1)గగన్ యాన్ వివరాలేవి ?
ఎ )రు.10,000 కోట్ల
ఖర్చు తో దీన్ని ఇస్రో (ISRO) చేపడుతోంది
బి)2022 లో భారతీయ మానవ అంతరిక్ష యానం అనుకుంటున్నారు .
దీనిలో 3 నుండి 7 మంది భారతీయ మానవ అంతరిక్ష నావికులు 3నుండి 7 రోజులు అంతరిక్షం లో 400 కి.మీ. ఎత్తులో
ఉన్న కక్ష్య లో ప్రయనిస్తారు సి) ఇందుకోసం ఇండియన్ ఎయిర్ ఫోర్సు నుండి నలుగురు పైలట్ లను
ఎంపిక చేశారు. వీరికి రష్యా లో ట్రైనింగ్ ఇస్తారు .
డి )పైవన్నీ
జవాబు : డి
2) యూరి గగారిన్ కాస్మోనాట్ సెంటర్ ఎక్కడుంది ?
ఎ ) కేప్
కెన్నెడీ , USA
బి) మాస్కో , రష్యా
సి)పారిస్, ఫ్రాన్స్
డి )బీజింగ్ , చైనా
జవాబు : బి
3 ) వార్తల ప్రకారం ఇస్రో (ISRO)రెండవ
లాంచ్ పోర్ట్ ఎక్కడ రానున్నది ?
ఎ ) తూత్తుకుడి జిల్లా, తమిళనాడు
బి) బా లా సోర్
, ఒడిష
సి) త్రివేండ్రం , కేరళ
డి ) పశ్చిమ బెంగాల్
జవాబు : ఎ
4) భారత
దేశ 28వ ఆర్మీ చీఫ్ గా పదవీ బాధ్యతలు స్వీకరించింది ఎవరు ?
ఎ ) బిపిన్ రావత్
బి) జనరల్ మనోజ్ ముకుంద్ నరవానే
సి) జనరల్
K.V.కృష్ణా రావు
డి ) జనరల్ కరియప్ప
జవాబు : బి
5)తెలంగాణా రాష్ట్ర మనవ హక్కుల కమిషన్ చైర్మన్ ఎవరు
?
ఎ ) మొహమ్మద్ ఇర్ఫాన్ మొయినుద్దీన్
బి)ఆనందరావు నడిపల్లి
సి) జస్టిస్ G.చంద్రయ్య
డి )B.నాగేందర్
జవాబు : సి
6) ప్రైవేటు రంగలో గా ఆపరేట్ చేసే ‘తేజాస్’ రైలు
వివరాలేవీ ?
ఎ )ఢిల్లీ – లక్నో రూట్ లో నడుస్తోంది
బి) అహ్మదాబాద్ – ముంబై రూట్ లో జనవరి , 2020
నుండి నడుస్తుందని తెలిపారు
సి)ఇందులో ప్రయాణం చేసే వారికీ ఇన్సూరెన్స్ ఉంది
డి ) పైవన్నీ
జవాబు : డి
7) తాయ్ నార్ – ఘర్ ఘోడా ప్రాంతాలలో ఏవేవి ఉన్నాయి ?
ఎ ) 13 బొగ్గు గనులు
బి) 12 విద్యుచ్ఛక్తి కేంద్రాలు
సి) విద్యుచ్ఛక్తి కేంద్రాలకు కావాల్సిన
నీరు కేలో నది నుండి లభిస్తోంది
డి ) పైవన్నీ
జవాబు : డి
8) గుజరాత్ లోని బనస్కంధ జిల్లాలో మిడతల దండు ఏ ఏ
పంటలను నాశనం చేసింది ?
ఎ ) ఆవాలు
బి) ఆముదం
సి) గోధుమ
డి ) పైవన్నీ
జవాబు : డి
9) 2018 సంవత్సరపు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు
ఇటీవల ఎవరికీ ప్రదానం చేశారు ?
ఎ ) అక్కినేని నాగేశ్వర రావు
బి) శశి కపూర్
సి) అమితాబ్ బచ్చన్
డి ) రజనీకాంత్
జవాబు : సి
10) గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ (GGI) లో ఏ
రాష్ట్రము ప్రధమ స్థానం లో ఉంది ?
ఎ ) రాజస్థాన్
బి) మధ్య ప్రదేశ్
సి) తమిళనాడు
డి ) ఉత్తర ప్రదేశ్
జవాబు : సి
11) కొత్తగా ఏర్పాటు చేసిన చీఫ్ అఫ్ ది డిఫెన్సు
స్టాఫ్ ( CDS) పదవిలో ఎవర్ని నియమిచారు ? వివరాలు ఏవి ?
ఎ ) జనరల్ బిపిన్ రావత్ ని నియమించారు
బి)65 సంవత్సరాలు నిండే వరకు అయన ఆ పదవిలో
పనిచేయవచ్చును
సి) 4 – స్టార్ జనరల్ మాత్రమే ఈ పదవి లో
ఉండవచ్చును . ఈయన రక్షణ మంత్రికి ప్రధాన మిలిటరీ అడ్వైజర్ గా పనిచేస్తారు
డి )పైవన్నీ
జవాబు : డి
12) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ? (రాష్ట్రాలు :
ముఖ్యమంత్రులు )
ఎ ) జార్ఖండ్ : హేమంత్ సోరెన్ , జార్ఖండ్ ముక్తి
మోర్చా
బి)మహారాష్ట్ర : ఉద్ధవ్ థాకరే
సి)ఛత్తీస్ ఘర్ : భూపేష్ బాగెల్
డి )పైవన్నీ
జవాబు : డి
13 )2015 లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ
ఆమోదించిన 17 సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్స్ (SDGs) లను 20 30 నాటికీ సాధించాలని
తెలిపింది. NITIఆయోగ్ భారత దేశానికీ అనుకూలంగా 100 ఇండికేటర్స్ ను తయారు చేసింది.
