విజ్ఞాన
విపంచి
జూలై ,
2020
ప్రాతూరి
పోతయ్య శర్మ
1) మార్కెటింగ్ సీజన్ 2020-2021 కోసం కేంద్ర
ప్రభుత్వ పు కాబినెట్ కమిటి ఆన్ ఎకనామిక్ ఎఫైర్స్
(CCEA), ఖరీఫ్ పంటల MSP(కనీస మద్దతు ధర లు ), పెంచింది. ఈ
కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ ) వరి ( కామన్ రకం ) : రు.1868/- క్వింటాల్ కి
బి)ప్రత్తి (మీడియం స్టేపుల్ రకం ) : రు.5,515/-
క్వింటాల్ కి
సి)మొక్క జొన్న : రు.1850/- క్వింటాల్ కి
డి )పైవన్నీ
జవాబు : డి
2) ‘హరిహరేశ్వర్’ ఎక్కడుంది ?
ఎ ) కొంకణ్
కోస్ట్ , రాయ్ ఘడ్ జిల్లా , మహారాష్ట
బి) తమిళ్ నాడు
సి) కేరళ
డి ) పంజాబ్
జవాబు : ఎ
3 ) ‘ప్రధాన మంత్రి స్ట్రీట్ వెండార్స్ ఆత్మ
నిర్భర్ నిధి పధకం’ వివరాలు ఏవి ?
ఎ ) ఇది వీధి వ్యాపారులకు ప్రారంభించిన మైక్రో
క్రెడిట్ పధకం
బి)ఈ పధకం కింది 50 లక్షల మంది వరకు లబ్ది పొందు తారు. మార్చ్ 2022 వరకు ఈ పధకం అమలు
లో ఉంటుంది .
సి ) ఈ పధకం లో ప్రతి ఒక్కరికి రు.10,000 వరకు
వర్కింగ్ కాపిటల్ ఋణం గా ఇస్తారు . ఒక సంవత్సరం లోపు తిరిగి చెల్లిం చాలి. దీని వడ్డీ పై సబ్సిడి ఉంది .
డి )పైవన్నీ
జవాబు : డి
4) బాగ్ జాన్ నేచురల్ గ్యాస్ బావి ఎక్కడుంది ?
ఎ )జమ్మూ & కాశ్మీర్
బి) రాజస్తాన్
సి) అస్సాం (తిన్ సుకియా జిల్లా )
డి ) హర్యానా
జవాబు : సి
5)’బ్రు’ తెగ కాందిశీకుల క్యాంపు ఎక్కడుంది ?
ఎ ) మైసూరు
బి) కాంచన్ పూర్ సబ్ డివిజన్ , త్రిపుర
సి) ముంబై
డి )నాగపూర్
జవాబు : బి
6) ఎడారి మిడతల (Schistocerca
gregaria) దండు దాడి ఎక్కడున్న ప్రాంతాల పై ఉంది ?
ఎ ) ఛత్తీస్ ఘర్
బి) మధ్య ప్రదేశ్
సి) రాజస్తాన్
డి ) పైవన్నీ
జవాబు : డి
7) ప్రతి పాదిoచిన ‘సోషల్ స్టాక్ ఎక్స్ ఛేoజ్ (SSE)
వివరాలు ఏవి ?
ఎ )సోషల్ ఎంటర్ ప్రైజెస్ మరియు వాలంటరి
ఆర్గనైజేషన్స్ దీనిలో లిస్టింగ్ కావచ్చును
బి) లాభా పేక్ష లేని సంస్థలు, బాండ్ లు జారీ ల ద్వారా దీనిలో లిస్టు కావచ్చును
సి) ప్రస్తుతానికి బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ ,
నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ లలో దీన్ని ప్రారంభించ వచ్చును అని తెలిపారు
డి )పైవన్నీ
జవాబు : డి
8)MSME లకు ఉత్పాదక సామర్ధ్యం పెంచు కొనేందుకు
మరియు వాటిని ఉత్సాహ పరిచేందుకు గాను,
కాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ ఎఫైర్స్ (CCEA) ‘ఈక్విటీ ఇన్ ఫ్యూజన్’ కోసం ఎంత మొత్తం
ఆమోదించింది ?( రు.కోట్ల లో )
ఎ ) 5,000
బి)50,000
సి) 2,000
డి ) 10,000
జవాబు : బి
9) MSME (మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ ప్రైజెస్) లకు
ఇచ్చిన కొత్త నిర్వచనం ఏది (పెట్టుబడి
లిమిట్ & టర్నోవర్ ల దృష్ట్యా తెలిపింది ) ?
