Monday, 16 January 2017

How to write Essay in Civils / APPSC / Group - I / Bank PO Exams


సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరిక్ష Essay Paper లో ‘డిజిటల్ ఎకానమీ’ కి సంబంధించిన వ్యాసo
(ఇటివల 500 మరియు 1000 రూపాయల  నోట్ల రద్దు వల్ల శీఘ్రం గా రాబోయే  డిజిటల్ ఎకానమీ)
డిసెంబర్ 3, 2016 రోజున సివిల్ సర్వీసెస్ (మెయిన్స్) పరీక్ష లో భాగమైన essay రైటింగ్ పరీక్ష నిర్వహించారు . పెన్ & paper పద్ధతిలో నిర్వహించే ఈ పరీక్ష essay paper లో రెండు సెక్షన్స్ ఉన్నాయి. అవి సెక్షన్-A మరియు సెక్షన్-B . ప్రతి సెక్షన్ లో 4 టాపిక్స్ ఉన్నాయి. అంటే మొత్తం 8 టాపిక్స్ ఇచ్చారు. అభ్యర్ధులు ప్రతి సెక్షన్ నుండి ఒక టాపిక్ సెలక్షన్ చేసుకుని, వ్యాసం రాయాలి. మొత్తానికి రెండు వ్యాసాలు రాయాలి. పరీక్ష సమయం మూడు గంటలు. ప్రతి వ్యాసానికి నిడివి 1000 నుండి 1500 పదాల లోపు ఉండాలి. ప్రతి వ్యాసానికి 125 మార్కులు కేటాయించారు. మొత్తానికి 250 మార్కులు.
ఒక వ్యాసం రాయటం సులువా  ? రెండు వ్యాసాలు రాయటం వలన సులభమా ?
నిజానికి  ఒకే ఒక్క వ్యాసం రాసి 250 మార్కుల భవిష్యత్తు ఎగ్జామినేర్ చేతులో పెట్టి అభ్యర్ధుల జీవితాలతో ఆడుకోవటం కంటే , ప్రతి వ్యాసానికి 125 మార్కుల చొప్పున ఉండే రెండు వ్యాసాలు రాసి , అభ్యర్ధులు  ఎక్కువ మార్కులు సంపాదించు కోవటం మేలని UPSC నిర్ధారించింది.   ఇందుకోసం అభ్యర్ధులు వ్యాసం రాసే సమయాన్ని నిర్ధారించు కోవాలి/ కేటాయించుకో వాలి.
సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఎగ్జామినేషన్ లో ఉండే essay paper లో సెక్షన్-A , సెక్షన్-B లో రాయదల్చుకున్న రెండు   వ్యాసాలను  అడ్మిషన్ సర్టిఫికేట్ లో తెలియ చేసిన ఒకే  మీడియం ( ఒకే భాష ) లో మాత్రమే రాయాలి. అంటే తెలుగు లో కూడా వ్యాసాలు రాసుకోవచ్చును.  IFS,IAS,IPS వంటి ప్రతిష్ట్ఆత్మక పోస్టులను ఆశించే అభ్యర్ధులు వ్యాసాలను తెలుగు లో రాసుకోవచ్చును.    అభ్యర్ధులకు ఇచ్చిన question – cum – answer (QCA) ఇచ్చిన ఖాళి answer sheet  లో మాత్రమే రాయాలి. ప్రతి వ్యాసం 1000  నుండి 1500 పదాలను ఎట్టి పరిస్థితు లలో  మించ  రాదు.  ఈ టెస్ట్ కు ఇచ్చిన సమయం మూడు గంటలు .