వీటి ఆధారం గా ఇటీవల NITI ఆయోగ్ తయారు చేసిన ‘కాంపోజిట్
SDG’ ఇండెక్స్ లో ప్రధాన
స్థానములో ఉన్న కేరళ రాష్ట్రము ఎన్ని పాయింట్
లు సాధించింది ?
ఎ ) 70
బి) 50
సి) 66
డి )65
జవాబు : ఎ
14) ఇండియా స్టేట్ అఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2019 (ISFR)ప్రకారం
భారత దేశం లో అడవుల (ఫారెస్ట్ కవర్ & ట్రీ కవర్ కలిపి ) విస్తీర్ణం ఎన్ని చదరపు కిలో మీటర్లు పెరిగింది ?
ఎ ) 7,12,249
బి) 1212
సి) 5188
డి ) 1256
జవాబు : సి
15) 17 వ శతాబ్దం లో నిజాం - II ఆధ్వర్యం
లో ఫ్రెంచ్ ఇంజనీర్ లు ‘నిర్మల్ ‘ లో నిర్మించిన కోటలు ఏవి ?
ఎ ) సోన్ ఘర్ , షాం ఘర్ , బత్తీస్ ఘర్
బి) నిర్మల్ కోట
సి) బంగాల్ పెట్ కోట
డి ) పైవన్నీ
జవాబు : డి
16) బోగన్ విల్లే దీవి , ఏ దేశం నుండి విడిపోయి
స్వాతంత్ర్యo కోరుకుo టోo ది ?
ఎ ) సౌత్ సూడాన్
బి) పాపు వా న్యూ గీనియా (PNG)
సి) నార్త్ ఐర్లాండ్
డి ) ఆస్ట్రేలియా
జవాబు : బి
17) డిసెంబర్ 18, 20 19 నాడు, USA హౌస్ అఫ్
రిప్రజెంటేటివ్స్ ఏ కారణాల చేత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇంపీఛ్ మెంట్ (అభిశంస ) ను ఆమోదించింది ?
ఎ ) ఆర్టికల్ I అధికార దుర్వినియోగం (ఎబ్యూజ్ అఫ్
పవర్ )
బి)ఆర్టికల్ II కాంగ్రెస్( అనగా పార్లమెంట్) ని
అడ్డుకున్నందుకు (అబ్ ష్ట్రక్షన్ )
సి) పై (ఎ) & (బి )
డి ) ప్రపంచ శాంతికి కృషి చేసినందుకు
జవాబు : సి
18) మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) ఏమిటి ?
ఎ ) డిజిటల్ పే మెంట్స్ ను తీసుకోటానికి
ఒప్పుకున్నoదుకు గాను , ఒక వ్యాపారి , బ్యాంకు కి చెల్లించే ఫీజు
బి) ఇటీవల కేంద్ర ఆర్ధిక మంత్రి ‘రూపే’ మరియు
యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ పేస్ (UPI) ల
ద్వారా చేసిన డిజిటల్ పేమెంట్ లకు MDR చార్జీలు 1.1.2020 నుండి ఉండవని
తెలిపారు
సి) పేమెంట్స్ కౌన్సిల్ అఫ్ ఇండియా (PCI) డిజిటల్
పేమెంట్స్ పరిశ్రమ యొక్క ప్రతినిధి సంస్థ
డి ) పైవన్నీ
జవాబు : డి
19) 3 వ ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్’ ఎక్కడ
నిర్వహించారు ?
ఎ ) తిరువనంతపురం
బి)గువహాటి , అస్సాం
సి) ఇండోర్
డి ) లక్నో
జవాబు : బి
20) కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రు.102 లక్షల
కోట్ల మౌలిక సదుపాయాల (ఇన్ఫ్రాస్ట్రక్చర్ ) ప్రాజెక్ట్ లకు సంబందించిన వివరాలు ఏవి
?
ఎ ) దీనికి సంబంధించిన ఖర్చును కేంద్ర, రాష్ట్ర
ప్రభుత్వాలు మరియు ప్రైవేటు సెక్టార్ సంస్థ లు 39 : 39 : 22 ఫార్ములా లో పెడతాయి
బి)2024 – 25 నాటికి US$ 5
ట్రిలియన్ ఎకానమి ని సాధించటానికి రు . 100 లక్షల కోట్ల మోడరన్ ఇన్ఫ్రా స్ట్రక్చర్
లో ఖర్చు పెట్టాలని ప్రధాన మంత్రి 15.8.2019 నాడు ప్రకటించారు
సి) ఎనర్జీ (24 %) ; అర్బన్ ఇన్ఫ్రా (16 % ) ;
రైల్వే లు ( 13 % ) ; రోడ్ లు ( 19 % ) ; ఇర్రిగేషన్ ( 8 % ) ; గ్రామీణ భారతం ( 8 %
) ; కమ్యూనికేషన్స్ (3 %) ; సోషల్ ఇన్ఫ్రా ( 3 %) ; ఇతరులు ( 6 % ) లకు ఈ నిధులు
అందుతాయి .
