Monday, 7 October 2019

Vignana Vipanchi October బ్రిటిష్ దేశ హౌస్ అఫ్ కామన్స్ ( పార్లమెంట్ దిగువ సభ ) లో ఎంతమంది సభ్యులున్నారు ?



1)ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ లు కొనే ఎథనాల్ దేన్నించి తయారు చేస్తారు ?  (ఎథనాల్ బ్లెండెడ్ ప్రోగ్రాం కింద ఎథనాల్ ను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ లు కొంటాయి  ) .    
ఎ ) చెరకు గెడ రసం / షుగర్ / షుగర్ సిరప్ (దీని  నుండి తయారుచేసిన ఎథనాల్  ధర రు.59.48 ఒక లీటర్ కి )
బి ) B-హెవీ మొలాసిస్ (దీని నుండి చేసిన ఎథనాల్ ధర రు.54 .27 ఒక లీటర్ కి )
సి ) C-హెవీ మొలాసిస్ (దీని నుండి తయారు చేసిన ఎథనాల్ ధర రు.43.75 ఒక లీటర్ కి ) ;   మరియు పాడై పోయిన ఆహార ధాన్యాల / మిగిలిపోయిన పంట గింజల  పదార్ధాల   నుండి కూడా ఎథనాల్ తయారు చేయవచ్చును.
డి ) పైవన్నీ
జవాబు :  డి
2) పెట్రోల్ లో అధికం గా ఎథనాల్ ను కలపటం వలన కలిగే ప్రయోజనాలు ఏవి ?
ఎ ) పెట్రోల్ వంటి వాటి కోసం దిగుమతుల మీద ఆధార పడటం తగ్గుతుంది ; వ్యవసాయ రంగానికి సపోర్ట్ లభిస్తుంది
బి )పర్యావరణ హితమైన ఇంధనం ఇది ; వాతావరణ కాలుష్యం చాలా  తక్కువ
సి ) రైతులకు అదనపు ఆదాయం లభిస్తుంది
డి )  పైవన్నీ ( ఎథనాల్ ను పెట్రోల్ లో కలపటం వలన , వాహనాల లలో ఇంధనం మండించటం వల్ల ఏర్పడే  వాయు కాలుష్యం తగ్గుతుంది ; విదేశీ మారక ద్రవ్యం కూడా ఆదా అవుతుంది )
జవాబు : డి
3) యార్లాంగ్ జోంగ్ బో నది (బ్రహ్మపుత్ర నది ) మరియు సట్లేజ్ నదులు ఎక్కడ ఉద్భవించి ప్రవహిస్తున్నాయి ?
ఎ ) మయన్మార్
బి ) టిబెట్
సి ) ఆఫ్ఘనిస్తాన్
డి )  ఇరాన్
జవాబు : బి
4) బ్రిటిష్ దేశ హౌస్ అఫ్ కామన్స్ ( పార్లమెంట్ దిగువ సభ ) లో ఎంతమంది సభ్యులున్నారు ?
ఎ ) 450
బి ) 545
సి ) 650
డి ) 250
జవాబు : సి
5) బ్రిటిష్ పార్లమెంట్ ని 5 వారాలు ప్రోరోగ్ ( పోస్ట్ పోన్  అనుకోవచ్చు ) చేయమని బ్రిటిష్ దేశ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ కోరారు . ఆదేశం లో ప్రోరోగ్ చేసే అధికారం ఎవరి కుంది ?
ఎ ) హౌస్ అఫ్ లార్డ్స్
బి ) క్వీన్ ఎలిజబెత్ II (మోనార్క్ ) (ప్రధాన మంత్రి అభ్యర్ధన  మీద )
సి ) ఛాన్సలర్ అఫ్ ఎక్స్చెకర్
డి ) UK సుప్రీమ్ కోర్ట్
జవాబు : బి
6) రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహక పురస్కార్ ఇటీవల ఎవరికిచ్చారు  ?
ఎ ) పంజాబ్ యూనివర్సిటీ (చండీఘర్ )
బి ) విమల్ కుమార్
సి ) గగన్ నారంగ్ స్పోర్ట్స్ ప్రమోషన్ ఫౌండేషన్ , గో స్పోర్ట్స్ , రాయల సీమ డెవలప్మెంట్ ట్రస్ట్
డి ) సందీప్ గుప్తా
జవాబు :  సి
7) ఇటీవల RBI , కేంద్ర ప్రభుత్వానికి ఎంత మొత్తం ట్రాన్స్ఫర్ చేయ్యదలిచింది ( రు.లక్షల కోట్ల లో )
ఎ ) 1.76
బి ) 0.50
సి ) 0 . 306
డి ) 0.658
జవాబు : ఎ
8) బ్యాంకులు రేపో – రేట్ – లింక్డ్ లోన్ ప్రొడక్ట్స్ వేటిని ఇవ్వదల్చుకున్నాయి ?
ఎ ) హోం లోన్స్
బి ) వెహికల్ లోన్స్
సి )మార్టిగేజ్ మరియు కాష్ – క్రెడిట్ లోన్ ప్రొడక్ట్స్
డి ) పైవన్నీ
జవాబు :  డి
9) 10 పబ్లిక్ సెక్టార్ బ్యాంకు లను విలీనం చేసి 4 అతి పెద్ద బ్యాంకు లను ఏర్పాటు చేయదలిచింది , కేంద్ర ప్రభుత్వం.  ఇండియన్ బ్యాంకు మరియు అల్లహాబాద్ బ్యాంకు కలిసి ఒకటిగా ఏర్పడతాయి.  ఈ కింది వాటిలో ఏవేవి కలియ నున్నాయి ?
