Monday, 16 January 2017

Multi Tasking Staff (MTS)


కేవలం పదో క్లాసు పాసైతే కేంద్ర ప్రభుత్వ  కార్యాల యా లలో వచ్చే  ఉద్యోగం  MTS
పూర్వం బంట్రోతు .... ఇప్పుడు MTS
అప్పుడు బంట్రోతు గానే మిగిలి పోయేవారు .... ఇప్పుడు అలాంటి బాధ  లేకుండా అంచెలంచెలుగా పదోన్నతులు పొందే అవకాశాలు మెండు గా ఉన్న పదవి  MTS
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ని రిక్రూట్ చేసుకోటానికి ప్రకటన ఇచ్చింది. 
జీతం : Pay Band-1( 5200- 20200/-) + Grade Pay 1800/-,(Revised Pay Scale after 7th CPC Pay Matrix Level – 01)  (అర్ధమయ్యే టట్లు చెప్పా లంటే, ఇప్పుడు కొత్తగా చేరేవారికి రు.18000/- మూల వేతనం గా ఇస్తారు. దీని పై అదనం గా , కరువు బత్తెం + ఇంటి అద్దె అలవెన్స్ + కన్వేయన్సు అలవెన్సు వస్తాయి. మొత్తం జీతం రు.24,000/- వరకు రావచ్చును  )
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) విధులు ఏవి ?
కేంద్ర ప్రభుత్వం DoPT OM No.AB-1407/6/2009-Estt(RR) dated 30.04.2010 ద్వారా ఈ కింది పనులు తెల్పింది :
1.రికార్డు సెక్షన్ ని భౌతికంగా మెయిన్ టైన్ చేయాలి
2. సెక్షన్ / యూనిట్ లో  జనరల్ క్లీన్లినెస్ మరియు upkeep చూడాలి
౩. ఆఫీస్ బిల్డింగ్ లోపల ఫైల్స్ మరియు ఇతర పేపర్లు  మోయాలి
4. ఫోటో కాపియిo గ్ చేయటం , FAX పంపించటం
5. సెక్షన్ / యూనిట్ లో ఇతర non – clerical వర్క్ చేయటం
6.డైరీ , డిస్పాచ్ వంటి రొటీన్ వర్క్ చెయ్యడమే  మాత్రమే కాకుండా , కంప్యూటర్ మీద  చేసే పని లో కూడా    సాయపడటం
7. డాక్ (ఉత్తరాలు ) డెలివరీ చేయటం ( బిల్డింగ్ లోపల మరియు బైట )
8. వాచ్ & వార్డ్ డ్యూటీ లు (కాపలా కాయటం ) చెయ్యటం
9. ప్రతి రోజూ  ఉదయం పూట  రూమ్ లను ఓపెన్ చెయ్యాలి & సాయం కాలం పూట ఆఫీస్ లు క్లోజింగ్ చెయ్య టం
10. ఆఫీస్  రూమ్ లను క్లీన్ చెయ్య టం  
11.  ఆఫీసు లో ఉన్న ఫర్నిచర్ మీద పడ్డ దుమ్ము దులపటం మొదలైవని
12. ఆఫీసు  బిల్డింగ్, ఫిక్స్ చర్స్  క్లీనింగ్ చెయ్యటం
13. అతను / ఆమె ITI అర్హత కు సంబంధించి న వర్క్ ఉంటె చెయ్యటం
14.  ఆఫీస్ కార్లను నడపటం , ఒకవేళ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటె
15.  ఆఫీస్ ఆవరణ లో ఉన్న పార్క్ లను, లాన్ లను , కుండి (pot)  లలోని మొక్కలను బాగా పెంచటం
16. ఆఫీస్ లో ఉన్న  పై అధికారులు చెప్పిన ఏ పనైనా చెయ్యటం

పైన చెప్పిన పనులే కాక , మరే ఇతర డ్యూటి ఐన చెప్ప వచ్చును
(ఆరవ వేతన సంఘం కాలం కి ముందు కలం లో   ఈ పనులు చెయ్యటానికి ప్యూన్స్ , దఫ్తరి , జామ్దార్ , జూనియర్ గేస్తేట్ నర్ ఆపరేటర్ (duplicating యంత్రం ఆపరేటర్ ) , ఫరాఫ్  , చౌకి దార్ , సఫాయి వాలా , మాలి వంటి వారు ఉండేవారు . ఇప్పుడు,వీరందరి పోస్ట్ లను re-designate చేసి, వారికే MTS అనే పేరు పెట్టారు . .     ఈ పన్లన్నింటికి కలిపి చెయ్యటానికి గాను నియమించే వ్యక్తులను   MTS అనే ఒకే ఒక పేరుతొ పిలుస్తున్నారు . ఈ విధం గా సమాజం లో ఒక గొప్ప హోదా కల్పించారు)  
కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలో పనిచేసే క్లర్క్ ల కోసం , స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే పరీక్ష లో ఎలాంటి సిలబస్ ఉందొ అంటే సిలబస్ MTS కోసం కూడా ఉంది. క్లర్క్ పరీక్ష లో ప్రేలిమ్స్  పరీక్ష  మరియు మెయిన్స్ పరీక్ష ఉన్నాయి . MTS లో ఒకే పరీక్ష ఉంది. అంటే work is worship గా భావించే వారికీ (ఉద్యోగం పురుష లక్షణం అని గొప్పలు చెప్పే వారికీ ) , క్లర్క్ పరీక్ష రాసే వారు దీన్ని రాస్తే పరీక్ష లో pass అవ్వటం ఖాయం, ఉద్యోగం రావటం 100 % గారంటీ .   

