Thursday, 23 February 2017

Tennis Grand Slam



కీర్తి , కనకం లభించే టెన్నిస్ క్రీడ
ఆధునిక టెన్నిస్ గేమ్ ఇంగ్లాండ్ లోని బిర్మింగ్ హాం లో late 19 వ శతాబ్దపు రెండవ అర్ధ భాగం లో ‘లాన్ టెన్నిస్ ‘ పేరుతొ ఆవిర్భవించింది . గ్రాండ్ శ్లామ్ అంటే ఒక క్యాలెండరు సంవత్సరం లో ప్రతిష్టా త్మక మైన నాలుగు మేజర్ ఈవెంట్స్ ని గెలవటం.
 టెన్నిస్  క్రీడ లో గ్రాండ్ శ్లామ్ టోర్నమెంట్ లను మేజర్స్ అని కూడా పిలుస్తారు. ప్రతి సంవత్సరం నిర్వహించే నాలుగు టెన్నిస్ ఈవెంట్స్ ను గ్రాండ్ శ్లామ్ అంటారు. ఇవి ర్యాంకింగ్ పాయింట్స్ ఇస్తాయి , ప్రైజ్ మనీ ఇప్పిస్తాయి , పబ్లిక్ లోను మీడియా లోను  చాలా గొప్ప గుర్తింపు తెస్తాయి.
గ్రాండ్ శ్లామ్ లో, ప్రతి సంవత్సరం  ఈ కింది ప్రధాన పోటీ లు ఉంటాయి :
1)      ఆస్ట్రేలియా ఓపెన్  :( జనవరి  నెల  మధ్య భాగం లో ప్రారంభం అవుతుంది.)
2)      ఫ్రెంచ్ ఓపెన్ : (మే , జూన్ నెలలో  ఉంటుంది )
3)      వింబుల్డన్ (లండన్ ) (జూన్ , జూలై నెలలో ఉంటుంది )
4)      US ఓపెన్ : (ఆగష్టు , సెప్టెంబర్ లలో ఉంటుంది )
ప్రతి ఈవెంట్ ను దాదాపు రెండు వారాల పాటు నిర్వహిస్తారు .
1)ఆస్ట్రేలియా ఓపెన్ ను జనవరి లో మెల్బోర్న్ , ఆస్ట్రేలియా లో నిర్వహిస్తారు. తొలి సారిగా 1905 గా ఈ పోటీ లు నిర్వహించారు. ఇక్కడ లెజెండ్స్ మరియు ఎగ్జి బిషన్ ఈవెంట్స్ కూడా నిర్వహిస్తారు. ఆస్ట్రేలియా ఓపెన్ ని టెన్నిస్ ఆస్ట్రేలియా నిర్వహిస్తుంది.
2)ఫ్రెంచ్ ఓపెన్ ని , రోలాండ్ గార్రోస్ అని పిలుస్తారు . పారిస్ లో ఉన్న స్తేడ్ రోలాండ్ గార్రోస్ లో నిర్వహిస్తారు. రోలాండ్ గార్రోస్ అనే ఫ్రెంచ్ ఏవి యే టర్ పేరు మీద దీన్ని నిర్మించారు. ఇది ప్రీమియర్ ఎర్ర మట్టి తో చేసిన  టెన్నిస్ కోర్ట్ . 

౩) వింబుల్డన్ ప్రపంచం లోనే  చాలా పాతది. వీటన్నింటి లోను ప్రతిష్టా కర మైనది. 1877 నుండి లండన్ లో అల్ ఇంగ్లాండ్ క్లబ్ , అవుట్ డోర్ లో గ్రాస్స్ కోర్ట్ లలో నిర్వహిస్తున్నారు.   అల్ ఇంగ్లాండ్ లాన్ టెన్నిస్ అండ్ క్రో క్వెట్ క్లబ్ ను జూలై 23 , 1868 లో ప్రైవేటు క్లబ్ గా స్థా పించారు .  వింబుల్డన్  కోర్ట్ ని గ్రీన్ గ్రాస్స్ కోర్ట్ అంటారు.
జెంటిల్ మెన్ సింగిల్ స్  ఛాంపియన్ షిప్  కి  ‘సిల్వర్ గిల్ ట్ కప్’  18.5 అంగుళాలు ( సుమారు 47 సెంటీమీటర్ స్) ఎత్తు , మరియు 7.5 అంగుళాలు (సుమారు 19 సెంటీమీటర్ స్ డయామీటర్ లో ఉంటుంది .
లేడీస్ సింగిల్ స్ ఛాంపియన్ కి   ‘స్టెర్లింగ్ సిల్వర్ సాల్వేర్’  అనగా సాధారణం గా పిలిచే ‘వీనస్ రోజ్ వాటర్ డిష్ ‘ ని బహుమతిగా ఇస్తారు . దీని డ యామీ టర్  18 . 75 అంగుళాలు ( సుమారు 48 సెంటి మీటర్ స్ )  ఉంటుంది. దీని చుట్టూ తా మై థా లజి  ఇతివృత్తం గల బొమ్మల తో డెకరేట్ చేస్తారు.
4 )యునైటెడ్ స్టేట్స్ అఫ్ అమెరికా ఓపెన్ టెన్నిస్ ఛాంపియన్ షిప్స్ కోర్ట్ హార్డ్ టెన్నిస్ కోర్ట్ . 1881 నుండి పోటీ లు నిర్వహిస్తున్నారు.  . మెన్స్ సింగిల్స్ , ఉమెన్స్ సింగిల్స్ , మెన్స్ & ఉమెన్స్ డబుల్స్ , మిక్స్ డ్ డబుల్స్ పోటీ లు నిర్వహిస్తారు . ఇవి గాక సీనియర్ , జూనియర్ , వీల్ చైర్ ప్లేయర్స్ కోసం కూడా టోర్నమెంట్ లు నిర్వహిస్తారు. ఈ క్రీడల ద్వారా వచ్చిన సొమ్ముని USA లో టెన్నిస్ క్రీడ అభి వృద్ధి కోసం వాడతారు. 1978 నుండి కరోన పార్క్ , న్యూ యార్క్ సిటీ లో పోటీ లు నిర్వహిస్తున్నారు.  