ఎ ) PNB + OBC + యునైటెడ్ బ్యాంకు అఫ్ ఇండియా (ఒకటిగా )
బి ) కెనరా బ్యాంకు + సిండికేట్ బ్యాంకు (ఒకటిగా )
సి ) యూనియన్ బ్యాంకు అఫ్ ఇండియా + ఆంధ్ర బ్యాంకు + కార్పొరేషన్ బ్యాంకు (ఒకటిగా )
డి )  పైవన్నీ
జవాబు :  డి
10) కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ సెక్టార్ బ్యాంకు లకు ఇవ్వదలిచిన రు.55,000 కోట్ల లో , ఏ బ్యాంకు కి అత్యధికంగా రు.16,000 కోట్ల ధనం లభించనున్నది ?
ఎ ) పంజాబ్ నేషనల్ బ్యాంకు
బి ) యూనియన్ బ్యాంకు అఫ్ ఇండియా
సి )బ్యాంకు అఫ్ బరోడా
డి )  కెనరా బ్యాంకు
జవాబు : ఎ
11) అమెజాన్ అడవులు, భూమి మీద ఉన్న అతి పెద్ద ట్రాపికల్ ఫారెస్ట్ లు . ఇవి ఎక్కువభాగం ఏ దేశం లో ఉన్నాయి ?
ఎ ) బ్రెజిల్
బి ) పెరు
సి ) బొలీవియా
డి ) మెక్సికో
జవాబు : ఎ
12) మయన్మార్ లో గల ‘బాగన్’ వివరాలేవీ ?
ఎ ) బామర్ ప్రజల తోలి రాజధాని ఇది.
బి )చాలా ప్రాచీన ఆలయాలు గల ‘బాగన్’ , ఇర్రవాడి నదికి దగ్గరలో ఉంది 
సి ) ఇటీవల UNESCOవారు బాబిలోన్ , రోమ్, జైపూర్ లాగా , దీనికి గుర్తింపు నిచ్చింది
డి ) పైవన్నీ
జవాబు :  డి
13) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ ) ఆంగ్ కోర్ వాట్ : కంబోడియా
బి )బోరో బిదూర్ : ఇండోనేషియా
సి ) అయుథాయ : థాయిలాండ్
డి )  పైవన్నీ (ప్రాచీన ఆలయాలు : దేశాలు )
జవాబు :  డి
14) విరూపాపూర్ గద్ది (దీవి పేరు  ) ఎక్కడ ఉంది
ఎ ) హంపి కి దగ్గర ( కర్ణాటక )
బి ) మైసూరు
సి ) ఈరోడ్
డి )  త్రివేoడ్రం
జవాబు : ఎ
15) చీఫ్ అఫ్ డిఫెన్సు స్టాఫ్ ( CDS ) వివరాలేవీ ?
ఎ ) 2000 సంవత్సర తోలి రోజుల్లో గ్రూప్ అఫ్ మినిస్టర్స్ CDS ఏర్పాటు చేయమని రేకంమేండ్ చేసింది
బి ) ఇటీవల ప్రధాన మంత్రి CDS ని ఏర్పాటు చేస్తామని చెప్పారు
సి ) CDS అధీనం లో ట్రై-సర్వీసెస్ స్పేస్ & సైబర్ ఏజెన్సీస్ కూడా పని చేస్తాయి  ( అండమాన్ & నికోబార్ కమాండ్ కూడా )
డి )  పైవన్నీ
జవాబు :  డి
16) రు.500 కోట్ల రూపాయల నికర విలువ గల కంపెనీ ( లేక ) రు.1000 కోట్ల రూపాయల వార్షిక టర్నోవర్ గల కంపెనీ (లేక ) ఏడాదికి రు.5 కోట్ల నికర లాభాలు ఆర్జించే ఏ కంపెనీ అయినా, తమ గత 3 సంవత్సరాల సగటు లో  , నికర  లాభాలలో  CSR కింద ఎంత ఖర్చు పెట్టాలి ?
ఎ ) 5 %
బి ) 2 %
సి ) 10 %
డి )  15 %
జవాబు :బి  
17) ఆగష్టు 9 , 20 19 నాటికీ ,  RBI లో విదేశీ మారక ద్రవ్య నిధులు ఇంతకు పెరిగాయి ? (US $ బిలియన్ లలో )  
ఎ )398.739
బి )430.572
సి )26.754
డి ) ఇవేవి కావు
జవాబు : బి
18) బజరంగ్ పూనియా & దీపా మాలిక్ లకు ఇటీవల వచ్చిన అవార్డు ఏది ?
ఎ ) రాజీవ్ ఖేల్ రత్న
బి ) అర్జున్ అవార్డు
సి ) ధ్యాన్ చంద్ అవార్డు
డి ) ద్రోణాచార్య అవార్డు
జవాబు :  
19)  భారత దేశం  న్యూక్లియర్ పరీక్ష నిర్వహించిన ‘పోక్రాన్’ ఏ రాష్ట్రములో ఉంది ?
