన PM-AASHA (ప్రధాన మంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ్ అభియాన్ ) అమలుకు 2 సంవత్సరాల కు రు.15 ,053 కోట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది . ఈ పధకం పరిధి లోకి వచ్చే పంటలు ఏవి ?  
ఎ )పప్పు ధాన్యాలు
బి) నూనె గింజలు
సి) కొబ్బరి
డి ) పైవన్నీ
జవాబు :    డి
40) ‘పెన్స కోలా బీచ్ ‘ ఎక్కడుంది ?
ఎ ) ఆస్ట్రేలియా
బి) ఫ్లోరిడా రాష్ట్రము , USA
సి) జపాన్
డి ) చైనా
జవాబు :   బి

41) ‘భారత్ బాండ్ ETF’ వివరాలేవీ ?
ఎ ) ఇది ఎక్స్ చేంజ్ ట్రేడెడ్ ఫండ్ ( కనీస పెట్టుబడి రు.1000 /- )
బి) ప్రభుత్వ రంగ సంస్థ ల ‘డెట్ సెక్యూరిటీ ‘ ఇండెక్స్ ను ,ఈ ఫండ్ ట్రాక్ చేస్తుంది ( దీనిలో CPSE, CPSU,CPFI లు విడుదల చేసే బాండ్ లు ఉంటాయి )  
సి) ఎడేల్ వీస్ MF, భారత్ బాండ్ ETF ల రెండు సిరీస్ ను విడుదల చేస్తుంది . (ఒకటి ఏప్రిల్ 2023 కి మెచూర్ అవుతుంది . రెండోది ఏప్రిల్ 20 30 లో మెచూర్ అవుతుంది )
డి ) పై వన్ని
జవాబు :   డి
42) ‘డేటా ప్రొటెక్షన్ (డేటా రక్షణ ) బిల్లు 20 18 వివరాలేవీ ? ఇందులో గల అంశాలు ఏవి ?
ఎ )దీన్ని సుప్రీమ్ కోర్ట్ మాజీ న్యాయమూర్తి బి. యన్.శ్రీ కృష్ణ నేతృత్వం లో ఉన్న కమిటీ ద్వార వచ్చిన అంశాలతో రూపొందించారు
బి)సెన్సేషనల్ పర్సనల్ డేటా ను ఇది వర్గీకరిస్తుంది  
సి)పర్సనల్ డేటా ని , భారత దేశం లోనే భద్ర పరచాలి . కాని దీన్ని విదేశాలలో ప్రాసెస్ చెయ్య వచ్చును
డి ) పై వన్ని
జవాబు :   డి
43 )  భారత రాజ్యాంగం లో  ఆర్టికల్ (అధికరణం ) 334 - బి లో ఎవర్ని   గురించి  ఉంది ?
ఎ )  ఆంగ్లో – ఇండియన్ ల నామినేషన్ గురించి లోక్ సభ లో (  ఇద్దరు )  మరియు రాష్ట్ర అసెంబ్లీ లలోనూ
బి) లోక్ సభ అధికారాలు
సి) సుప్రీమ్ కోర్ట్ అధికారాలు
డి ) రాజ్య సభ అధికారాలు
జవాబు : ఎ    
44) నేషనల్ ఇంటలిజెన్స్ గ్రిడ్ (NATGRID) ప్రాజెక్ట్ వివరాలు ఏవి ?
ఎ ) 2009 లో, రు.2,800 కోట్ల బడ్జెట్ తో దీన్ని ప్రారంభించారు
బి) కేంద్ర ప్రభుత్వపు 10 ఏజెన్సీ లు (అనగా ఇంటలిజెన్స్ బ్యూరో , రీసెర్చ్ & ఎనాలిసిస్ వింగ్ వంటివి ) , దీనిలో గల డేటా ను పొందవచ్చును
సి)NATGRID , ప్రూఫ్ అఫ్ టెక్నాలజీ (POT) కోసం అప్లికేషను సాఫ్ట్ వేర్ ని అభివృద్ధి చేసింది
డి )పైవన్నీ
జవాబు :    డి
45) గుర్తించ బడిన  8 జాతీయస్థాయి రాజకీయ  పార్టీలు, గుర్తించబడిన 52 రాష్ట్ర స్థాయి రాజకీయ  పార్టీ లు , గుర్తించ బడని 2487 రాజకీయ పార్టీ లు  ఎలక్షన్ కమిషన్ అఫ్ ఇండియా దగ్గర రిజిస్టర్ అయ్యి ఉన్నాయి. ఎలెక్టోరల్ బాండ్ ల ద్వారా డబ్బు స్వీకరించటానికి ఒక రాజకీయ పార్టీ కి ఎంత శాతం వోట్లు వచ్చి ఉండాలి అంటున్నారు , లోక్ సభ ఎన్నికల్లో గాని , అసెంబ్లీ ఎన్నికల్లో గాని ? 