ఎ ) మైక్రో ఎంటర్ ప్రైజ్ లు :- పెట్టుబడి లిమిట్
రు.ఒక కోటి లోపు ; టర్నోవర్ రు.5 కోట్ల లోపు
బి) స్మాల్
ఎంటర్ ప్రైజ్ లు :- పెట్టుబడి లిమిట్ రు.10 కోట్ల లోపు ; టర్నోవర్ రు.50
కోట్ల లోపు
సి) మీడియం
ఎంటర్ ప్రైజ్ లు :- పెట్టుబడి లిమిట్ రు.50 కోట్ల లోపు ; టర్నోవర్ రు.250
కోట్ల లోపు
డి )పై వన్ని
జవాబు : డి
10) పాష్ మీనా గోట్ (మేక ) (కష్మీరీ) నుండి దేన్ని
సేకరిస్తారు ? (ఛాంగ్
థాoగి రకం టిబెట్ లో ఉంటుంది )
ఎ ) ఉన్ని (దీన్ని చాలా విలువైన పాష్ మీనా శాలువలు నేయటానికి వాడతారు )
బి) సిల్క్
సి) జనప నార
డి )పీచు
జవాబు : ఎ
11) ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(WHO)
ఎగ్జిక్యూటివ్ బాడీ చైర్ ఇండియా కి
లభించింది . వివరాలు ఏవి ?
ఎ ) ఈ పదవికి డాక్టర్ హర్ష వర్ధన్ ఎన్నికయ్యారు .
బి)ఈ బాడీ లో 34 మంది సభ్యులు ఉంటారు
సి ) వరల్డ్ హెల్త్ అసెంబ్లీ నిర్ణయాలను అమలు
చేస్తుంది
డి ) పైవన్నీ
జవాబు : డి
12) ఎస్సెన్షియాల్ కమ్మోడి టీస్ యాక్ట్ (ECA)లిస్టు
నుండి ఆర్డినెన్సు ద్వారా వేటికి మినహాయింపులు ఇవ్వదలిచారు ?
ఎ ) పప్పు ధాన్యాలు
బి ) నూనె గింజలు
సి) వంట నూనెలు , ఉల్లి పాయలు , ఆలు గడ్డలు
డి )పై వన్ని
జవాబు : డి
13 )ఈ కింది వాటిల్లో ఏది కాంట్రాక్టు
ఫార్మింగ్ కి సంబంధిoచైన ఆర్డినెన్సు ?
ఎ ) ది ఫార్మింగ్ ప్రొడ్యూస్ ట్రేడ్ &
కామర్స్ ( ప్రొడక్షన్ & ఫెసిలిటేషన్ ) ఆర్డినెన్సు ,2020
బి)ది ఫార్మర్స్ ( ఎం పవర్ మెంట్ &
ప్రొటెక్షన్ ) అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ ఎ ష్యురెన్స్ & ఫార్మ్ సర్వీసెస్ ఆర్డినెన్సు
,2020
సి)అత్యవసర సరకుల చట్టo కు సంబంధించిన ఆర్డినెన్సు
డి ) ఇవేవి కావు
జవాబు : బి
14) ‘ఇండియా ‘ నే ‘భారత్ ‘ అనే వాక్యం / పదాలు, భారత రాజ్యాంగం లో ఎన్నవ ఆర్టికల్ లో ఉన్నాయి ?