ఎ ) మహారాష్ట్ర
బి ) రాజస్థాన్
సి ) కర్ణాటక
డి )  కేరళ
జవాబు : బి
20)గ్రీన్ ల్యాండ్ , డెన్మార్క్ దేశం లో సెల్ఫ్ – రూలింగ్ భాగం . గ్రీన్ ల్యాండ్ దేశ వివరాలేవీ ?
ఎ ) ఇది నార్త్ అట్లాంటిక్ మహా సముద్రానికి , ఆర్కిటిక్ సముద్రానికి మధ్య లో ఉంది
బి ) డెన్మార్క్ , గ్రీన్ ల్యాండ్ కి కావాల్సిన డిఫెన్సు, ఫారిన్ పాలసీ వ్యవహారాలు చూస్తోంది
సి ) డెన్మార్క్ కి , USA కి మధ్య 1951 లో జరిగిన ఒప్పందం ప్రకారం ఉత్తర గ్రీన్ ల్యాండ్ లో ఉన్న థూలే ఎయిర్ బేస్ మీద మిలిటరీ హక్కులు USA పొందింది
డి )  పైవన్నీ
జవాబు :  డి

21)నేషనల్ సెంటర్ ఫర్ ఎర్త్ సైన్సెస్ స్టడీస్ (NCESS) ప్రకారం (కేరళ వంటి రాష్ట్రాలలో ) కొండ ప్రాంతం లో చరియలు / స్లోప్స్  వర్షా కాలం లో వర్షపు నీటికి కరిగి పడిపోటానికి గల కారణాలు ఏవి ?
ఎ )అత్యధికంగా వర్షం కురవటం , వరదలు రావటం
బి ) స్లోప్ లలో వ్యవసాయ పంటలు వేయటం , సహజ నీటి ప్రవాహ మార్గాలు మూసేయటం
సి ) రోడ్లు, భవనాలు నిర్మించుకోవటం , గ్రానైట్ గనులు తవ్వటం , రబ్బర్ వంటి చెట్ల కు వర్షపు నీటి కుంటలు తవ్వటం
డి )  పైవన్నీ ( ముఖ్యం గా కేరళ లో వయనాడ్ వంటి చోట్ల చరియలు విరిగి పడటానికి ఇవే కారణాలు )
జవాబు :  డి
22) ఇటీవల కాలం లోవిడుదల చేసిన డేటా ప్రకారం ,  భారత దేశ ఆర్ధిక రంగం గురించి ఏది కరెక్ట్ ?
ఎ ) GDP వృద్ధి రేట్ (ఏప్రిల్ – జూన్ 20 19 ) : 5 %
బి )గ్రాస్ ఫిక్స్డ్ కాపిటల్ ఫార్మేషన్ (GFCF) వృద్ధి : 4 %
సి )8 కోర్ సెక్టార్ ఇండస్ట్రీస్ వృద్ధి రేట్ (జూలై , 20 19 లో ) : 2.1 %
డి ) పైవన్నీ
జవాబు : డి
23) జ్వేజ్ డా షిప్ యార్డ్ , వ్లాడి వో స్టాక్  ఏ దేశం లో ఉంది ?
ఎ ) పోలాండ్
బి ) ఐస్ ల్యాండ్
సి ) రష్యా
డి ) ఐర్లాండ్
జవాబు : సి
24) అక్టోబర్ 2 , 20 19 నాడు దేశ వ్యాప్తం గా ప్రారంభించనున్న ‘సింగల్ యూజ్ ప్లాస్టిక్’ ఉపయోగించటం వద్దని చెప్పే కార్యక్రమం వివరాలేవీ ?
ఎ )MoEF&CC నోడల్ మినిస్ట్రీ గా ఉంటుంది
బి )భారత దేశం లో ని మొత్తం ప్లాస్టిక్ వేస్ట్ లో 70% పట్టణ ప్రాంతాల నుండి వస్తుంది
సి ) వాలెంటరీ వర్క్ & అవేర్ నెస్ కూడా ఇందులో భాగం అవుతుంది
డి )  పైవన్నీ
జవాబు : డి
25) క్లాజ్ (a)సబ్ సెక్షన్ (1) సెక్షన్ 35 అన్ లా ఫుల్ ఆక్టివిటీస్ (ప్రి వెన్ షన్) యాక్ట్ (UAPA)19 67 (ఆగష్టు 20 19 లో సవరించారు ) ప్రకారం ఏమి చేయవచ్చును ?  
ఎ ) ఆర్ధిక సహాయం అందించ వచ్చును
బి )హోం అఫైర్స్ మినిస్ట్రీ వారు , తీవ్ర వాదకార్యకలాపాలలో ఉన్న వారిని  ‘టెర్రరిస్ట్ ‘ లు గా డిక్లేర్ చేయవచ్చును
సి ) విదేశాలకు పంప వచ్చును
డి ) సైంటిస్ట్ గా ప్రకటించ వచ్చును
జవాబు : బి
26) హరికేన్ ‘డోరియన్ ‘ ఇటీవల ఎక్కడ భీభత్సం సృష్టించింది ?
ఎ ) న్యూ జీలాండ్
బి )అబాకో & గ్రాండ్ బహమా దీవి
సి ) ఆస్ట్రేలియా
డి ) ఇండోనేషియా
జవాబు : బి
27) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ (,దేశం పేరు :  ఆ దేశం లో ఉన్న బంగారం నిల్వలు ) ?