Section-A
1)If development is not engendered, it is endangered
(స్త్రీ పురుషుల మధ్య  సమానం త్వం  ఉండక పొతే , అభివృద్ది సంకటం లో పడుతుంది )
2)Need brings greed, if greed increases it spoils breed
(అవసరo  లోభత్వo పట్టుకోస్తుoది, లోభత్వం ఎక్కువైతే జాతి నాశనం అవుతుంది )
3)Water disputes between states in federal India
(ఫెడరల్ భారత దేశంలో రాష్ట్రాల మధ్య జల వివాదాలు )
4)Innovation is the key determinant of economic growth and social welfare
(కొత్తవి  కనుగోనటమే ప్రధానం గా  ఆర్ధిక అభివృద్ధి ని మరియు సామజిక సంక్షేమాన్ని నిర్ధారిస్తుంది )
Section-B
1)Cooperative federalism: Myth or Reality
(కోపరేటివ్ ఫెడరలిజం : భ్రమా  లేక నిజమా)
2)Cyberspace and internet:Blessing or curse to the human civilization in the long run
(సైబర్ స్పేస్ మరియు ఇంటర్నెట్ : దీర్ఘ కాలం లో మానవ నాగరికత కు వరమా లేక శాపమా ? )
3)Near jobless growth in India: An anomaly or an outcome of economic reforms
(భారత దేశం లో దరిదాపుల్లో నిరుద్యోగం తో కూడిన అభివృద్ది : ఆర్ధిక సంస్కరణల ఫలితమా లేక లోపమా )
4)Digital Economy: A leveler or a Source of Economic Inequality
(డిజిటల్ ఆర్ధిక వ్యవస్థ : సమానత్వం తీసుకోచ్చేదా లేక ఆర్ధిక అసమానత్వానికి మూలధారమా )
వరుస సంఖ్య
అంశం ఏ సబ్జెక్టు కి చెందినది
2016 లో వ్యాసం కోసం ఇచ్చిన టాపిక్
1
ఆర్ధిక శాస్త్రం(డిజిటల్ ఎకానమీ ; నిరుద్యోగం)
*Digital Economy: A leveler or a Source of Economic Inequality
* Near jobless growth in India: An anomaly or an outcome of economic reforms
2
సమాజం (స్త్రీ పురుష సమానత్వం )
If development is not engendered, it is endangered
భారత రాజ్యాంగం (నదీ  జల వివాదాలు; సహకార  సమాఖ్య) 
* Water disputes between states in federal India
* Cooperative federalism: Myth or Reality
4
సైన్సు & టెక్నాలజీ
(IT)
Cyberspace and internet: Blessing or curse to the human civilization in the long run
5
సామెతలను ఆధారం చేసుకుని రాయదగ్గ  వ్యాసాలు
* Need brings greed, if greed increases it spoils breed (దీన్నే తెలుగులో ‘దురాశ దుఖానికి’ అంటాము)
*Innovation is the key determinant of economic growth and social welfare (దీన్నే Necessity is the mother of invention అంటాం )