ఎ ) 1 % ( లా మినిస్ట్రీ రికమండేషన్ ప్రకారం )
బి) 10 %
సి) 20 %
డి ) 30 %
జవాబు :   
46) డిసెంబర్ 26 , 2019 నాటి సూర్య గ్రహణం భారత దేశం లో తొలుత ఎక్కడ కనిపిస్తుంది ?
ఎ ) అండమాన్ దీవులు
బి) కాసర్ గాడ్ జిల్లా ( చెరువాత్తూర్ )
సి) అరుణాచల్ ప్రదేశ్
డి ) నాగాలాండ్
జవాబు :   బి
47) ‘బేలం గుహలు ‘ ఏ జిల్లలో ఉన్నాయి ?
ఎ ) విశాఖ పట్నం
బి) ఒడిష
సి) కర్నూల్ (కందవోలు ) జిల్లా , ఆంధ్ర ప్రదేశ్
డి ) మధ్య ప్రదేశ్
జవాబు :   సి
48)భారత దేశ స్వాతంత్ర్య నంతరం , రాజ్య సభ తొలి సమావేశం మే 13 , 1952 నాడు జరిగింది . ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ ) ఇటీవల ‘రాజ్య సభ : ది జర్నీ సిన్స్ 1952 ‘ అనే పుస్తకం విడుదల చేశారు
బి) ఇప్పటి వరకు 2280 రాజ్య సభ సభ్యులు పని చేశారు. 250 సెషన్ లు జరిగాయి 
సి) ఈ 67 ఏళ్ల సుదీర్ఘ కాలం లో రాజ్య సభ లో కేవలం ముగ్గుర్ని మాత్రమే సభ నుండి  బయటికి పంపించారు
డి ) పై వన్ని
జవాబు :   డి
49) గొట బయా రాజ పక్ష ఏ దేశానికీ 7 వ ఎగ్జిక్యూటివ్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు ?
ఎ ) థాయిలాండ్
బి) శ్రీ లంక
సి) వియత్నాం
డి ) దక్షిణ కొరియా
జవాబు :   బి
50) ఇటీవల ‘వైట్ ఐలాండ్ ( వాకారి దీవి ) లో ఉన్న అగ్ని పర్వతం పేలింది . ఇది ఏ దేశం లో ఉంది ?
ఎ ) న్యూ జిలాండ్
బి) ఫిలిప్పీన్స్
సి) ఇండోనేషియా
డి )జపాన్
జవాబు :   

51) UNDP విడుదల చేసిన 2019 హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ (మనవ అభివృద్ధి సూచిక ) లో భారత దేశం ఎన్నవ స్థానం లో ఉంది ?
ఎ ) 189
బి)129
సి) 131
డి ) 25
జవాబు : బి    
52) మానవ అభివృద్ధి సూచిక (హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ) ను లెక్కించటానికి ఏ ఏ అంశాలను పరిగణన లోకి తీసుకుంటారు UNDP వారు ?
ఎ ) ఆ దేశం లో  మనుషులు ఎంత కాలం బ్రతుకుతున్నారు (ఆయుర్దాయం )
బి) ఆ దేశం లో ప్రజల విద్య
సి) ఆ దేశం ప్రజల తలసరి ఆదాయం
డి ) పై మూడు అంశాలు
జవాబు :    డి
53 ) జెండర్ ఇన్ ఈక్వాలిటీ ఇండెక్స్ (G I I ) (లింగ అసమానత సూచిక ) లో భారత దేశం రాంక్ ఎంత ?
ఎ ) 122
బి)162
సి) 39
డి )86
జవాబు : ఎ   
54) వరల్డ్ యాంటి – డోపింగ్ ఏజెన్సీ (WADA) అధ్యక్షుడు క్రెయిగ్ రీడీ . WADA(వాడా ) ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం స్విట్జర్లాండ్ లోని లా సన్నే లో నిర్వహించారు .  ఇటీవల ఏ దేశ క్రీడా కారులను వాడా ( WADA) 4 ఏళ్ల పాటు క్రీడల్లో పాల్గొనకుండా నిషే దించింది ( డోపింగ్ టెస్ట్ ల గురించి తప్పుడు సమాచారాన్ని ఇవ్వటం వలన ) ?