ఎ ) ఆర్టికల్ 13
బి) ఆర్టికల్ 1
సి) ఆర్టికల్ 352
డి ) ఆర్టికల్ 356
జవాబు : బి
15) శ్యామ ప్రసాద్ ముఖర్జీ ఓడ రేవు అనే పేరు దేనికి పెట్టారు ?
ఎ ) ముంబై పోర్ట్
బి)కోల్ కత్త పోర్ట్
సి) చెన్నై పోర్ట్
డి ) కొచ్చిన్ పోర్ట్
జవాబు : బి
16) బోర్డర్ ఏరియా డెవలప్ మెంట్ ప్రోగ్రాం (BADP)
కింది 2020-2021 లో రు.784 కోట్లు కేటాయించారు . మన దేశ సరిహద్దు లో ఉన్న ఏ రాష్ట్రాలకు ఈ లభ్ధి చేకూరనున్నది ?
ఎ ) లడక్ , అరుణాచల్ ప్రదేశ్
బి) హిమాచల్ ప్రదేశ్
సి ) ఉత్తరా ఖండ్ , సిక్కిం
డి ) పైవన్నీ
జవాబు : డి
17)G-7 దేశాల కూటమిని , G-11 గా మార్చే ప్రతిపాదన
ఉంది . ఇందు కోసం ఏ దేశాల ను చేర్చు కోదలిచారు ?
ఎ ) భారత దేశం
బి)రష్యా
సి)దక్షిణ కొరియా , ఆస్ట్రేలియా
డి )పైవన్నీ
జవాబు : డి
18) ‘నిసర్గ ‘ తూఫాన్ ఏ సముద్రం లో వచ్చింది ?
ఎ ) అరేబియా సముద్రం
బి) బంగాళాఖాతం
సి) పసిఫిక్ మహాసముద్రం
డి ) ఇవేవి కావు
జవాబు : ఎ
19) ‘అం ఫన్’ తూఫాన్ వల్ల దెబ్బతిన్న ‘డూప్లే పాలెస్’ ఎక్కడుంది ? ( దీన్ని ఫ్రెంచ్ గవర్నర్ జనరల్
జోసెఫ్ ఫ్రాంకాయిస్ – డూప్లే నిర్మించాడు )
ఎ ) బొబ్బిలి
బి)చంద న్నగర్ , పశ్చిమ బెంగాల్
సి) శ్రీకాకుళం
డి ) విశాఖ పట్నం
జవాబు : బి
20) సేతు కరాయ్ కోస్ట్ ( సముద్ర తీరం ) ఎక్కడుంది ?
ఎ )
మన్నార్ గల్ఫ్
బి) గోవా
సి) గుజరాత్
డి)మహా రాష్ట్ర
జవాబు : ఎ
21) మిడతల దండు రాక ను పసిగట్టే లోకస్ట్ వార్నింగ్
ఆర్గనైజేషన్ (LWO) ఎక్కడుంది ?
ఎ )కోల్ కత
బి) జోద్ పూర్ , రాజస్తాన్
సి) దిమాపూర్
డి ) గౌహతి
జవాబు : బి
22) హార్న్ అఫ్ ఆఫ్రికా లో ఉన్న దేశాలు ఏవి ?
ఎ ) ఇథియోపియా
బి)సోమాలియా
సి)డ్జిబౌటి
డి ) పై మూడు
జవాబు : డి
23 ) భారత దేశ ఆర్ధికాభివృద్ధి రేట్ ( 2019-2020
ఆర్ధిక సంవత్సరం లో ) నాల్గవ క్వార్టర్ (Q4) ( అనగా జనవరి – మార్చ్,2020 ) లో ఎంత ?
ఎ ) 4.2%
బి)2.2 %
సి)5.2 %
డి )5 .9 %
జవాబు : ఎ
24)UN మిలిటరీ జెండర్ అడ్వకేట్ అవార్డు ఇటీవల ఎవరికి
ఇచ్చారు ?