మల్టీ టాస్కింగ్ స్టాఫ్ రిక్రూట్మెంట్ కోసం SSC నిర్వహించే పరీక్ష లో ప్రధానం గా రెండు పేపర్స్ ఉంటాయి :
అవి :
Paper – I :
మొదటి paper లో  ఈ కింది నాలుగు రకాల  టెస్ట్ లు ఉంటాయి. దీనికి 150 మార్కులు కేటాయించారు. ఈ paper కి   సంబందించిన ప్రశ్నలు అన్ని  objective టైపు లో ఉంటాయి :
1)General Intelligence & Reasoning ( 25questions) : 25 మార్కులు
2)Numerical Aptitude ( 25 questions) : 25 మార్కులు
౩)General English ( 50 questions) : 50 మార్కులు
4)General Awareness (50 questions) : 50 మార్కులు
Paper – II :
ఇది రెండవ paper. ఇది   డి స్క్రి ప్టివ్ తరహా పరీక్ష . ఇందులో ఒక షార్ట్ వ్యాసం లేక ఉత్తరం రాయటం ఉంటాయి . దీని కి కేటాయించిన మార్కులు 50 . దీన్ని ఇంగ్లీష్ లో గాని లేక భారత రాజ్యాంగం ఎనిమిదవ షెడ్యూల్ లో తెల్పిన ఏ భారతీయ భాష లో నైన రాయవచ్చును. అంటే తెలుగు లో కూడా దీన్ని రాయవచ్చును.  

ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణా రాష్ట్రా లలో ఉన్న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ఏవి ?
అకౌంటెంట్ జనరల్ ఆఫీస్ , ఇన్ కమ్-టాక్స్ ఆఫీస్ , సెంట్రల్ ఎక్సైజ్ ఆఫీస్ , సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్టుమెంటు , పాస్ పోర్ట్ ఆఫీస్ , సెంట్రల్ లేబర్ కమీషనర్ ఆఫీస్ , సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ , పబ్లికేషన్స్ డివిజన్ ఆఫీస్ లు మొదలైనవి .  

 paper I లో ఉన్న General Intelligence & Reasoning టెస్ట్ కి సంబంధించిన అంశాలు పరిశీలిద్దాం :-
ఈ టెస్ట్ లో వెర్బల్ మరియు non – వెర్బల్ ప్రశ్నలు ఉంటాయి .  
వెర్బల్ ప్రశ్నలు : -
ఏనాలజి :
కాకి పిల్ల కాకికి ముద్దు
కుక్క పిల్ల కుక్క కి ముద్దు
పంది పిల్ల పందికి ముద్దు
ఈ మూడు వాక్యాలలో మనము చేసిన పని ఏమిటంటే ..... ఒక జంతువును , దాని పిల్ల ని పోల్చాం . క్లుప్తం గా పోలిక లేక ఇంగ్లీష్ లో Analogy అంటారు.
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్ష (2016 లో ) ఇచ్చిన ప్రశ్న చూద్ద్దాం :