ఎ ) రష్యా
బి) ఇరాక్
సి) ఇరాన్
డి ) సిరియా
జవాబు :   
55) మిస్ యూనివర్స్ ( 2019 ) గా గెలుపొందిన జోజి బినితున్ జి ఏ దేశ మహిళ ?
ఎ ) USA
బి) దక్షిణ ఆఫ్రికా
సి) జింబాబ్వే
డి ) జోర్డాన్
జవాబు :    బి
56) ఫిన్లాండ్ దేశ కొత్త ప్రధాన మంత్రి ఎవరు ?
ఎ ) సన్నా మారిన్
బి) ఒలేక్సి హో న్ ఛారుక్
సి) ఆంట్టి రిన్నీ
డి ) జస్టిన్ ట్రూ డో
జవాబు :   
57) ఏ దేశాల నుండి వచ్చే   6 మతస్థులకు (హిందూ, క్రిస్టియన్ , బౌద్ధ , సిక్కు , పార్శి , జోరాస్ట్రియన్ ) , భారత దేశం లో పౌర సత్వం కల్పించే సిటిజెన్ షిప్ అమెండ్ మెంట్ బిల్ (CAB)(పౌర సత్వ సవరణ బిల్లు ) ను లోక్ సభ 311  వోట్ల తో ఆమోదించింది ?
ఎ ) పాకిస్తాన్ ,
బి)  బంగ్లాదేశ్ ,
సి) ఆఫ్ఘనిస్తాన్
డి ) పై మూడు దేశాల నుండి
జవాబు : డి
58) ఇస్రో (ISRO) ప్రయోగించిన కార్టో శాట్  - 3 ఉపగ్రహం వివరాలు ఏవి ?
ఎ ) బరువు : 1560 కిలోగ్రాములు
బి) 509 కి.మీ. దూరం నుండి భూమి మీద 25 సెంటిమీటర్ల ప్రమాణం లో ఉన్న వస్తువులను గుర్తించ గలదు
సి) దీన్ని PSLV-C47 రాకెట్ ద్వారా ప్రయోగించారు
డి ) పైవన్నీ
జవాబు :    డి
59)   1919 లో జలియన్ వాలా బాగ్ సంఘటన జరిగినప్పుడు , వైస్రాయ్ గా ఎవరున్నారు ?  
ఎ ) చెమ్స్ ఫోర్డ్
బి)రూథర్ ఫోర్డ్
సి) హంటర్
డి ) ఇర్వింగ్
జవాబు :   
60)   ‘కాలా పాని’ అనే భూభాగం / ప్రాంతం(ఉత్తరాఖండ్ ) , ఏ దేశానికీ సరిహద్దు లో ఉంది ?
ఎ ) ఆఫ్ఘనిస్తాన్
బి)  నేపాల్   
సి) అజర్బేజాన్
డి ) కిర్గిస్తాన్
జవాబు :   బి

61) భారత రాజ్యాంగం లోని ఆర్టికల్ 6 ప్రకారం , పాకిస్తాన్ నుండి భారత దేశం లోనికి ప్రజలు వలస రావటానికి ఉన్న కామన్ కట్ ఆఫ్ డేట్ ( తారీకు ) ఏది ?
ఎ )25.3.1971
బి) 1.12.1963
సి) 19.7.1948
డి ) 15.8.1947
జవాబు :   సి
62) కేంద్ర ప్రభుత్వం ఏ ప్రభుత్వ రంగ కంపెనీ లలో తనకు గల షేర్ లలో ఎంత శాతం షేర్లను అమ్మదలచింది ?
ఎ )BPCL : 53.29 %
బి)షిప్పింగ్ కార్పొరేషన్ అఫ్ ఇండియా : 63.75 %
సి)కంటైనర్ కార్పొరేషన్ అఫ్ ఇండియా (CONCOR) : 30 . 8 %
డి )పైవన్నీ ( 2019-20 లో పెట్టుబడుల ఉప సంహరణ లక్ష్యం : రు.1.05 లక్షల కోట్లు )
జవాబు :   డి
63 ) కొత్తగా ప్రతిపాదించిన ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ బిల్ 2016 లో ఏ అంశాలకు చెందినా చట్టాలు కవర్ అవుతాయి ?