పైన ఇచ్చిన వ్యాసాలు దాదాపు అన్ని వార్త పత్రికలలో వచ్చినవే. రోజూ న్యూస్ paper చదివే వారు తప్ప కుండ answer చేస్తారు. బ్యాంకులకు సంబంధించి  ఇటివల 500 మరియు 1000 రూపాయల  నోట్ల రద్దు వల్ల రాబోయే  డిజిటల్ ఎకానమీ అంశం మీదే ఒక ప్రశ్న వచ్చింది. 1990 దశకం లో ప్రవేశ పెట్ట బడిన ఆర్ధిక సంస్కరణ ల మీద ఒక ప్రశ్న ఉంది.  ఇంటర్నెట్ ఉపయోగాలు , దుష్ప్రభావాలు మీద ఒక ప్రశ్న ఉంది. కావేరి జల వివాదం మీద ఒక ప్రశ్న ఉంది.  కేంద్ర  - రాష్ట్రా ల సంబంధాల మీద ఒక వ్యాసం ఉంది.  మళ్ళి మళ్ళి చెప్పాలంటే ఇవన్ని రోజూ వార్తా పత్రికల్లో గత 5 మాసాలుగా వరుసగా వస్తున్న అంశాలు. నిజానికి పత్రికల్లో  వ్యాసాలు కూడా వచ్చాయి.
వ్యాస రచన ఒక కళ. భాషమీద పటుత్వం ఉన్న వారిలో  కొందరికి పుట్టుకతో వస్తుంది. కొందరికి అభ్యాసం చేత వస్తుంది. మాతృభాషా తెలుగులో రాయటం సులువే. ఇంగ్లీష్ రాయాలంటే కొంచం కష్టపడాలి. అందంగా రాయటానికి అర్ధం కాని పదాలు ఉపయోగించ అవసరం లేదు . కానీ  భాషా దోషాలు ఉండరాదు. వ్యాకరణ దోషాలు ఉండరాదు. స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండరాదు . మనం రాసే ప్రతి పదానికి, ప్రతి వాక్యానికి మధ్య ఏదో విడదీయరాని బంధం ఉండాలి. వ్యాసం చదివే వారికీ ఒక జల ప్రవాహం లాగ , ఆహ్లాద కరంగా ఉండాలి. అప్పుడే మనసుకి హత్తు కుంటుంది. అందమైన దస్తూరి ఒక వరం లాగా పనిచేస్తుంది. కళ్ళ కి సంతోషాన్ని కలగచేసి , మళ్ళి మళ్ళి చదవాలనిపించేట్లు చేస్తుంది. ఇవన్నీ మేజిక్ లు. పోటీ పరీక్ష ల్లో పని చేస్తాయా అంటే , తప్ప కుండ పనికొస్తాయి. ఎందు కంటే మనం రాసింది examinar కి అర్ధ మైనప్పుడే కదా కాసిని మార్కులు పడేది.  
సివిల్ సర్వీసెస్ లో రాసే వ్యాసం లో ఈ కింది అంశాల ను పరిగణన లోకి తీసుకుంటారు :
1)అభ్యర్ధి ఇచ్చిన అంశాన్ని ఎంతవరకు గ్రహించ గలిగాడు
2) ఎన్నుకున్న వ్యాసానికి సంబంధించి రాస్తున్నాడా
3) నిర్మాణాత్మకం గా ఆలోచించే శక్తి ఉందా ? లాజికల్ గాను మరియు హృదయానికి హత్తుకునేట్టు గా తెలియ చేసే శక్తి ఉందా ? ఒక న్యాయ మూర్తి లాగా judgement ఇవ్వగలడా ?
వ్యాసాలలో తెలియ చేసే అంశాలు / ఆలోచన లు కొత్తవిగా  ఉండాలి , బహిరంగ పరిచేవిగా ఉండాలి , మానసిక పరిపక్వత తెలియచేసేవిగా ఉండాలి , రచయిత judgement సామర్ధ్యం తెలియచేసేవిగా ఉండాలి. 
ఎక్కడా కూడా   రచయిత యొక్క మానసిక అసమతౌల్యత , చిందర వందర తనం , చపలత్వం , మానసిక చాంచల్యం ,  అసంపూర్ణత్వం తెలియ చేసే వాక్యాలు  ఉండకూడదు.     
వ్యాసం రాసే ముందు ఒక విధమైన ప్లానింగ్ ఉండాలి :
1)      ముందుగా మీకు నచ్చిన టాపిక్ / ప్రశ్న ఎన్నుకోండి (ప్రశ్న పత్రం  నుండి ) (అనగా సెక్షన్ – A నుండి ) (ఆ తర్వాత సెక్షన్ – B గురించి కూడా ప్లాన్ చెయ్యండి )
2)      మీ వ్యాసాన్ని చాలా జాగ్రత్త గా ప్లాన్ చేసుకొండి
3)      వ్యాస నిర్మాణం ఆలోచించండి (అంటే వ్యాసం ఆరంభం , body , ఒక గొప్ప  ముగింపు  )
4)      కూలం కషంగా ఆలోచించండి (వీటిని జాగర్తగా ఒక వరసలో రాసుకోండి )
5)      వ్యాస పరిచయం కోసం ఎలా ఉండాలంటే, మొదటి వాక్యం చదివిన వారు , ఆఖరి వరకు చదివేటట్లు ఉండాలి
6)      వ్యాసం body లో , ఇచ్చిన సంగతి గురించిన పూర్వాపరాలు , నిజానిజాలు , లాభాలు నష్టాలు మొదలైనవి చెప్పాలి
7)      వ్యాసం ముగింపు హృదయాన్ని హత్తు కునేటట్లు ఉండాలి
హోం వర్క్ :-
ప్రతి రచయిత ,  ప్రతి రచనకి హోం వర్క్ చాలా చేయాల్సి ఉంటుంది. అంటే నిత్య పఠనo చాలా అవసరం. రోజూ న్యూస్పేపర్స్ చదవాలి. పైన టేబుల్ లో చెప్పినట్లుగా సబ్జెక్టు ల వారిగా నోట్స్ రాసుకోవాలి. మళ్ళి మళ్ళి మననం చేసుకుంటూ ఉండాలి. నూతన అంశాలు జత చేస్తూ ఉండాలి.   వార్తా పత్రికలు చదవటం వ్యాస రచనకి గొప్ప మేలు ఉంటుంది . అనేక అంశాల మీద మంచి అవగాహన ఏర్పడుతుంది.  ఇంటి దగ్గర ప్రతి రోజు ఈ పద్ధతిలో వ్యాసాలు రాయటం ప్రాక్టీసు చేయండి , కనీసం ఒక నెల రోజులు పాటు. మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రు, సర్దార్ పటేల్ , స్వామి వివేకానంద వంటి ఉన్నత వ్యక్తులు, మహానుభావులు రాసిన పుస్తకాలు చదవండి. వారి గ్రంధాలు మనకు వ్యాస రచనలో గొప్ప స్తూర్తి నిస్తాయి. మనోవికాసం కల్గిస్తాయి. మన ఆలోచనా ధోరణిని మారుస్తాయి. రేడియో లోను , టెలివిజన్ లో ను వచ్చే చర్చలు / వార్తలు కూడా పనికొస్తాయి.  
పైన చెప్పుకున్న విషయాలనే స్టెప్ లలో ఇలా స్టెప్ లలో చెప్పవచ్చును :-
స్టెప్ : 1 :వ్యాసం రాసే ముందు ౩ నుండి 4 నిముషాల పాటు కూల్ గా ఆలోచించండి.  4 – 5 పాయింట్స్ రాసుకోండి. ఇవి వ్యాసం body కోసం పనికొస్తాయి
స్టెప్ : 2  ‘ఇంట్ర డ క్షన్’ రాయటానికి కనీసం 5 నిముషాలు వెచ్చించండి. మొదటి లైన్ ని ‘వెల్ కం ‘ లైన్ అంటారు.  దీనిలో జనరల్ ఐడియా గురించి రాస్తారు. ఆ  తర్వాత రాసే లైన్ ని , ‘హిస్టరీ లైన్’ అంటారు .  గత కాలం లో మనం ఎన్నుకున్న టాపిక్ కు గల చరిత్ర ఏమిటో తెలియ చేస్తాం .  తర్వాత లైన్ లో ‘నేటి పరిస్థితి ‘ రాయాలి. (మొత్తం మీద 150 నుండి 200 పదాలలో ఇది పూర్తి కావాలి. )
స్టెప్ ౩ : ఇందులో వ్యాసం ‘body ‘ ఉంటుంది. మనం గట్టిగా అనుకున్న 4 లేక 5 పాయింట్స్ ను విస్తారం గా తెలియ చేయండి. దీనిలో మెయిన్ టాపిక్ గురించి రాయాలి . విషయాన్నీ పేరాగ్రాఫ్ ల విడగొట్టి రాయాలి. ప్రతి పారా లోనూ అనుకున్న పాయింట్లను మూడు లేక 4 వాక్యాలలో రాయాలి
స్టెప్ 5: మనం రాసిన దాన్ని మరల ఒక సరి తిరిగి చదువుకోండి. గ్రామర్ తప్పులు, స్పెల్లింగ్ తప్పులు , కామాలు, ఫుల్ స్టాప్ లు మొదలైనవి సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోండి.
స్టెప్ 6 : ముగింపు రాయండి. (దీనిలో మీ వ్యాసం క్లుప్తం గా చెప్పండి. concluding statements రాయండి. వీటిని టాపిక్ తో లింక్ చేయండి )