ఎ )మేజర్ సుమన్ గమానీ (ఈమె UN MISSలో
పనిచేశారు )
బి) పాట్రిషియా స్కాట్లాండ్
సి)రాఫెల్ గ్రోస్సీ
డి )జీన్స్ స్టోలెన్ బెర్గ్
జవాబు : ఎ
25) జనవరి 2020 ఆఖరు కి భారత దేశం లో ఎంత మంది
టెలిఫోన్ సబ్ స్క్రై బర్లు ఉన్నారు ?
ఎ ) 1,177.02 మిలియన్ లు (టెలి డెన్సిటి : 87.45 %)
బి)100 మిలియన్ లు
సి) 500 మిలియన్ లు
డి ) 200మిలియన్ లు
జవాబు : ఎ
26) ఇండియా – చైనా ల మధ్య (LAC కి సంబంధించి ) ఏ భూ భాగాల పై చర్చ లు ఉంటాయను కున్నారు ?
ఎ ) గాల్వాన్ ఏరియా ( లడక్ లో ఉంది )
బి) పాన్ గాంగ్ ట్సో ( ఫింగర్ ఏరియా 4 )
సి) గోగ్రా
డి ) పైవన్నీ (ఛు షుల్ – మోల్డో బోర్డర్ మీటింగ్
పాయింట్ అనుకున్నారు )
జవాబు : డి
27) ‘నాకు లా ‘ ఎక్కడుంది ?
ఎ ) పంజాబ్
బి)సిక్కిం దగ్గర
సి) జమ్మూ & కాశ్మీర్
డి ) హిమాచల్ ప్రదేశ్
జవాబు : బి
28) ‘గవి’ (గ్లోబల్ అల్లయన్స్ ఫర్ వాక్సిన్
& ఇమ్యూనైజేషన్ ) (జెనీవా, స్విట్జర్లాండ్ ) కి భారత దేశం ఎంత ఇస్తానన్నది
? ( మిలియన్ డాలర్ల లో )
ఎ ) 5
బి)15
సి)10
డి ) 20
జవాబు : బి
29)UN సెక్యూరిటీ కౌన్సిల్ లో నాన్ – పెర్మనెంట్
సభ్యులను ఎవరు ఎన్ను కుంటారు ?
ఎ ) వరల్డ్ బ్యాంకు వారు
బి)UN జనరల్ అసెంబ్లీ లో ఉన్న 193 సభ్యులు
సి) IMF వారు
డి ) IAEA వారు
జవాబు : బి
30) N.O.R.M.S అనే
అబ్రివేషన్ లో M అనే అక్షరం ఏ పదం కోసం ?
ఎ ) మని
బి) M: మల్టి లేటరల్ (N.O.R.M.S :న్యూ
ఓరియంటేషన్ ఫర్ ఏ రిఫార్మ్ డ్ మల్టీ లేటరల్ సిస్టం )
సి) మోస్ట్
డి ) మినిమం
జవాబు : బి
31) రు.500 కోట్ల పేమెంట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్
డెవలప్మెంట్ ఫండ్ (PIDF) ఎవరు ఏర్పాటు చేశారు ?
ఎ ) నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్
బి) బొంబాయి స్టాక్ ఎక్స్ చేంజ్
సి) రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా
డి ) IRDAI(ఐ. ఆర్. డి. ఎ. ఐ. )
జవాబు : సి
32) LiDAR (లైట్ డిటెక్షన్ & రేంజింగ్ ) డేటా తో
ఘుమ్లి , టెంపుల్ సిటీ ప్రాంతాన్ని పరిశీలించి
, విశ్లేషించ దలిచారు . ఘుమ్లి ఎక్కడుంది ?
ఎ ) బార్దా కొండలు , సౌరాష్ట్ర , గుజరాత్
బి) పశ్చిమ బెంగాల్
సి) ఒడిష
డి ) బీహార్
జవాబు : ఎ
33 ) ఆర్య భట్ట రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ అఫ్
అబ్జర్వేషనల్ సైన్సెస్ (ARIES) ఎక్కడుంది ?