ఎ ) కార్మిక సంఘాలు
బి)పారిశ్రామిక ఉద్యోగం
సి) పారిశ్రామిక తగాదాలు
డి )పైవన్నీ
జవాబు :    డి
64) రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా , దేనికి ,  ఆర్ . సుబ్రమణియ కుమార్ ణి అడ్మినిస్ట్రేటర్ గా నియమించింది ?
ఎ ) DHFL
బి) ఎయిర్ ఇండియా
సి) స్టీల్ అథారిటీ అఫ్ ఇండియా
డి ) ఇవేవికావు
జవాబు :   
65) 1.4.2020 నుండి ఏ రంగం లో BS-VI ఎమిషన్ నార్మ్స్ (నియమావళిని ) అమలు చేయదలిచారు ?
ఎ ) రైల్వే ఇంజిన్ లకు
బి) ఆటోమొబైల్స్ ( డీజిల్  వంటి తైల ఇంధనాల తో నడిచే మోటారు వాహనాలు )
సి) విమానాలకు
డి ) జలాంతర్గాములకు
జవాబు :   బి
66) ఈడెన్ గార్డెన్స్ , కోల్ కతా లో నిర్వహించిన పగలు – రాత్రి ఆడే క్రికెట్ టెస్ట్ మ్యాచ్ కి ‘పింక్ ‘ బంతి ని ఎంచుకున్నారు . ఏ కారణాలచేత ?
ఎ ) రాత్రి పూట స్పష్టం గా కనిపిస్తుంది . బాల్ తో చాలా సేపు ఆడ వచ్చును
బి)దీని షైనింగ్ చాలా కాలం ఉంటుంది. ఎక్కువగా స్వింగ్ ఉంటుంది
సి)20 15 లో దీనితో ఆడారు
డి ) పైవన్నీ
జవాబు :   డి
67) 50 వ అంతర్జాతీయ భారత దేశ ఫిలిం ఫెస్టివల్ లో రజనీకాంత్ , ఇస బెల్లె హప్పర్ట్ కి గోల్డ్ న్ జూబిలీ అవార్డు లు ఇచ్చారు  . ఇసబెల్లె హప్పర్ట్ వివరాలేవీ ?
ఎ ) ఫ్రెంచ్ సినిమా నటిమణి
బి)1971 లో లే ప్రస్షియాన్ అనే సినిమా తో ఆమె కెరీర్ ప్రారంభించారు
సి) 120 సినిమాలలో నటించింది
డి ) పైవన్నీ
జవాబు :    డి
68) కొల్లేరు సరస్సు కి శీతాకాలం లో గ్రే పెలికాన్స్ , పెయింటెడ్ స్తోర్క్ అనే కొల్లేటి కొంగలు వస్తాయి . కొల్లేరు వివరాలు ఏవి ?
ఎ )కృష్ణ జిల్లా కి – పశ్చిమ గోదావరి జిల్లా కి సరిహద్దు లో ఉంది ( కైకలూరుకి దగ్గరగా ఉంది )
బి) ఆట పాక పక్షి సంరక్షణ కేంద్రం ఉంది . ఇక్కడకు విదేశీ  కొంగలు వస్తాయి
సి) అడివి లంక , ఆగడాల లంక , ఇంగిలి పాక లంక లో కూడా విదేశీ  కొంగలు గ్రుడ్లు పెట్టటానికి వస్తాయి
డి )పైవన్నీ (కొల్లేరు సరస్సు మంచి నీటి  సరస్సు )
జవాబు :   డి
69) లోక్ పాల్ ఆఫీస్ కి ‘లోగో ‘ , ‘మోటో’ నిర్ణయించారు . లోగో (చిహ్నం )లో జడ్జ్ బెంచ్ ఆకృతిని , 3 న్యాయమూర్తుల ఆకృతి పెట్టారు .అశోక చక్రం, పుస్తకం ఆకృతి , రెండు చేతులు , 3 రంగులలో ఉన్నాయి. ‘మో టో’ గా దేన్నీ తీసుకున్నారు ?
ఎ ) ‘మా గ్రిధా కాశ్యా స్వి ధనం ‘ ( ఎవరి సంపదకోసం వెంపర్లాడకు/ఆశించకు  )
బి) సత్యమేవ జయతే
సి) ధర్మో రక్షతి రక్షితః
డి ) యోగ క్షేమం వహామ్యహం
జవాబు :   
70) UNEP(యు ఎన్ ఈ పి ) యొక్క 25 వ కాన్ఫరెన్స్ అఫ్ పార్టీస్ (COP25) సమావేశం మాడ్రిడ్ , స్పెయిన్ లో నిర్వహించారు . పారిస్ ఒప్పందం ప్రకారం ఉన్న 1.5 డిగ్రీ ల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత లక్ష్యాన్ని సాధించాలంటే 2020- 2030 మధ్య కాలం లో, ప్రతి సంవత్సరం ఎంత శాతం గ్రీన్ హౌస్ వాయువుల విడుదల తగ్గించాలి ?   