బ్యాంకు పరీక్ష ల్లో essay రైటింగ్ :
 స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా ప్రొబేషనరీ ఆఫీసర్ ఎగ్జాం మెయిన్స్ లో వ్యాస రచన ఉంది. దీన్ని ఇంగ్లీష్ లేక హిందీ లో మాత్రమే రాయాలి. వ్యాస రచన కూడా online లో కంప్యూటర్ కీ బోర్డు ఉపయోగించి టైపు చేయాలి.  ఇందులో ఒక వ్యాసమే రాయాలి. వ్యాసం 250 నుండి 350 పదాల లోపులో నే ఉండాలి. కేటాయించిన సమయం ఒక గంట. వ్యాసం రచన  తో పాటు , ఒక లెటర్ రైటింగ్ కూడా చేయమని  ఇస్తారు.  ఇటీవల SBI ఆఫీసర్ పరిక్ష్ మెయిన్స్ లో ఇచ్చిన టాపిక్ లు చూద్ద్దాం :  
a) Importance of knowing history for a citizen
b) Effect of Salary Increase on Economy
c) Effect of The New Game Pokemon GO
d)How useful is aadhar card
e)Impact of unearthing of black money on Indian economy
f)Security of women in workspace, an increasing cause of concern
g) Pros & cons of inflation
h)Consequences of globalization
i)Knowledge is power
j)Rise and fall of currency
k)Do you think RTI can remove corruption? If yes, then whey there  were huge scams in past few years?

త్వరలో RBI ఆఫీసర్ ఎగ్జాం నిర్వహించ నున్నారు :-
RBI పరీక్ష లో essay రైటింగ్ కూడా online పద్ధతిలోనే ఉంటోంది. గతం లో essay రైటింగ్ కోసం ఇచ్చిన ప్రశ్నలు:
1)Gold  schemes in India
2)Will China’s downturn help India ?
3)Climate catastrophe is  due to man’s wild construction
4)Is India need bold capital investment ?
5)Is progress possible without peace ?
దీన్ని ఇంగ్లీష్ లేక హిందీ లో మాత్రమే రాయాలి. వ్యాస రచన కూడా online లో కంప్యూటర్ కీ బోర్డు ఉపయోగించి టైపు చేయాలి.  ఇందులో ఒక వ్యాసమే రాయాలి. వ్యాసం 250 నుండి 350 పదాల లోపులో నే ఉండాలి. కేటాయించిన సమయం ఒక గంట. వ్యాసం రచన  తో పాటు , ఒక లెటర్ రైటింగ్ కూడా చేయమని  ఇస్తారు.


No comments:

Post a Comment