ఎ ) తిరు వ నంత పురం
బి)నైనిటాల్
సి) మహేంద్ర గిరి హిల్స్
డి ) హసన్
జవాబు : బి
34) మనిషి ఊపిరి తిత్తులలో ప్రధానం గా ఎక్కడ రక్తం
లోనికి ఆక్సిజన్ చేరుతుంది ?
ఎ ) విండ్ పైప్ / ట్రాకియా
బి)బ్రాంకి
సి)అల్వియోలి
డి )నోరు
జవాబు :సి
35) సగటు మనిషి ఊపిరి తిత్తులలో ఎన్ని అల్వియోలీ లు
ఉంటాయి ?
ఎ ) సుమారు 3 మిలియన్ లు
బి) ఒక మిలియన్
సి) రెండు మిలియన్ లు
డి ) ఇవేవి కావు
జవాబు : ఎ
36) ‘సైటో కిన్ స్టార్మ్’ అంటే ఏమిటి ? వివరాలు ఏవి ?
ఎ )ఇన్ ఫె క్షన్ కి వ్యతి రేకం గా యుద్ధం
చేయటానికి మనిషి శరీరం లో సై టో కిన్స్ అనే ప్రోటీన్ లు రక్తం లో విపరీతం గా
ఉత్పత్తి అవటా న్ని సైటో కిన్ స్టార్మ్(తుఫాను ) అంటారు .
బి) ఇందు వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది
సి) కొన్ని సందర్భాలలో , రక్తం లో గడ్డలు ఏర్పడి ,
ఆక్సిజన్ ఉపయోగించు కోవటం తగ్గ వచ్చును
డి ) పైవన్నీ
జవాబు : డి
37)ఈ కింది వాటిల్లో ఏవి Covid-19(కోవిడ్ – 19) కి
సంబంధించిన సాంకేతిక పదాలు ?
ఎ ) సూపర్ స్ప్రెడర్
బి)కమ్యూనిటి ట్రాన్స్ మిషన్
సి)కాంటాక్ట్ ట్రేసింగ్
డి ) పైవన్నీ
జవాబు : డి
38) వెల్లియార్ పుఝా (నది ) ఎక్కడ ప్రవహిస్తోంది ?
ఎ ) మంగళూరు
బి) పాలక్కాడ్ జిల్లా (సైలెంట్ వ్యాలి ) , కేరళ
సి) మైసూరు
డి ) కావేరి పట్నం
జవాబు : బి
39) పర్షియన్ గల్ఫ్ చుట్టూ గల దేశాలు ఏవి ?
ఎ )బాహ్రెయిన్ , కతార్, సౌదీ అరేబియా
బి)UAE, ఇరాన్ , ఇరాక్ , కువైట్
సి) ఒమన్
డి ) పైవన్నీ
జవాబు : డి
40) దిబ్రూ - సైఖోవా నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది ?
ఎ ) ఉత్తరా
ఖండ్
బి)అస్సాం
సి) మేఘాలయ
డి )త్రిపుర
జవాబు : బి
41)ఈ సంవత్సరం భారత దేశం లో గోధుమ పంట 1,071 లక్షల
టన్నుల కన్నా ఎక్కువ గా ఉంటుంది . (ఇది పోయిన సంవత్సరం కన్నా 36 లక్షల టన్నులు
ఎక్కువ ). ఈ సంవత్సరం గోధుమ పంటలో ఫుడ్ కార్పొరేషన్ అఫ్ ఇండియా, గోధుమ కొనుగోలు
చేసే లక్ష్యం ఎంత ? ( లక్ష ల టన్ను లలో )
ఎ )342.6
బి) 341
సి)407
డి )
113
జవాబు : సి
42) ఆఫ్రికా ఖండం లో ఎర్ర సముద్రం తీరం లో ఉన్న దేశాలు ఏవి ?