ఎ ) USA :   8,133.5        టన్నులు
బి )జర్మనీ :   3,366.8     టన్నులు
సి ) ఇండియా :  618.2  టన్నులు
డి ) పైవన్నీ (వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం)
జవాబు : డి
28) అక్టోబర్ 1, 20 19 నుండి ఎలాంటి రుణాలను ఎక్స్ టర్నల్ బెంచ్ మార్క్ – బేస్డ్ లెండింగ్ కు లింక్ చేయమన్నది RBI?
ఎ ) రిటైల్ కస్టమర్ లోన్స్
బి )MSME ఎంటర్ ప్రైజెస్ లోన్స్
సి ) ఫ్లోటింగ్ రేట్ లోన్స్
డి )  పైవన్నీ
జవాబు : డి
29) చంద్రయాన్ – 2  యొక్క    ‘ఆర్బిటర్’  చంద్రుడి చుట్టూ (ధృవం నుండి ధృవానికి ) ఏ కక్ష్య లో  ఉండి తిరుగుతున్నది (4.9.2019 నాటికీ ) ?
ఎ ) 109 KM x 120 KM
బి ) 35 KM x 101 KM
సి ) 96  KM x 125  KM
డి ) 250 KM x 35 550 KM
జవాబు : సి
30) ఇరాన్ దేశ 20 IR-6 అడ్వాన్స్డ్ సెంట్రి ఫ్యూజ్ మిషన్ లను ఉపయోగించి ఎన్ రిచ్డ్ యురేనియం తయారు చేసి , నిల్వలు పెంచుకుంటు న్నట్లు తెలిపింది . 2015 జాయింట్ కంప్రె హెన్ సివ్ ప్లాన్ అఫ్ యాక్షన్ (JCPOA) ప్రకారం ఇరాన్ దేశం యురేనియం ఎన్ రిచ్ మెంట్ కోసం దేన్ని వాడాలి ?
ఎ ) ఫస్ట్ జనరేషన్ (IR-1 ) సెంట్రి ఫ్యూజ్ లు
బి ) బారోమీటర్
సి ) మైక్రో స్కోప్
డి )  గ్రామఫోన్
జవాబు : ఎ

31) భారత దేశ GDP 2024-25 నాటికీ US $ 5 ట్రిలియన్ లకు చేరటానికి 2019 – 20 నుండి 2024 – 25 వరకు , ఇన్ఫ్రా స్ట్రక్చర్ మీద ఎంత ఖర్చు పెట్టాలి ? ( US $ ట్రిలియన్ లలో )
ఎ ) 2. 5
బి ) సుమారు 1.4 ( లేక రు.100 లక్షల కోట్లు )
సి ) 3.5
డి )  1. 5
జవాబు : బి  
32) మాంగ్ డే ఛూ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ ను, భారత దేశ ప్రధాన మంత్రి ఇటీవల ఎక్కడ ప్రారంభించారు ?
ఎ ) రష్యా
బి ) బహ్రెయిన్
సి ) భూటాన్
డి ) UAE
జవాబు : సి
33)ఇటీవల  చంపాయ్ జిల్లా, మిజోరాం లో ఉన్న కాలాదాన్ నదిలో కనుగొన్న  జలచరం  ఏది ?
ఎ ) హిప్పో పోటమస్
బి )గ్లిప్టో  తోరాక్స్ గోపీ (కాట్ ఫిష్ )
సి ) ఖడ్గమృగం
డి )  స్నో లియోపార్డ్
జవాబు : బి
34) సింబాల్ బారా నది ఏ రాష్ట్రము లో ఉంది ?
ఎ ) పంజాబ్
బి )హర్యానా
సి )సిర్మోర్ జిల్లా , హిమాచల్ ప్రదేశ్
డి ) రాజస్తాన్
జవాబు : సి
35) మహాత్మా గాంధి 1893 లో దక్షిణ ఆఫ్రికా వెళ్లి 1914 వరకు ఉన్నారు.  1915,  జనవరి లో  భారత దేశానికీ వచ్చారు . ఆ తర్వాత కాలం లో ఆయన వేటి తో అనుబంధం కల్గి ఉన్నారు ?
ఎ ) విలేజ్ ఇండస్ట్రీస్ సొసైటీ
బి ) బేసిక్ ఎడ్యుకేషన్ సొసైటీ
సి ) గో రక్షణ అసోసియేషన్
డి )  పైవన్నీ
జవాబు :  డి
36)  ఆగష్టు  1942 లో   క్విట్ ఇండియా ఉద్యమం మొదలయ్యింది  . దీని తర్వాత కాలం లో మహాత్మా గాంధీ ని అరెస్ట్ చేసి ఎక్కడుo చారు  ?
ఎ ) ఆగా ఖాన్ పాలెస్ , పూనా  
బి ) బంకూర
సి ) అల్మోర జైలు
డి ) ఆలిఘర్
జవాబు : ఎ
37) సెప్టెంబర్ , 1932 లో  పూనా ఒప్పందం ఎవరి మధ్య జరిగింది ?
ఎ ) మహాత్మా గాంధీ – డాక్టర్ B.R.అంబేద్కర్
బి ) తిలక్ – లాలా లజపతి రాయ్
సి )రామ్ సే మెక్ డోనాల్డ్
డి )  మహాత్మా గాంధీ – ఇర్విన్
జవాబు : ఎ
38) మహాత్మా గాంధీ హాజరైన రెండవ రౌండ్ టేబుల్ సమావేశం ఎప్పుడు నిర్వహించారు ?