డి )పైవన్నీ
జవాబు : డి
21) భారత దేశం లో అడవులలో చెలరేగే కారు చిచ్చులకు ఏ రాష్ట్ర
అడవులకు ముప్పు వాటిల్లిందని 2018 – 19 కాలం లో అత్యధికంగా అలర్ట్
(హెచ్చరిక లు ) లు పంపారు ?
ఎ ) నాగాలాండ్
బి) అరుణాచల్ ప్రదేశ్
సి) మిజోరాం
డి ) మధ్య ప్రదేశ్
జవాబు : సి
22) డిపాజిట్ ఇన్సూరెన్స్ & క్రెడిట్ గారెంటీ
కార్పొరేషన్ (DICGC) లో డిపాజిట్ ఇన్సూరెన్స్ ఎంత వరకు ఉంది ?
ఎ ) రు. ఒక లక్ష
బి) రు.30 ,000
సి) రు.3 లక్షల నుండి రు. 5 లక్ష ల వరకు
డి ) రు.5,000
జవాబు : ఎ
23 ) ఫైనాన్స్ మినిస్ట్రీ (ఆర్ధిక మంత్రిత్వ
శాఖ) ప్రారంభించిన e-బిక్రయ్ అనే కామన్ e-ఆక్షన్ (వేలంపాట ) ప్లాట్ ఫారం ద్వారా
పబ్లిక్ సెక్టార్ బ్యాంకు ల చేత గత మూడు ఏళ్లుగా అటాచ్ చేయబడిన ఎంత విలువ గల
ఆస్తులు అమ్మ దలిచారు ?
ఎ ) రు. 10 లక్షల కోట్లు
బి) రు.32 . 3 లక్షల కోట్లు ( ఆస్థుల సంఖ్య : 1.73 లక్షలు )
సి) రు. 15 లక్షల కోట్లు
డి ) రు. 25 లక్షల కోట్లు
జవాబు : బి
24) ప్రభుత్వ రంగ బ్యాంకులు నిరర్ధక ఆస్తులు (నాన్ –
పెర్ ఫార్మింగ్ అసెట్స్ ) సెప్టెంబర్ 2019 నాటికి ఎంత ? ( రు.లక్షల కోట్ల లో )
ఎ ) 7.27
బి) 8.96
సి) 5.02
డి ) 6.04
జవాబు : ఎ
25) 2019 లో ఎంత విలువ గల విదేశీ ప్రత్యక్ష
పెట్టుబడులు (FDI) , షేర్ మార్కెట్ లోకి వచ్చాయి ? (రు.కోట్ల లో )
ఎ ) 1,28,360
బి) 51,252
సి) 1,00,086
డి ) 1,33,266
జవాబు : సి
26)పాకిస్తాన్ లో ఉన్న గురు ద్వార నానక్ దేవ్ జీ (లేక
) నాన్ కా నా సాహిబ్ ఎవరి జన్మ స్థలం ?
ఎ ) గురు నానక్
బి) గురు తేజ్ బహదూర్
సి) గురు రామ్ దాస్
డి ) గురు హర్ గోబింద్
జవాబు : ఎ
27) 107 వ ఇండియన్ సైన్సు కాంగ్రెస్ మీటింగ్ , ఇటీవల
ఎక్కడ నిర్వహించారు ?
ఎ ) కోల్ కత
బి)
బెంగళూరు
సి) భుబనేశ్వర్
డి ) విశాఖపట్నం
జవాబు : బి
28) లెబనాన్ దేశ కరెన్సీ ఏది ?
ఎ ) యూరో
బి) లెబనీస్ పౌండ్
సి) డాలర్
డి ) దీనార్
జవాబు : బి
29) ఆస్ట్రేలియా లో ఎక్కడ తీవ్ర వర్షా భావం వల్ల
బుష్ ఫైర్ వల్ల తీవ్రం గా అగ్ని మంటలు చెలరేగాయి ?
ఎ ) బిల్ పిన్ , న్యూ సౌత్ వేల్స్
బి) వొల్లె మి నేషనల్ పార్క్
సి) బ్లూ మౌంటెన్స్ దగ్గర
డి ) పైవన్నీ
జవాబు : డి
30) ముంబై కి దగ్గర ఉన అపోలో బందర్ కి 10 కి.మీ.
దూరం లో ఉన్న ఎలిఫెంటా గుహలు , ఒక చిన్న దీవిలో ఉన్నాయి . దీని అసలు పేరు ఘరా పురి
. క్రీస్తు శకం 5 నుండి 8 శతాబ్దానికి చెందిన శిల్పాలున్న వీటికి , ఎలి ఫెంటా
కేవ్స్ అని ఎవరు పేరు పెట్టారని అంటారు ? (గతం లో ఈ గుహల ముందు ఏనుగు శిల్పం ఉండేది )
ఎ ) శివాజీ మహారాజ్ సైనికులు
బి) ఈస్ట్ ఇండియా కంపెనీ వారు
సి) పోర్చు గీసు యాత్రీకులు
డి ) అరబ్ యాత్రీకులు
జవాబు : సి
31) గోల్డెన్ గ్లోబ్ అవార్డు లలో ఇటీవల ఎవరికీ ఏవి
వచ్చాయి ?