ఎ ) సుడాన్ & ఎరిత్రియా
బి) సౌదీ అరేబియా
సి) సిరియా
డి ) జోర్డాన్
జవాబు : ఎ
43 ) Covid-19 (కోరోనా వైరస్ ) చేత ఆర్ధికంగా
బాగా దెబ్బ తిన్న ఐరోపా దేశాలను ఆదుకోటానికి , ఎంత విలువ గల ‘రెస్క్యూ ప్లాన్ ‘
విడుదల చేశారు ? ( బిలియన్ యూరో లలో )
ఎ ) 750
బి)500
సి) 300
డి ) 200
జవాబు : ఎ
44) ఉర్సులా వాన్ డెర్ లే యెన్ దేనికి అధ్యక్షు రాలు
?
ఎ )ప్రపంచ బ్యాంకు
బి) యురోపియన్ కమిషన్
సి) ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకు
డి ) ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్
జవాబు : బి
45)Covid-19 వల్ల ఆర్ధికం గా బాగా దెబ్బ తిన్న ఐరోపా
దేశాలు ఏవి ?
ఎ ) ఇటలీ
బి)స్పెయిన్
సి)గ్రీసు
డి )పైవన్నీ
జవాబు : డి
46) ప్రతిపాదిత నేషనల్ క్రెడిట్ గ్యారెంటీ ట్రస్ట్
కంపెనీ లిమిటెడ్ (NCGTC) వివరాలు ఏవి ?
ఎ ) దీని ద్వారా రు.3లక్షల కోట్ల రుణాలు MSME
సెక్టార్ కు అందిస్తారు
బి)బ్యాంకు ల ద్వారా పొందే రుణాలకు వడ్డీ రేట్ 9.25% ; (NBFC ల ద్వారా అయితే వడ్డీ
రేట్ 14% )
సి)రుణo తిరిగి చెల్లించే కాలపరిమితి : 4 సంవత్సరాలు
డి ) పైవన్నీ
జవాబు : డి
47)పెట్రా పోల్ పోర్ట్ ఏ దేశాల సరిహద్దు దగ్గర ఉంది ?
ఎ ) ఇండియా - బంగ్లా దేశ్ ( పశ్చిమ బెంగాల్ లోని
నార్త్ 24 పరగణాల లోని జెస్సోర్ రోడ్ ఇక్కడికి దారి తీస్తుంది )
బి) ఇండియా – నేపాల్
సి) ఇండియా – పాకిస్తాన్
డి ) ఇండియా – చైనా
జవాబు : ఎ
48) తెలంగాణా రాష్ట్రములో 15 tm cft కెపాసిటీ ఉన్న కొండ పోచమ్మ రిజర్వాయర్ కు ఏ నది నీళ్ళు
తీసుకొచ్చారు ?
ఎ )కృష్ణ నది
బి) గోదావరి నది
సి) పెన్నా నది
డి ) తుంగ భద్ర నది
జవాబు : బి
49) చీమలు కుట్టి నప్పుడు మంట పుడుతుంది. మన శరీరం
లోనికి చీమలు ఏ ఆమ్లాన్ని విడుదల చేస్తాయి
?
ఎ ) సల్ఫ్యూరిక్ ఆమ్లం
బి) నైట్రిక్ ఆసిడ్
సి) హైడ్రో
క్లోరిక్ ఆసిడ్
డి ) ఫార్మిక్
ఆమ్లం
జవాబు : డి
50) ఇటీవల
ఇండియా – ఆస్ట్రేలియా ప్రధాన మంత్రుల మధ్య జరిగిన వర్చ్యువల్ సమావేశం /
చర్చలలో ఏ అంశాలు ప్రస్తావనకు వచ్చాయి ?