ఎ ) నవంబర్ , 19 30
బి ) సెప్టెంబర్ – డిసెంబర్ , 19 31
సి ) నవంబర్ 17 నుండి డిసెంబర్ 24 , 19 32
డి ) 1942
జవాబు : బి
39) తొలుత ‘సత్యాగ్రహ ఆశ్రమం’ అని పిలువ బడి, ఆ  తర్వాత కాలం లో సబర్మతి ఆశ్రమం  అని పిలువబదినది. దీన్ని జీవన్ లాల్ దేశాయ్ యొక్క కోచారాబ్ బంగాళా లో , అహ్మదాబాద్ లో తొలుత  ఎప్పుడు స్థాపించారు ?
ఎ )1927
బి ) మే , 1915 (  జూలై ,19 17 లో సబర్మతి నదీ తీరానికి మార్చారు )
సి )1881
డి )  1919
జవాబు : బి
40)1930 లో సివిల్ డిజ్ ఒబీడియన్స్ మూవ్ మెంట్ (CDM) కి పిలుపు నిచ్చారు మహాత్మా గాంధీ . మార్చ్ 12,1930 నాడు మహాత్మా గాంధీ స్వయం గా సబర్మతీ ఆశ్రమం నుండి దేన్నీ ప్రారంభించారు ?
ఎ )దండి మార్చ్  ( ఉప్పు సత్యాగ్రహం )
బి )ఖిలాఫత్ ఉద్యమం
సి ) రౌలత్ సత్యాగ్రహం
డి ) గదార్ ఉద్యమం
జవాబు : ఎ

41) UN హై కమీషనర్ ఫర్ హ్యూమన్ రైట్స్ ఎవరు ?
ఎ ) జెన్స్ స్టోలేన్బెర్గ్
బి ) మిచెల్లీ బాచ్ లెట్
సి )గియాని ఇన్ఫినిటో
డి ) జీన్ క్లాడ్ జన్కర్
జవాబు : బి
42) ఇటీవల నార్త్ ఈస్ట్ డెమోక్రాటిక్ అల్లయన్స్ (NEDA) కాంక్లేవ్ ఎక్కడ నిర్వహించారు  ?
ఎ ) గాంగ్ టక్
బి )కొహిమా
సి )గువహతి , అస్సాం
డి ) ఇటానగర్
జవాబు : సి
43) ఈ కింది వాటిల్లో,  అస్సాం తో ఎక్కువ పొడవున్న  సరిహద్దు గల  రాష్ట్రము ఏది ?
ఎ ) సిక్కిం
బి )బీహార్
సి ) మేఘాలయ
డి ) ఒడిషా
జవాబు : సి
44) మిజోరాం రాష్ట్రము ఏ దేశాలతో అంతర్జాతీయ సరిహద్దు కల్గి ఉంది ?
ఎ )నేపాల్
బి ) మయన్మార్ మరియు బంగ్లా దేశ్
సి )భూటాన్
డి ) థాయిలాండ్
జవాబు : బి
45) ‘బాన్ ఛాలెంజ్ (Bonn Challenge) వివరాలు ఏవి ?
ఎ )2020 నాటికి ప్రపంచ వ్యాప్తం గా 150 మిలియన్ హెక్టర్ల డీ ఫారెస్టేడ్ మరియు డి గ్రేడేడ్ భూమిని రిస్టోర్ చేస్తారు ( 2030 నాటికీ 350 మిలియన్ హెక్టర్ ల భూమిని రి  స్టోర్   చేస్తారు )
బి ) పారిస్ లో 2015 లో నిర్వహించిన CoP లో భారత దేశం ‘ బాన్ ఛాలెంజ్ ‘ లో చేరింది
సి ) ఇటీవల భారత దేశం 2030 నాటికీ , 26 మిలియన్ హెక్టర్ ల డి గ్రెడే షన్ ల్యాండ్ ను రి స్టోర్ చేస్తానని తెలిపింది
డి )  పైవన్నీ
జవాబు :  డి
46) ల్యాండ్ డి గ్రె డే షన్ మీద,   UN కాన్ఫరెన్స్ అఫ్ పార్టీస్ (CoP14) (UNCCD) సమావేశం ఇటీవల ఇండియా లో   నిర్వహించారు. ఇక్కడ విడుదల చేసిన ‘డ్రాట్ టూల్  బాక్స్’ లో గల 3 మాడ్యుల్స్  వివరాలు ఏవి ?
ఎ ) కరువు మోనిటరింగ్ & ఎర్లీ వార్నింగ్
బి ) కరువు వల్నరబిలిటి & రిస్క్ మేనేజ్ మెంట్  
సి ) కరువు రిస్క్ మిటిగేషన్ మెజర్స్ (కరువు రిస్క్ ని తగ్గించే చర్యలు )
డి ) పైవన్నీ (UNO SDG-15  లో నేలలు ఎడారులు గా మారటాన్ని ఆపే చర్యల గురించి ఉంది )
జవాబు : డి
47) భారత రాజ్యాంగం లోని ఎన్నవ ఆర్టికల్ , భారత రాష్ట్ర పతికి , మరియు  రాష్ట్ర గవర్నర్ లకు(పదవి లో ఉన్నంత కాలం  ) కాన్ స్టిట్యూషనల్ ఇమ్మ్యూనిటి (రాజ్యాంగ పరo గా  రక్షణ ) (క్రిమినల్ కేసు లనుండి ) కల్పిస్తుంది ?