ఎ ) ’1917’ : బెస్ట్ డ్రామా ఫిలిం (శాo మెండెస్:
ఉత్తమ దర్శకుడు )
బి)’వన్స్ అపాన్ ఏ టైం ఇన్ హాలీవుడ్ ‘ : (ఉత్తమ
స్క్రీన్ ప్లే )
సి) ‘రాకెట్ మాన్ ‘ ( ఉత్తమ నటుడు : టారన్ ఎగర్టన్ ; ఉత్తమ ఒరిజినల్ సాంగ్ : జాన్ )
డి ) పైవన్నీ
జవాబు : డి
32) ఇండియా
IVX ఇండెక్స్ వివరాలేవీ ?
ఎ ) ఇండియా వాలే టై లిటి ఇండెక్స్ ను నేషనల్
స్టాక్ ఎక్స్ చేంజ్ 2008 లో ప్రారంభించింది
బి)పెట్టుబడి దారుల దృ ష్టి లో మార్కెట్ ‘ఆవిరై
పోటాన్ని ‘ గమనిస్తుంది
సి) చికాగో బోర్డు ఆప్షన్స్ ఎక్స్ చేంజ్ (COBE)
వాళ్ళు తొలుత వాలెటై లిటి ని 19 93 లో ఒక ఇండెక్స్ గా రూ పొందిం చింది
డి ) పైవన్నీ
జవాబు : డి
33 ) ప్రపంచం లో ఉత్పత్తి అయ్యే క్రూడ్ ఆయిల్
మొత్తం లో 50 % ఉత్పత్తి పశ్చిమ ఆసియా
ప్రాంతం నుండి అవుతుంది . పశ్చిమ ఆసియా లో
ఏ దేశాల చర్యలు ఉద్రిక్తత లకు కారణం అయ్యి
, క్రూడ్ ఆయిల్ ధరలు పెరగటానికి కారణం అవుతున్నాయి ?
ఎ ) USA
బి) ఇరాక్
సి) ఇరాన్
డి ) పైవన్నీ
జవాబు : డి
34) ఎలాంట ప్పుడు అర్బన్ కో అపరేటివ్ బ్యాంకు ల మీద సూపర్ వైజరి
యాక్షన్ ఫ్రేమ్ వర్క్ (SAF)ను RBI అమలు లోకి తీసు కోస్తానన్న ది ?
ఎ ) NPA
లు అసెట్స్ కన్నా 60 % కన్నా ఎక్కువయినప్పుడు
బి) రెండు సంవత్సరాలు వరుసగా నష్టాలు పేరుకు
పేరుకు పోయినప్పుడు
సి) కాపిటల్ ఆడిక్వసి రేషియో 6% కన్నా
తగ్గిపోయినప్పుడు
డి ) పైవన్నీ
జవాబు : డి
35) ‘మియా వాకి ‘ ఫారెస్ట్ వివరాలు ఏవి ?
ఎ ) అకీరా మియావాకి , జపాన్ దేశ వృక్ష శాస్త్ర
వేత్త . ఈ పద్ధతిని అభి వృద్ధి చేశాడు
బి) ఈ పధ్ధతి లో మొక్కలు 10 రెట్లు వేగం తో
పెరుగు తాయి . 30 రెట్లు అధికంగా వృక్ష సాంద్రత ఉంటుంది
సి) అర్బన్ ఫారెస్ట్ కోసం ఈ పధ్ధతి వాడుతున్నారు
డి ) పైవన్నీ
జవాబు : డి
36) DRDO యంగ్ సైంటిస్ట్ లేబరేటరీస్ (DySLs) ఎక్కడెక్కడ
ప్రారంభిస్తారు ?
ఎ ) బెంగలూరు
బి)ముంబై
సి) చెన్నై & కోల్ కత
డి ) పైవన్నీ
జవాబు : డి
37) మధ్య ప్రదేశ్ లో 526 పులులు ఉన్నాయి . 2019
లెక్కల ప్రకారం ఏ రాష్ట్రము లో 31 పులుల మరణాలు సంభవించాయి ?
ఎ ) మధ్య ప్రదేశ్
బి) మహారాష్ట్ర
సి) కర్ణాటక
డి ) తమిళనాడు
జవాబు : ఎ
38) ఇస్రో యొక్క ఆస్ట్రో నాట్ ట్రైనింగ్ హబ్ (
హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ ) (HSFC) ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు ?
ఎ ) డెహ్రాడున్
బి) అహ్మదాబాద్
సి) చెల్ల కేరి ( చిత్ర దుర్గ జిల్లా ) , కర్ణాటక
డి ) హసన్
జవాబు : సి
39) UNESCO వరల్డ్ హెరిటేజ్ సైట్ / స్థలం గా
గుర్తించిన ‘లామూ దీవి ‘ ఎక్కడుంది ?
ఎ ) ఈజిప్ట్
బి) సొమాలి
సి) కీన్యా
డి ) ఉగాండా
జవాబు : సి
40) సలీం ఆలి పక్షుల సంరక్షణ కేంద్రం ఉన్న ‘చోరావో
దీవి ‘ (మాండోవి నది దగ్గర ) ఏ రాష్ట్రములో ఉంది ?
ఎ ) హిమాచల్ ప్రదేశ్
బి)లక్ష ద్వీప్
సి) గోవా
డి ) పుదుచ్చేరి
జవాబు : సి
41) MiG-27 విమానాలకు ఇండియన్ ఎయిర్ ఫోర్సు వారు
జోద్ పూర్ లో వీడ్కోలు చెప్పారు . MiG విమానాలలో ఎన్ని రకాలు ఉన్నాయి ?