Bird : Worm :: ______  : ________
(1)    Trap : Cheese
(2)    Lion : Cave
(3)    Cat : Mouse
(4)    Horse : Stable
వివరణ : ప్రశ్న లో పక్షి : పురుగు అని ఇచ్చాడు . పక్షి కి పురుగు కి లింక్ ఏమిటి ? అని అలోచేస్తే.... పక్షి కి ఆహారం పురుగు.  అదే విధం గా ఏ జంతువు/ఏది పట్టుకుని ఆహారం గా తింటుంది ?  పిల్లి  ఎలకను లేక చుంచుని పట్టుకుని ఆహారం గా తింటుంది . కనుక ఇదే సరైన సమాధానం .  Ans: (3) .
ఇలాంటి ప్రశ్నలను ఇంగ్లీష్ భాష  లో  పరిజ్ఞానo ఉన్న వాళ్ళు సులువుగా పట్టేస్తారు . అంటే భాష మరియు తార్కిక శక్తి రెండు కలిసి పని చెయ్యాలి. నిజానికి తెనాలి రామలింగడు లాంటి  మహా కవులు ఇలాంటి మేధా శక్తి కల్గి ఉన్నారు .
మరో ప్రశ్న :
6 : 18 : : 4 :  ?
(1)    8       (2) 10    (3) 14    ( 4) 6
ఇది కూడా analogy కి సంబంధించిన ప్రశ్నే . కానీ ఇక్కడ అంకె లను పోలుస్తున్నాడు . గణిత శాస్త్రం తో ముడి పడి ఉంది.   
లెక్కలు , ఎక్కాలు (tables) బాగా వచ్చిన వారు సులువుగా వీటిని పట్టేస్తారు.  ఈ ప్రశ్నని విశ్లేసిద్దాం ....
స్టెప్ 1 : మూడవ ఎక్కం తీసుకుందాం :  ఒక మూడు మూడు ... రెండు మూళ్ళ ఆరు ...
మూడు మూళ్ళ 9 , నాలుగు మూళ్ళ 12 , ఐదు మూళ్ళ 15 , ఆరు మూళ్ళ 18 .
స్టెప్ 2 : రెండవ ఎక్కం తీసు కుందాం : ఒక రెండు ... రెండు ... రెండు రెండ్ల నాలుగు ...
మూడు రెళ్ళ 6 ,  నాలుగు రెళ్ళ 8 ,  ఐదు రెళ్ళ 10 , ఆరు రెళ్ళ 12 , ఏడు రెళ్ళ 14 .
విశ్లేషణ : ఇచ్చిన సమాధానాల ఆప్షన్స్  లో..... 8 ఉంది . 10 ఉంది . 14 ఉంది . 6 ఉంది.
ఈ తికమక పోవాలంటే ... ఇంకో పద్ధతి వెదుకుదాం ...
 6 x 6 = 36 .... దీన్ని  సగం చేస్తే  18 వస్తుంది .
అలాగే  4 x 4 = 16   .... దీన్ని  సగం చేస్తే 8  వస్తుంది .   కనుక answer 8
  మనకి ప్రాధమిక సూత్రాలు తెలియటం తో పాటు , ప్రాక్టీసు కూడా చాలా అవసరం .  అప్పుడే సరైన సమయం లో సరైన సమాధానం పట్టుకోవచ్చును.
కోడింగ్ / డీ కోడింగ్ :
 గ్రామ ప్రాంతాల్లో స్కూళ్ళ లో చదివే చిన్న పిల్లలు, సరదాగా తోటి పిల్లల తో ‘ క ‘ భాషలో మాట్లాడు తుంటారు . ఇలాంటి ప్రయోగమే రాజేంద్ర ప్రసాద్ సినిమాల్లో , జంధ్యాల సినిమాల్లో కనిపిస్తుంది.  బాహుబలి సినిమా లో కూడా ఈ పద్ధతి లోనే ప్రత్యెక భాష రూ పొందిo చారు, ప్రత్యెక ఆకర్షణ కోసం   .
మనం మాట్లాడేది ఇతరులకు సులభంగా అర్ధం కాకుండా , మన స్నేహితులకి మాత్రమే తెలియా లనేది ఇందులోని సారంశం .
దీనికే ఇంగ్లీష్ లో Coding / Decoding పేరు పెట్టారు .
SSC పరీక్ష లో (2016) ఇచ్చిన ప్రశ్న :
If ABLE is written as 5324 and BINGO is written as 36178, then BANGLE can be written as what ?
(1)    356724
(2)    321846
(3)    362417
(4)    351724
Ans: (4)
వివరణ : ముందుగా ABLE అనే పదాన్ని , దాని కోడ్ ని ఈ కింది బాక్స్ లో రాద్దాం :
A
B
L
E
5
3
2
4
   
అలాగే BINGO అనే పదం లో అక్షరాలను , దాని కోడ్ ని ఈ కింది బాక్స్ లో రాద్దాం :

B
I
N
G
O
3
6
1
7
8

ఇప్పుడు BANGLE అనే పదం లో ని అక్షరాలకి , పైన తెల్పిన బాక్స్ లలోని ఏ ఇంగ్లీష్ అక్షరానికి , ఏ సంఖ్య ఉందొ చూసుకుని మరో బాక్స్ లో రాద్దాం :