ఎ ) ఆర్టికల్ 371
బి )ఆర్టికల్ 361
సి ) ఆర్టికల్ 21
డి ) ఆర్టికల్ 2
జవాబు : బి
48) US ఓపెన్ మహిళ ల సింగల్స్ విజేత బియాంక్ ఆండ్రీ స్కూ . పురుషుల సింగిల్స్ విజేత రాఫెల్ నాదాల్ . ఇంతవరకు రాఫెల్ నాదాల్ సాధిoచిన మేజర్ విజయాల వివరాలేవీ ?   
ఎ ) ఆస్ట్రేలియా ఓపెన్ ( ఒక సారి ) ; ఫ్రెంచ్ ఓపెన్ 12 సార్లు )
బి )  వింబుల్డ న్ ( 2 సార్లు )
సి )US ఓపెన్ ( 4 సార్లు )
డి )  పైవన్నీ
జవాబు : డి
49) ఐర్లాండ్ బోర్డర్ ( సరిహద్దు ) వివరాలు ఏవి ?
ఎ )ఇది, రిపబ్లిక్ అఫ్  ఐర్లాండ్  కి  - ఉత్తర ఐర్లాండ్ కి  మధ్య గల సరిహద్దు . ఉత్తర ఐర్లాండ్ , బ్రిటన్ అధీనం లో ఉంది . ఉత్తర ఐర్లాండ్ రాజధాని: బెల్ ఫాస్ట్  
బి ) దీనిపొడవు : సుమారు   499    కి.మీ.  (310 మైల్స్)
సి ) దీన్ని సాఫ్ట్ బోర్డర్ అంటారు . ఎందు కంటే , ప్రత్యేకంగా నిర్మిoచిన  గో డలు , సరిహద్దులు / కఠినమైన కాపలా షరతులు లేవు . ప్రజలు స్వేచ్చ గా అటు ఇటు తిరుగు తుంటారు
డి )  పైవన్నీ  ( బ్రె క్సిట్ సందర్భంగా , ఈ అంశం ప్రత్యేక త సంతరించుకుంది )
జవాబు : డి
50) తెలంగా ణా రాష్ట్ర 2019-20 బడ్జెట్ సందర్భం గా  ఇటీవల వెల్లడించిన వివరాలేవీ ?
ఎ ) 2018-19 లో తెలంగాణా రాష్ట్ర GSDP వృద్ధి రేట్ : సుమరు 14.8 %
బి )2018 – 19 లో తెలంగాణా రాష్ట్ర GSDP అంచనా : రు.8.65 లక్షల కోట్లు
సి )తెలంగాణా లో తలసరి ఆదాయం (2018-19 లో ) : రు.2.05 లక్షలు ( కరెంటు ధరలలో )
డి ) పైవన్నీ
జవాబు :  డి

51) ములుగు జిల్లలో ములుగు – పాలం పేట రోడ్ ప్రక్కన ఉన్న రామప్ప దేవాలయాన్ని 13 శతాబ్ది తొలి నాళ్లలో ఎవరు నిర్మించారు ? వివరాలు ఏవి ?
ఎ )రేచర్ల సేనాపతి రుద్రయ్య
బి ) ఈ దేవాలయ పునాదుల్ని సాండ్-బాక్స్ టెక్నాలజీ తో నిర్మించారు
సి )16 .6.18 19 నాడు వచ్చిన తీవ్ర భూకంపం ను తట్టుకుని స్తంభాలు , వర్టికల్ నిర్మాణం నిలబడ్డాయి
డి ) పైవన్నీ ( దీనికి త్వరలో UNESCO గుర్తింపు రావచ్చును )
జవాబు : డి
52)ఇటీవల అసెంబ్లీ లో ప్రవేశ పెట్టిన 2019 – 20 తెలంగాణా రాష్ట్ర బడ్జెట్ వివరాలేవీ ?
ఎ ) వార్షిక బడ్జెట్ లో  మొత్తం వ్యయం   : రు. 1,46,492.30   కోట్లు  
బి )రెవిన్యూ వ్యయం : రు.1,11,055.84   కోట్లు             కాపిటల్ వ్యయం :రు. 17,274.67 కోట్లు
సి ) రెవిన్యూ మిగులు :      రు. 2,044.88  కోట్లు      ( ఫిస్కల్ లోటు : రు. 24,081.74 కోట్లు
డి ) పైవన్నీ
జవాబు : డి
53) ఏ రాష్ట్రాలలో టెంపరరి గా కొన్నాళ్ళు నివశిo చాలంటే , ‘పర్మిట్ ‘ తీసుకోవాలి ?  
ఎ )అరుణాచల్ ప్రదేశ్
బి ) మిజోరాం
సి ) నాగాలాండ్
డి )  పైవన్నీ
జవాబు :  డి
54) కామాఖ్యా టెంపుల్ ఎక్కడుంది ?
ఎ ) శ్రీనగర్
బి ) బుద్ధ గయ
సి )గువహాటి, అస్సాం
డి ) మథుర
జవాబు : సి
55) భారత దేశం లో  ఆగష్టు , 2019 లో ఆటోమొబైల్ (వాహనాల ) సేల్స్ 23.55 % తగ్గింది . కారణాలు ఏవి ?