ఎ ) MiG-23 BN
బి) MiG-23 BF
సి) MiG-23 బైసన్ ; MiG-UPG
డి ) పైవన్నీ ( గతం లో రష్యా MiG లను సరఫరా
చేసింది )
జవాబు : డి
42) 650 పార్లమెంటరీ నియోజక వర్గాలున్న హౌస్ అఫ్
కామన్స్ ( సామాన్యుల సభ ) ఇంగ్లాండ్ లో బోరిస్ జాన్సన్ యొక్క కన్సర్వేటివ్ పార్టీ
కి ఎన్ని వోట్లు వచ్చాయి ?
ఎ ) 40
బి) 203
సి) 365
డి ) 11
జవాబు : సి
43 ) ‘ఆపరేషన్ ట్విస్ట్ ‘ వివరాలేవీ ?
ఎ ) రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా నిర్వహించే ఓపెన్
మార్కెట్ ఆపరేషన్స్ కు సంబంధించినది
బి) గవర్నమెంట్ బాండ్స్ ను కొనటం , మరియు అమ్మటం
ను వరుసగా RBI చేయటాన్ని ఆపరేషన్ ట్విన్ అంటున్నారు
సి) RBI ఇటీవల రు.10,000 కోట్ల విలువ గల
‘గవర్నమెంట్ బాండ్’ లను అమ్మింది - మరియు - కొన్నది
డి ) పైవన్నీ
జవాబు : డి
44) హేమంత్ సోరెన్ జార్ఖండ్ ముఖ్య మంత్రి అయ్యారు .
ఆయన పార్టీ జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్ని సీట్లు
సంపాదించింది ?
ఎ ) 25
బి) 30
సి) 9
డి ) 15
జవాబు : బి
45) ‘స్పేస్ ఫోర్స్’ అనే మిలిటరీ శాఖ ను అధికారికంగా
ఏర్పాటు చేయటానికి ఏ దేశ అధ్యక్షుడు ఆమోదం
తెలిపాడు ?
ఎ ) జపాన్
బి) USA
సి) న్యూ జీలాండ్
డి ) తైవాన్
జవాబు : బి
46) 1905 లో రైల్వే బోర్డు ప్రారంభ మయ్యింది .
దీనిలో 8 మంది సభ్యులున్నారు, చైర్మన్ తో సహా . ఇప్పటి నుండి దీనిలో 5 మందే
సభ్యులుంటారు , దేనికి ప్రాతినిధ్యం వహిస్తూ ?
ఎ ) మౌలిక సదుపాయాలు ; ఆపరేషన్స్ & బిజినెస్
డెవలప్మెంట్
బి) రోలింగ్ స్టాక్
సి) ఫైనాన్సు
డి ) పైవన్నీ ( ఉన్నత అధికారులకి హోదా ని,
ఇండియన్ రైల్వే మనగెమెంట్ సర్వీస్ IRMS
అనే కొత్త పేరు తో పిలుస్తారు . బోర్డు లో
కొంత మంది స్వతంత్ర సభ్యులు కూడా ఉండవచ్చును )
జవాబు : డి
47) నేషనల్ పాప్యులేషన్ రిజిస్టర్ (NPR) కోసం రు.3,941.35
కోట్లు ; మరియు 2021 జనాభా లెక్కల కోసం రు.8754.23 కోట్లు
ఆమోదించారు . 2010 లో పరిపాలన లో ఉన్న UPA
ప్రభుత్వం, NPR ని ప్రారంభించింది . 2003 నాటి సిటిజెన్ షిప్ రూల్స్ ప్రకారం, NPR
లో సేకరించిన డేటా తో నేషనల్ రిజిస్టర్ అఫ్ ఇండియన్ సిటిజన్స్ తయారు చేయవచ్చును.
2011 లో సేకరించిన కులాల డేటా , సోషియో –ఎకనామిక్ కాస్ట్ సెన్సేస్ (SECC) లో భాగం అయ్యింది . 2021
జనాభా లెక్క లు ఎప్పటి నుండి సేకరించ దలిచారు ?
ఎ ) ఫిబ్రవరి 9, 20 21 నుండి ఫిబ్రవరి 20 21 వరకు
బి) ఏప్రిల్ 2020 నుండి సెప్టెంబర్ 20 20 వరకు
సి) అక్టోబర్ 2020 లో
డి ) డిసెంబర్ 2020 లో
జవాబు : ఎ
48) రోహాతాంగ్ టన్నెల్ ( సొరంగ మార్గం ) కి ‘అటల్ టన్నెల్’ అనే పేరు పెట్టారు . దీని వివరాలు ఏవి ?
ఎ ) రోహతాంగ్ పాస్(మార్గం )లో గతం లో ప్రజలు ప్రయాణించే వారు . దీని కింద
ఇప్పుడు నిర్మిస్తున్న సొరంగ మార్గం పొడవు
8.8 కి.మీ.
బి)దీని వల్ల మనాలి , లెహ్ మధ్య ప్రయాణ దూరం 46
కి.మీ. తగ్గుతుంది.
సి) సోలాంగ్ లోయలో , హిమాచల్ ప్రదేశ్ లో 20 10 లోనే దీని పని
మొదలయ్యింది. ఇది పూర్తయితే 3000 మీటర్ల ఎత్తులో ఉన్న అతి పొడవైన టన్నెల్
అవుతుంది.