ఎ ) 7.6 %
బి) 20 %
సి) 15 %
డి ) 25 %
జవాబు :   

71) గ్రీన్ హౌస్ వాయువులను విడుదల చేసే దేశాలలో ఏ దేశం అగ్ర స్థానం లో ఉంది ?
ఎ ) USA
బి) చైనా
సి) భారత్
డి ) జపాన్
జవాబు :    
72) ఎలక్ట్రానిక్ సిగరెట్స్ నిషేధ  బిల్ 2019 వివరాలు ఏవి ?  
ఎ )ఇది  ఈ – సిగరెట్ల ను నిషేధిస్తుంది . దీనిలో తెలిపిన నేరాలకు పాల్పడిన వారికీ 3 ఏళ్ల జైలు శిక్ష , రు.5 లక్ష ల వరకు జరిమానా విధించ వచ్చును
బి) వీటి తయారీ, ఉత్పత్తి, ఎగుమతి/దిగుమతి , అమ్మకం, నిల్వ , ప్రకటనలు అన్ని నేరంగానే పరిగణిస్తారు
సి) తొలి సారి తప్పు చేసిన వారికీ ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష , ఒక లక్ష వరకు జరిమానా విధించవచ్చును
డి )పైవన్నీ
జవాబు :    డి
73 ) ముద్రా (MUDRA) (మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రి ఫైనాన్సు ఏజెన్సీ ) రుణాల మొండి బాకీ లు 20 19 – 2020 ఆర్ధిక సంవత్సరం లో ఎంత ? (రు.కోట్ల లో )  
ఎ ) 16,481.45
బి) 9,204.14
సి) 10,000
డి ) 5,000
జవాబు :   
74) సీలేరు నది మీద , చిత్ర కొండ దగ్గర బలిమెల డ్యాo నిర్మించారు . బలిమెలా రిజర్వాయర్ ఎక్కడుంది ? ( ఈ రిజ ర్వాయర్  దగ్గర ఉన్న  గురుప్రియ నది మీద బ్రిడ్జ్ ని, ఇటీవలే  నిర్మించారు )
ఎ ) మల్కాన్ గిరి జిల్లా , ఒడిష
బి) మధ్య ప్రదేశ్
సి) ఉత్తర ప్రదేశ్
డి ) జమ్మూ & కాశ్మీర్
జవాబు :   
75) 15 వ ఆర్ధిక సంఘం కాల పరిమితిని ఎప్పటి వరకు పొడిగించారు ? వివరాలు ఏవి ?
ఎ ) అక్టోబర్ 30 , 20 20
బి) దీని రిపోర్ట్ 6 సంవత్సరాల వరకు పనికొస్తుంది ( 20 20 -2026 )
సి) గతం లో , 9 వ ఆర్ధిక సంఘం రిపోర్ట్ కూడా 6 సంవత్సరాలు ఉపయోగపడింది ( NKP సాల్వే దీని అధ్యక్షుడు )
డి )పైవన్నీ
జవాబు :   డి
76)మా డ్డెన్ – జూలియన్ ఆస్సి లేషన్ (MJO)చేసే మేఘాల  వివరాలు ఏవి ?
ఎ ) 12,000 నుండి 20,000 కిలోమీటర్లు భూగోళం చుట్టూ తిరుగుతుండే మేఘాలకు సంబంధించినది ఇది
బి) ఈ మేఘాలు హిందూ మహా సముద్రం – పసిఫిక్ మహా సముద్రం ఉపరితలాల నీటిని తాకు తుం టాయి .
సి) ఈ మేఘాలు  హిందూ మహాసముద్రం మీద 15 రోజులు ఉంటాయి . పశ్చిమ పసిఫిక్ మహా సముద్రం పై 23 రోజులు ఉంటాయి
డి ) పైవన్నీ
జవాబు :    డి
77) అక్టోబర్ 20 19 లో ప్రభుత్వ రంగ బ్యాంకులు , మరియు NBFC లు ఎంత విలువ గల రుణాలు ఇచ్చాయి ( రు.లక్షల కోట్ల లో ) ?
ఎ ) 2.52
బి) 1.5
సి) 1.75
డి ) ఇవేవి కావు
జవాబు :