ఎ )బలహీనమైన కన్స్యూమర్ సెంటిమెంట్ (ఎకనామిక్ గ్రోత్ తగ్గిపోవటం, మధ్యలో )
బి )NBFC ల సంక్షోభం వల్ల ఏర్పడ్డ లిక్విడిటి క్రంచ్
సి )GST రేటు , భవిష్యత్తు లో తగ్గ వచ్చని వినియోగ దారులు , వాహనాలు కొనటం పోస్ట్ పోన్ చేసుకోవటం
డి )  పైవన్నీ
జవాబు :  డి
56) భారత దేశం లో ,  మొత్తం ఉప్పు (సాల్ట్ ) ఉత్పత్తి లో 99 % ఉప్పు ని ఉత్పత్తి చేసే రాష్ట్రాలు ఏవి ?
ఎ ) గుజరాత్
బి )రాజస్తాన్
సి ) తమిళనాడు
డి )  పైవన్నీ  ( మిగిలిన 1 % ఉప్పుని మిగిలిన రాష్ట్రాలు ఉత్పత్తి చేస్తాయి )
జవాబు : డి
57)ఇటీవల నియమించబడిన కొత్త గవర్నర్ లు ఎవరు ?
ఎ ) తెలంగాణా : డాక్టర్ తమిళిసై సౌందరరాజన్  ; రాజస్తాన్ : కల్ రాజ్ మిశ్రా
బి ) మహారాష్ట్ర : భగత్ సింగ్ కోష్యారి  ;  హిమాచల్ ప్రదేశ్ : బందరు దత్తా త్రేయ
సి )కేరళ : ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్
డి )  పై అందరూ
జవాబు : డి
58) జోర్డాన్ పేరు తో ఏవి ఉన్నాయి ?
ఎ ) జోర్డాన్ దేశం (ఇజ్రాయిల్ దేశం దగ్గర )
బి ) జోర్డాన్ నది ( ఇది ‘గలీలి సముద్రం’ నుండి ‘డెడ్ సీ’ వరకు ప్రవహిస్తోంది )
సి ) జోర్డాన్ లోయ  ( దీనికి ఒక వైపు , వెస్ట్ బ్యాంకు ఉంది )
డి )  పై వన్ని
జవాబు : డి
59) కేంద్ర ప్రభుత్వం యొక్క స్పెషల్ మార్కెట్ ఇంటర్ వెన్షన్ ప్రైస్ స్కీం ( MISP) ను , ఇటీవల J&K లో ఎ పంటకి అమలు చేసి కొనుగోలు చేయనున్నారు ? వివరాలేవీ ?
ఎ ) యాపిల్స్
బి ) MISP కింద 12 లక్షల మెట్రిక్ టన్నుల యాపిల్స్ కొనుగోలు చేస్తారు , నేషనల్ అగ్రికల్చర్ కో పరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ అఫ్ ఇండియా ద్వారా 
సి )20 18 లో కాశ్మీర్ లో 20 లక్షల మెట్రిక్ టన్నుల యాపిల్స్ పండాయి
డి )  పైవన్నీ
జవాబు :  డి
60)మోతీ హారి – అమ్లేఖ్ గంజ్ ఎనర్జీ పైప్ లైన్ వివరాలు ఏవి ?
ఎ ) పొడవు : 69 కి.మీ.
బి )దీనిద్వారా సంవత్సరానికి 2 మిలియన్ మెట్రిక్ టన్నుల శుభ్రమైన పెట్రోలియం ఉత్పత్తులు పంపవచ్చును
సి ) భారత్ నుండి నేపాల్ కు ఆయిల్ ఉత్పత్తులు దీని ద్వారా పంపు తారు
డి )  పైవన్నీ
జవాబు :  డి

61) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ ) SLV-3
బి )ASLV
సి ) PSLV & GSLV
డి )  పైవన్నీ ( ISRO వారి వివిధ   రాకెట్ లు )
జవాబు :  డి
62) చంద్రయాన్ – 2 ఆర్బిట్ లో ఉన్న పరికరాలు ఏవి ?
ఎ ) RMBHA – DFRS ( రేడియో అనాటమీ అఫ్ బౌండ్ హైపర్ సెన్సిటివ్ అయానో స్పియర్ – డ్యూఎల్ ఫ్రీక్వెన్సీ రేడియో సైన్సు ఎక్స్ పెరిమేంట్ )
బి )ChaSTE : (చంద్రాస్ సర్ఫేస్ థర్మోఫిజికల్ ఎక్స్ పెరిమేంట్ )ఆన్ ది ల్యాండర్ 
సి ) CHACE – 2 (చంద్రాస్ అల్టిట్యూ డినల్ కంపో జి షన్ ఎక్స్ ప్లోరర్ )  
డి ) పైవన్నీ
జవాబు :  డి
63) మొదట  చంద్రయాన్ – 2 యొక్క ‘విక్రం’ దిగే స్థలం  ,  చంద్రుడి ఈక్వేటర్ కి దక్షిణాన 70 డిగ్రీల దగ్గర సెలెక్ట్ చేశారు .  ఈ ప్రాంతం చంద్రుడి దక్షిణ ధృవానికి సుమారు 600 కి.మీ. దూరం లో ఉంది.    చంద్రుడి పై ఉన్న క్రేటర్ ల పేర్లు ఏవి ?