డి ) పైవన్నీ ( ఈ సొరంగ మార్గానికి అటల్ బిహారి వాజ్ పాయి పేరు పెట్టారు )
జవాబు : డి
49) అటల్ భూజల్ యోజన వివరాలు ఏవి ?
ఎ )20 20 - 2021
నుండి 5 ఏళ్ల కోసం రు.6,000 కోట్లు కేటాయించారు . ( సగం ఖర్చు కేంద్ర ప్రభుత్వం
, మిగిలిన సగం ఖర్చు ప్రపంచ బ్యాంకు నుండి సమకూరుస్తారు )
బి) భూగర్భ జల యాజమాన్యం ఈ పధకం యొక్క ప్రధాన
లక్ష్యం
సి) గుజరాత్ , హర్యానా , కర్ణాటక , మధ్య ప్రదేశ్ ,
మహారాష్ట్ర , రాజస్తాన్ , ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలలో గుర్తించిన ప్రాంతాలలో
కమ్యూనిటీ వారు పలు పంచు కోవటం ద్వారా ఈ లక్ష్యాన్ని సాధిస్తారు . 78 జిల్లాల్లో ,
8350 గ్రామా లలో దీని అమలు చేస్తారు
డి ) పైవన్నీ
జవాబు : డి
50) 20 10 లో సేకరించిన నేషనల్ పాప్యులేషన్
రిజిస్టర్ ( NPR) డేటా ని , గతం లో ఏ
రాష్ట్రాలు పలు రకాల (అభివృద్ధి ) పధకాలకు ఉపయోగించుకున్న రాష్ట్రాలు ఏవి ?
ఎ ) తమిళనాడు
బి) ఒడిష , మణిపూర్
సి) రాజస్తాన్ , పశ్చిమ బెంగాల్
డి ) పై 5 రాష్ట్రాలు
జవాబు : డి
51) “2019
మొదటి అర్ధ భాగం లో , భారత దేశ ఆర్ధికాభివృద్ధి లో ఉన్న ‘స్లో డౌన్ ‘ కి కారణం ‘సైక్లికల్’ మాత్రమే
. ఇది ‘స్ట్రక్చరల్’ కాదు “ అని ఏ అంతర్జాతీయ
సంస్థ అన్నది ?
ఎ ) ILO
బి) WHO
సి) ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్
డి ) IAEA
జవాబు : సి
52) నేషనల్ పెన్షన్ స్కీం (NPS) కు చేసే
కాంట్రిబ్యూషన్లు ఎన్ని ‘ఎస్సెట్’ క్లాసులుగా వర్గీకరించారు ?
ఎ ) ఈక్విటీ (E)
బి) కార్పొరేట్ బాండ్స్ (C)
సి) గవర్నమెంట్ బాండ్స్ (G) మరియు ఆల్టర్నేటివ్
ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ (A)
డి ) పై నాలుగు రకాలుగా (E,C,G,A)
జవాబు : డి
53 ) బారాబతి స్టేడియం ఎక్కడుంది ?
ఎ ) కాన్పూర్
బి) ధర్మశాలా
సి) కటక్ , ఒడిష
డి ) ముంబై
జవాబు : సి
54) మాన్యు యల్ మారెరో క్రూజ్ ఏ దేశ ప్రధాన మంత్రి
గా నియమించబడ్డారు ?
ఎ ) UAE
బి) క్యూబా
సి) జింబాబ్వే
డి ) సోమాలియా
జవాబు : బి
55) రష్యా నుండి జర్మనీ కి గ్యాస్ ను సప్లై
చేయటానికి ఉద్దేశించిన , ‘నార్డ్ స్త్రీం
2 గ్యాస్ పైప్ లైన్’ ను ఏ సముద్రం లో
వేస్తున్నారు ?
ఎ ) బాల్టిక్ సముద్రం
బి) బిస్కే బే
సి)అరేబియా సముద్రం
డి ) ఓఖో ట్ స్క్ సముద్రం
జవాబు : ఎ
56) 1.4.2020 నుండి అమలు లోకి వచ్చే భారత్ స్టేజ్ -
VI ఎమిషన్ స్టాండర్డ్స్ (BS-VI) వేటిని నిర్ణ యించాయి ?
ఎ )పెట్రోల్ తో నడిచే కార్లు 60 mg/KM కన్నా
ఎక్కువ నైట్రోజన్ ఆక్సైడ్ విడుదల చేయరాదు ; పార్టి క్యులేట్ మేటర్ (ధూళి కణాలు ) 4.5
mg / KM కన్నా ఎక్కువ విడుదల చేయరాదు
బి) డిజిల్ తో నడిచే కార్లు అయితే నైట్రోజన్
ఆక్సైడ్ ను 80 mg / KM ను మించరాదు ; పార్టి క్యులేట్ మేటర్ (PM) 4.5 mg/KM
మించరాదు
సి)BS-VI ప్రమాణాల ప్రకారం వాడే ఇంధనం తో నడిచే
వాహనాలు సల్ఫర్ కంటెంట్ ణి 5 రెట్లు తక్కువగా విడుదల చేస్తాయి. ఇలాంటి వాహనాల కి
ఆన్ బోర్డు డయాగ్నోస్టిక్స్ , రియల్ డ్రైవింగ్ ఎమిషన్ సదుపాయాలు ఉంటాయి
డి ) పైవన్నీ
జవాబు : డి
57) సిల్కు చీరలకు పేరు గాంచిన, పైఠాన్ (ప్రతిష్ఠాన )మహారాష్ట్ర లో , ఏ నది ఒడ్డున ఉన్నది ?