B
A
N
G
L
E
3
5
1
7
2
4
  అంటే  ఈ ప్రశ్న సమాధానం కోసం ఇలా ఆలోచించాం ...
B   కి    3,  A  కి    5 ,   N కి    1 ,   G  కి    7,   L  కి    2  ,   E  కి   4  రాశాం .  వీటినే వరుసగా రాసుకుంటే 351724 ఆన్సర్ అయ్యింది.
నొన్ – వెర్బల్ ప్రశ్నలు :
గతం లో బ్యాంకు పరీక్ష ల్లో రీజనింగ్ టెస్ట్ లో 25 ప్రశ్నలకి పైగా ఇచ్చేవారు . ఇప్పుడు బ్యాంకు పరీక్ష ల్లో ఇవ్వటం లేదు.  కాని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్ష ల్లో 5 ప్రశ్నల ఈ రకమైనవి ఇస్తున్నారు.
paper కటింగ్ అంశం మీద వచ్చే ప్రశ్న :
స్కూల్ పిల్లలు ఫన్షన్ ల కోసం , జెండా పండగ నాడు , వినాయక చవితి నాడు డెకరేషన్ కోసం రంగు రంగుల కాగితాలు కత్తిరించి, వాటిని గోడలకి మైదా పిండితో అతికించి  స్కూల్ ని , క్లాసు రూమ్ లని డెకరేషన్ చేస్తుంటారు. కొంత మంది పిల్లలు పుస్తకాలలోని కాగితాలు చించి కాగితం రాకెట్ లు గా  విసిరేస్తుంటారు. కొంతమంది కాగితాలు చించి పడవలు, వంటి ఆకారాలు చేస్తుంటారు.  ఇలాంటి పద్ధతి ని paper క్రాఫ్ట్ అని మాములుగా చెప్పవచ్చును.
ఒక చతురస్రాకారం లో ఉన్న కాగితాన్ని సమానం గా మధ్య కి మడత పెట్టి , మళ్ళి మధ్య కి మడత పెట్టాం.  ఒక కత్తెర తో మధ్య లో గాని , ఎదో ఒక మూలాన గాని  కత్తెర తో కత్తిరించి , లేక చిన్న చిల్లు పెట్టి తర్వాత కాగితాన్ని విప్ప దీసి చూస్తాం . మనం అనుకున్న డిజైన్ వచ్చిందో లేదో తెల్సు కోటానికి. ఈ విధం గా కాగితం లో రకరకాల ఆకారాలు కనిపిస్తాయి. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే , మనం కాగితం లో  కత్తిరిo చింది , మడత పెట్టిన  ఒక భాగం లో ఐనా , కాగితం మడత విప్పగానే కాగితం  నాలుగు భాగాలలో దాని ఫలితం కనిపిస్తుంది .
దీన్ని ఆధారం చేసుకుని స్టాఫ్ సెలక్షన్  కమిషన్ పరీక్ష  లో  ప్రశ్న ఒకటి ఇస్తున్నారు .
అద్దం తో కనిపించే బొమ్మ ఆధారం చేసుకునే అడిగే ప్రశ్న :
మనం నిత్యం అద్దం లో మనల్ని మనం చూసుకుంటూ ఉంటాం. ప్రత్యే కించి గమనిస్తే, మన కుడి చెయ్యి అద్దం లో ఎడమ చెయ్యి లాగా అనిపిస్తుంది. కుడి చెవి , మనకి ఎడమ చెవి లాగా అనిపిస్తుం టుంది . మిగతా శరీర భాగాలు అదేవిధంగా కనిపిస్తాయి.  మనం అంతగా పరిశీలించం.   ఈ సూక్ష్మాన్ని ఆధారం చేసుకుని , SSC పరీక్ష లో ఒక ప్రశ్న non – వెర్బల్ రేఅసోనింగ్ లో ఇస్తున్నారు.   

నోట్ : ఇక్కడో చిన్న మాట చెప్పాలి . కేంద్ర ప్రభుత్వం నడిపే కొన్ని  సెంట్రల్ స్కూల్స్ లో, 8 , 9 తరగతులలో  రీజనింగ్ & జనరల్ ఇంటలిజెన్స్ కి సంబం ధిం చిన  పాఠ్యాంశాలను సిలబస్ లో చేర్చారు. మన తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వ & ప్రైవేటు స్కూ ళ్ళలో చదివిన  అభ్యర్ధులు ప్రత్యే కించి కోచింగ్ తీసుకుంటే గాని వీటిని సులువుగా అర్ధం చేసుకో లేరు


పైన చెప్పిన వన్నీ చూడటానికి సులభం గా ఉన్నా , పోటి ప్రపంచం లో ఉన్న candidates , ప్రతి సబ్జెక్టు కి సంబంధించిన ప్రాధమిక సూత్రాలు తెల్సుకుంటూ , ఇంటి దగ్గర ప్రాక్టీసు చేస్తుండాలి. మోడల్ టెస్ట్ లు రాస్తుం డాలి .  పరీక్ష ల్లో విజయం కోసం చిన్న చిన్న వ్యాసాలు , ఉత్తరాలు రాయటం కూడా ప్రాక్టీసు చేయాలి. 

No comments:

Post a Comment