ఎ ) మాంజి నస్ C & సిం పెలియస్ N (వీటి మధ్య 100 మిలియన్ టన్నుల నీరు ఉందని అంచనా )   
బి ) మేర్ ఓరియంటాలే
సి ) శిశిర్ కుమార్ మిత్ర క్రేటర్ , జాక్సన్ క్రేటర్ , మాచ్ క్రేటర్ 
డి )  పైవన్నీ
జవాబు :  డి
64) కోస్టల్ రెగ్యులేటరి జోన్ III వివరాలు ఏవి ?
ఎ )1991 నోటిఫికేషన్ ప్రకారం కోస్టల్ లైన్ నుండి 200 మీటర్ల లోపు ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదు
బి )20 11 లో CRZ లను రివైజ్ చేశారు
సి )CRZ – 20 18 నోటిఫికేషన్ లో ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ (FSI) & ఫ్లోర్ ఏరియా రేషియో (FAR) లను 19 91  DCR లెవెల్స్ ప్రకారం స్థిరీ కరించారు
డి )  పైవన్నీ ( శైలేష్ నాయక్ కమిటీ ఈ అంశాలను అధ్యయనం చేసింది )
జవాబు :  డి
65)నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ అఫ్ చైల్డ్ రైట్స్ (NCPCR) చైర్ పర్సన్ ఎవరు ?
ఎ )వివేక్ గోయెంకా
బి ) K N శాంత కుమార్
సి ) ప్రియాంక్ కనూంగో
డి ) రియాద్ మాథ్యూ
జవాబు : సి
66) గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ (పక్షి ) (GIB)వివరాలు ఏవి ?
ఎ )వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఇండియా & రాజస్తాన్ ఫారెస్ట్ డిపార్టుమెంటు సంయుక్తంగా 20 16 లో అధ్యయనం చేశాయి
బి ) థార్ ఎడారి ప్రాంతం లో గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ , చింకారా , నక్కలు జీవిస్తాయి ( ప్రధానం గా జై సల్మార్ & జోద్ పుర జిల్లాల్లో )
సి ) ప్రతి 100 చదరపు కిలో మేటర్ పరిధిలో 0.61 ప్లస్ ఓర మైనస్ 0.36 పక్షులు నివసిస్తాయి
డి )  పైవన్నీ
జవాబు :  డి
67) G-7 సమ్మిట్ ఇటీవల ఎక్కడ నిర్వహించారు ?
ఎ ) బెర్లిన్
బి ) బియా ర్రిట్జ్ , ఫ్రాన్స్
సి ) టోక్యో
డి ) బీజింగ్
జవాబు : బి
68) G-7 సమావేశం లో , మీడియం టర్మ్ రి ఫారెస్టేషన్ ప్లాన్ చర్చించారు . ఇందులో  అమెజాన్ అడవుల్లో మంటలను ఆర్పటానికి ఎంత ఆర్ధిక సాయం చేస్తా మన్నారు ? ( మిలియన్ యూరో లలో )
ఎ ) 5
బి ) 20
సి ) 15
డి ) 25
జవాబు :బి  
69) G-7 సమావేశం లో (20 19 ) , భారత దేశం అదనం గా ఎంత ‘కార్బన్ సింక్ ‘ ఏర్పాటు చేస్తానంది ?
ఎ ) 20 30 నాటికీ ,  2.5 నుండి 3 బిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ కి సమానం గా అడవుల సృష్టి మరియు చెట్లు పెంచటం ద్వారా
బి ) నదుల అనుసంధానం ద్వారా
సి ) సాగర జలాలో ఓడలు ఏర్పాటు చేసి
డి )  ఇవేవి కావు
జవాబు : ఎ
70) 20 18 లో కాల్ ఇండియా 606 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసి ప్రధమ స్థానం లో ఉంది. రెండవ స్థానం లో NTPC ఉంది . 41,580   MW ఇన్ స్టాల్ డ్  కెపాసిటీ ఉన్న NTPC యొక్క థర్మల్ స్టేషన్ లకు ఎంత బొగ్గు కావాలి ?  
ఎ ) 100 MTPA
బి ) 50 MTPA
సి ) 160 MTPA
డి ) 75 MTPA
జవాబు : సి

71) భారత దేశానికీ చెందిన టెలీస్కోప్ లలో ఒకటి అస్ట్రో శాట్ . ఇది X – రే ఫ్లాష్ లకు చాలా సెన్సిటివ్ . GROWTH – ఇండియా ఆప్టికల్ టెలీస్కోప్ ఎక్కడ ఉంది ?
ఎ ) లడక్
బి ) పూణే
సి ) గాంధీనగర్
డి )  ఇండోర్
జవాబు :ఎ
జవాబు : డి
72) అమెజాన్ అడవులలో ని 60 % భూమి బ్రెజిల్ లో ఉంది.  అమెజాన్ అడవులలో మంటలకు కారణాలు ఏవి ?
ఎ ) నేటివ్ ట్రైబల్ ప్రజలకు చెందిన అటవీ భూముల్ని , కొంతమంది లాక్కోవటం, వ్యవసాయానికి అనుకూలంగా మార్చు కోవటం
బి ), మామూలు భూములు గా మార్చే ప్రయత్నం లో,   కొంతమంది గుత్తే దార్లు ,  కావాలనే అడవుల్లో భారీగా  మంటలు పెట్టటం
సి ) IBAMA కి రక్షణ కల్పించే ప్రత్యేక బలగం లేక పోవటం
డి ) పైవన్నీ (అని చెపుతున్నారు )
జవాబు : డి