ఎ ) కృష్ణా నది
బి) తుంగభద్రానది
సి) గోదావరి నది
డి ) తమిళనాడు
జవాబు : సి
58) కేంద్ర ప్రభుత్వ కాబినెట్ కమిటీ , బొగ్గు గనుల
త్రవ్వకం లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనుమతించింది. వివరాలేవీ ?
ఎ )మైన్స్ అండ్ మినరల్స్ (డెవలప్మెంట్ అండ్
రెగ్యులేషన్ ) యాక్ట్ 1957 సవరిస్తూ ఆర్డినెన్సు జారీ చేశారు
బి)కోల్ మైన్స్ (స్పెషల్ ప్రోవిజన్) యాక్ట్ 2015
ను సవరిస్తూ ఆర్డినెన్సు జారీ చేశారు
సి) ఈ సవరణల ఫలితంగా 2023 – 20 24 నాటికీ భారత
దేశం లో ఒక బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి అవుతుంది
డి ) పైవన్నీ
జవాబు : డి
59) ప్రభుత్వ రంగం లో ఉన్న నీలాచల్ ఇస్పాట్ నిగం
లిమిటెడ్ ( NINL ) దేన్నీ ఎగుమతి చేయటం లో ప్రధమ స్థానం లో ఉంది ?
ఎ ) పిగ్ ఐరన్
బి) రాగి
సి) అలుమినిముం
డి ) కోబాల్ట్
జవాబు : ఎ
60) 1656 కి.మీ.నార్త్ ఈస్ట్ నాచురల్ గ్యాస్ పైప్
లైన్ గ్రిడ్ కు కేంద్ర ప్రభుత్వం రు.5559 కోట్ల ‘వయబిలిటి గ్యాస్ ఫండింగ్ ‘ కి
ఆమోదం తెలిపింది . ఈ గ్రిడ్ వల్ల భారత దేశ ఈశాన్య రాష్ట్రాల కు చేకూరే లభాలేవి ?
ఎ )ఇళ్ళ కు గృహావసరాల నిమిత్తం వంట గ్యాస్ సరఫరా
చేస్తారు
బి) ఆటోమొబై ళ్ళకు CNG (కంప్రేస్స్ డ్ నేచురల్
గ్యాస్ ) సరఫరా చేస్తారు
సి) పరిశ్రమలకు ఇంధనం సరఫరా చేస్తారు
డి ) పైవన్నీ
జవాబు : డి
61) ఐన్ – అల్ – అసర్ ఎయిర్ బేస్ ఏ దేశం లో ఉంది ?
ఎ ) ఈజిప్ట్
బి)లెబనాన్
సి) ఇరాక్
డి )జోర్డాన్
జవాబు : సి
62) విమానం లో ఉండే బ్లాక్ బాక్స్ లను విశ్లేషిం చ
గల సాంకేతిక సామర్ధ్యం ఉన్న దేశాలు ఏవి ?
ఎ ) యునైటెడ్ కింగ్ డం
బి) ఫ్రాన్స్
సి) USA, జర్మనీ
డి ) పైవన్నీ
జవాబు : డి
63 ) రైల్వే లకు స్పెసిఫికేషన్స్ ఇచ్చే
రీసెర్చ్ డిజైన్స్ & స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (RDSO)ఎక్కడ
ఉంది ?
ఎ ) రాయ్
బరేలి
బి) కపూర్తలా
సి) లక్నో
డి ) శ్రీ పెరంబదూర్
జవాబు : సి
64) నేషనల్ గంగా కౌన్సిల్ మీటింగ్ ఇటీవల ఎవరు
అధ్యక్షత వహించారు ?
ఎ ) ప్రధాన మంత్రి
బి) యోగి ఆదిత్య నాథ్
సి) త్రివేంద్ర సింగ్ రావట్
డి ) ప్రకాష్ జవ్ డేకర్
జవాబు : ఎ
65) 20 24 నాటికీ త్రాగు నీరు , ప్రతి రోజూ ఒక
మనిషికి కనీసం ఎంత సరఫరా చేయ దలిచారు (జల్ జీవన్ మిషన్ కింద ) ? (lpcd అనగా లీటర్ పర్
కాపిటా పర్ డే లలో )
ఎ ) 80
బి) సుమారు 55
సి) 65
డి )75
జవాబు : బి
66) భారత రాజ్యాంగం లోని ఆరవ షెడ్యూల్ లో ఉన్న ఏ ఈశాన్య
రాష్ట్రాల ట్రైబల్ ఏరియా లకు అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిళ్ళ ను ఏర్పాటు చేయాలి ?
ఎ ) అస్సాం లో మూడు కౌన్సిళ్ళ ను
బి) మేఘాలయ లో మూడు కౌన్సిళ్ళ ను
సి) మిజోరాం లో మూడు కౌన్సిళ్ళ ను ; త్రిపుర లో ఒకటి కౌన్సిల్ ను
డి ) పైవన్నీ ( మొత్తం 10 కౌన్సిళ్ళ ను )
జవాబు : డి
67) అస్సాం రాష్ట్రము లో ఉన్న అటానమస్ డిస్ట్రిక్ట్
కౌన్సిళ్ళు ఏవి ?