క్రమ సంఖ్య
ఈవెంట్ పేరు
క్రీడా స్థలి
పురుషుల సింగల్  స్ విజేత
పురుషుల సింగల్ విజేతకు   నగ దు బహుమతి
మహిళల సింగల్  స్ విజేత
మహిళల సింగల్ విజేత  కు నగదు బహుమతి
1
ఆస్ట్రేలియా ఓపెన్ 
(2017 ,జనవరి )
మెల్బోర్ న్
రోజర్ ఫెదరర్
A $ 3,700,000

సెరెన విలియం స్
A $ 1,900,000
2
ఫ్రెంచ్ ఓపెన్ : (మే , జూన్ 2016 )
పారిస్

నోవాక్ డి జొకోవిక్
Euro
2,000,000

గార్బినే ముగురుజా
Euro 1,000,000
3
వింబుల్డన్ (లండన్ ) (జూన్ , జూలై  2016)
లండన్
అండి ముర్రే
 2,౦౦౦ ,౦౦౦ బ్రిటిష్ pounds
సెరెన విలి యమ్ స్
1,౦౦౦ , ౦౦౦
బ్రిటిష్ pounds
4
US ఓపెన్ : (ఆగష్టు , సెప్టెంబర్ 2016 )
న్యూ యార్క్ సిటీ
స్టానిస్లాస్ వావ్రింక
$3,500,000
ఎంజేలి క్ కేర్బెర్
$1,750,000


టెన్నిస్ క్రీడా లో ఫైనల్ లో గెల్చిన విజేతలకే కాకుండా, సెమి ఫైనల్స్ , క్వార్టర్ ఫైనల్స్, రౌండ్ 16 , రౌండ్ 32 , రౌండ్ 64, రౌండ్ 132 లలో గెల్చిన వారికీ కూడా నగదు బహుమతులు ఇస్తారు.  క్రీడా కారులకి  రాంక్ లు ప్రకటిస్తారు .


టెన్నిస్ కోర్ట్ దీర్ఘ చతురస్రాకారం లో ఉంటుంది.  78 అడుగులు పొడవు , 27 అడుగులు వెడల్పు ఉంటుంది. (సింగిల్స్ మ్యాచ్ కి ) . డబుల్స్ మ్యాచ్ కి 36 అడుగులు వెడల్పు ఉంటుంది.
టెన్నిస్ కోర్ట్ ల ఉపరితలం  గడ్డి , మట్టి , హార్డ్ కోర్ట్ లుగా చెపుతుంటారు. హార్డ్ కోర్ట్ ల కోసం అస్ఫాల్ట్ , ఎక్రిలిక్ లతో టాప్ లతో ఏర్పాటు చేస్తారు.
సీడ్  లేక సీడింగ్ అంటే ఏమిటి ?
టోర్నమెంట్ ల లో  ప్లేయర్ స్  రాంక్ ల ప్రకారం ఒక వరస క్రమం ను ఏర్పాటు చేస్తారు.  తొలి రౌండ్   ఆటలో , ఇతర రాంక్ ప్లేయర్స్ తో ఆడకుండా , ఈ విధానం ఉపయోగ పడుతుంది.    సీడ్ అనే ది ,  టెన్నిస్ తోనే ప్రారంభం అయ్యింది అంటారు.  
టెన్నిస్ రాకెట్ ?
ఇంగ్లీష్ లో racket or racquet అనే స్పెల్లింగ్ తో రాస్తారు.  దీని ఫ్రేమ్ లో ని  హిట్టింగ్ ఏరియా  29 అంగుళాల పొడవు , 12.5 అంగుళాల వెడల్పు తో ఉంటుంది. టెన్నిస్ రాకెట్  ల తయారీకి  చెక్క , మెటల్ , గ్రాఫైట్ , సింథటిక్ మెటీరియల్  ఏదైనా వాడతారు.
టెన్నిస్ బాల్ ?
టెన్నిస్ బాల్ స్  తొలి కాలం లో వస్త్రం తో తయారు చేసే వారు. ఆధునిక కాలం లో వల్కానైజేడ్ రబ్బర్ మరియు ఫెల్ట్  (felt)coating తో చేస్తున్నారు . టెన్నిస్ బాల్ బరువు  56 గ్రములకి 59 .4 గ్రాములకి  మధ్య ఉంటుంది.
టెన్నిస్ క్రీడ లో వాడే సాంకేతిక పదాలు :
Aces, Double faults, First Serve, Net Points won, Break Points won, Winners, Unforced errors, Distance covered(m), etc.
గమనిక : -

పోటి పరీక్ష లలో క్రీడ లకు సంబంధించిన ప్రశ్నలు వస్తుంటాయి. అవి గెల్చిన క్రీడాకారుల గురించి, వారి కప్ ల గురించి, కోర్ట్ విస్తర్ణం గురించి , సాంకేతిక పదా ల గురించి , పోటి నిర్వహించిన స్టేడియం పేరు  , స్థలం గురించి ఉంటాయి. 

No comments:

Post a Comment