ఎ ) కార్బి ఆంగ్ లాంగ్ అటానమస్ కౌన్సిల్ ( కార్బి
ఆంగ్ లాంగ్ జిల్లా )
బి) దిమా హసో అటానమస్ కౌన్సిల్ [ దిమా హసో (లేక ) పాత కాలపు నార్త్ కచార్ హిల్స్ జిల్లా ]
సి) బోడో ల్యాండ్ టెర్రిటోరియల్ కౌన్సిల్ (
బోడోలాండ్ టెర్రి టోరియల్ ఏరియా జిల్లా )
డి ) పై మూడు ( వీటికి సిటిజెన్ షిప్ అమెండ్
మెంట్ యాక్ట్ నుండి మినహాయింపు ఉంది )
జవాబు : డి
68) ‘కిన్ కేడ్ ఫైర్ ‘ అనే మంటలు ఎక్కడ ఏర్పడ్డాయి ?
ఎ ) సోనో మా కౌంటీ , కాలిఫోర్నియా, USA
బి) రష్యా
సి) జపాన్
డి )చైనా
జవాబు : ఎ
69) నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (NMDC)
కి ఎక్కడెక్కడ భారీగా ఇనుప ఖనిజం గనులు ఉన్నాయి ?
ఎ ) దంతేవాడ జిల్లా , ఛత్తీస్ ఘర్ ( కిరుండల్ , బైల దిల్లా )
బి)బళ్ళారి జిల్లా ( కర్ణాటక )
సి) కుమారస్వామి గనులు ( కర్ణాటక )
డి ) పైవన్నీ
జవాబు : డి
70) ఇటీవల మిస్ వరల్డ్ గా ఎవరు గెలిచారు ?
ఎ ) టోని – ఆన్ సింగ్ ( జమైకా )
బి) ఓఫ్లీ మేజినో
సి) సుమన్ రావు
డి ) వీరెవరు కారు
జవాబు : ఎ
71) అశాస్త్రీయ పద్ధతిలో బొగ్గు గనులు తవ్వటం వలన
భూమి ఉపరితలం బీటలు బారి , భూమి నుండి మంటలు బయటికి వస్తుండే ఝారియా బొగ్గు గనులు
ఏ రాష్ట్రము లో ఉన్నాయి ?
ఎ ) అరుణాచల్ ప్రదేశ్
బి) జార్ఖండ్
సి)నాగాలాండ్
డి )మిజోరాం
జవాబు : బి
72) ఫార్ములా – E దేనికి సంబంధించినది ? వివరాలేవీ ?
ఎ ) ఎలక్ట్రిక్ కార్ల తో నిర్వహించే కార్ల పరుగు
పందెం ఇది
బి) ఎలక్ట్రిక్ కారు బ్యాటరీ తో నడుస్తుంది .
దీనికి ఇంటర్నల్ కంబ శ్చన్ ఇంజిన్ ఉండదు
సి) 20 14 లో ఈ ఆలోచన మొదలయ్యింది . ఫార్ములా – E
కారు వేగం 225 KMPH వరకు చేర వచ్చును
డి ) పైవన్నీ
జవాబు : డి
73 ) ఒక నది యొక్క నీటిని ఉపయోగించటానికి
ఏవేవి తెల్సు కుంటారు ?
ఎ ) నీటిలో నైట్రేట్ ( NO3 ) స్థాయి ;
కోలి ఫారం కౌంట్ ( అనగా బాక్టీరియా కౌంట్ , 100 ML లో 97 MPN ఉండాలి ) (MPN అనగా
మోస్ట్ పాటబుల్ నెంబర్ )
బి) బయో కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ (BOD) ( ఇది 1 mg / L కన్నా తక్కువగా ఉండాలి )
సి) డిజాల్వ్ డ్ ఆక్సిజన్ (DO) కనిపించటం (
హైదరాబాద్ లో ప్రవహించే మూసి నది నీటిలో
ఇది 4 mg / L కన్నా తక్కువగా ఉంది )
డి ) పైవన్నీ
జవాబు : డి
74) IDRSS ఏమిటి ?
ఎ ) ఇండియన్ డేటా రిలే శాటి లైట్ సిస్టం ( దీని
ఇస్రో చేపట్ట నున్నది )
బి) 2000 కిలోగ్రాముల బరువున్న ఉపగ్రహాలను భూ
స్థిర కక్ష్య లో (GSO) లో ఉంచుతారు . (అనగా 36,000 కి.మీ. ఎత్తులో ) . మొదటి
ఉపగ్రహం 2020 లో పంపుతారు
సి) ఇలాంటి ఉపగ్రహాల ద్వారా గగన్ యాన్ కు
కావాల్సిన కమ్యూనికేషన్ వ్యవస్థ నిరంతరం
గా ఏర్పడుతుంది
డి ) పైవన్నీ
జవాబు : డి
75) ‘తుళు’ భాష మాట్లాడే వారు సుమారు 18,46,427 మంది
ఉన్నారు, 2011 జనాభా లెక్కల ప్రకారం . ఈ భాష ను మాట్లాడే వారు ఎక్కువగా ఎక్కడ
ఉన్నారు ?
ఎ ) కాసరగోడ్ జిల్లా ( కేరళ )
బి) దక్షిణ కన్నడ జిల్లా & ఉడుపి ( కర్ణాటక )
సి) పయస్వాని లేక చంద్ర గిరి నది వరకు ఉన్న కసార
గోడ్ జిల్లలో
డి ) పైవన్నీ ( ఈ భాష మాట్లాడే వారు భారత
రాజ్యాంగం లో ఎనిమిదవ షెడ్యూల్ లో తుళు భాష ని చేర్చమని కోరు తున్నారు )
జవాబు : డి