ఎ )MLSA: మ్యూచ్యు వల్ లా జి స్టిక్ సపోర్ట్
అగ్రిమెంట్
బి ) ఇండో - పసిఫిక్ ప్రాతం లో మారిటైమ్ కో ప రే
షన్ కోసం షేర్డ్ విజన్
సి)కనీసం రెండేళ్ళ కో సారి 2 + 2 ఫార్మాట్ ద్వై
పాక్షిక మీటింగ్ లు నిర్వహించటం
డి ) పైవన్నీ
జవాబు : డి
51) ‘వందే భారత్ మిషన్’ కింద
విదేశాల నుండి ఎంత మంది భారత దేశానికి వచ్చేందుకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ? (
5.6.2020 నాటికి )
ఎ )3,48,565
బి)1.76 లక్షలు
సి)1,07,123
డి )32,000
జవాబు : ఎ
52) వర్చ్యువల్ గ్లోబల్ వాక్సిన్ సమ్మిట్ (సమావేశం )
ఇటీవల ఎవరు నిర్వహించారు ?
ఎ ) USA అధ్యక్షుడు
బి) బ్రిటిష్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్
సి)కెనడా ప్రధాన మంత్రి
డి ) రష్యన్ అధ్యక్షుడు
జవాబు : బి
53 ) మధ్య తరగతి మనుషుల జీవితాలను ప్రధానం
అంశం గా బసు చట్టర్జీ సినిమాలు తీశారు . అయన సినిమా లు ఏవి ?
ఎ )’పియా కా ఘర్’
బి) ‘ప్రియతమా’
సి) ‘రజని గంధ’
డి ) పైవన్నీ
జవాబు : డి
54) ప్రఖ్యాత హాకీ ఆటగాడు బల్బీర్ సింగ్ సీనియర్ కి సంబంధించినవి ఏవి ?
ఎ ) మూడు సార్లు ఒలింపిక్ గేమ్స్ లో ఛాంపియన్
బి) 1957 లో పద్మ శ్రీ ఇచ్చారు
సి)1956 మెల్ బోర్న్ లో
ఒలింపిక్ , ప్రారంభం లో భారత కంటిoజెంట్ ని లీడ్ చేశాడు
డి ) పైవన్నీ
జవాబు : డి
55) భారత రాజ్య సభ మొదటి చైర్మన్ ఎవరు ?
ఎ ) డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్
బి)మాడభూషి అనంత శయనం అయ్యంగార్
సి)జేమ్స్ మాడిసన్
డి ) N.గోపాల స్వామి అయ్యంగార్
జవాబు : ఎ
56)జిన్నా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ఎక్కడుంది ?
ఎ )ఆఫ్ఘనిస్తాన్
బి) కరాచీ , పాకిస్తాన్
సి) బంగ్లా దేశ్
డి ) శ్రీ లంక
జవాబు : బి
57) ఆచార్య జగ దీష్ చంద్ర బోస్ ఇండియన్ బొటానికల్
గార్డెన్, షిబ్ పుర్ , పశ్చిమ బెంగాల్ లో ఉంది . దాని వివరాలు ఏవి ?
ఎ )క్రీస్తు శకం 1787 లో పనులు మొదలయ్యాయి .
బి)273 ఎకరాల గార్డెన్
సి) హుగ్లీ నదికి దగ్గరలో ఉంది
డి ) పైవన్నీ
జవాబు : డి
58) రు.20 లక్షల కోట్ల కు (పైన) విలువ గల ఆత్మ
నిర్భర్ భారత్ అభియాన్ ఆర్ధిక ప్యాకేజ్ లో ( ప్రోత్సాహం కోసం) ఏవేవి ఉన్నాయి ?
ఎ )స్మాల్ బిజినెస్ వారికి :- రు.3లక్షల
కోట్ల ఎమర్జెన్సీ క్రెడిట్ MSME ల కోసం ; టెండర్ ల ద్వారా ప్రభుత్వం చేసే
కొనుగోళ్ళ లో రు.200కోట్ల లోపున్న
ప్రభుత్వ టెండర్ లలో వి దే శీ
టెండర్ లు అనుమతించక పోవటం .
బి)ఆర్ధిక సెక్టార్ కి :-
NBFC ల కోసం ఫ్రెష్ గా రు.45,000 కోట్ల పాక్షిక గారెంటీ; మరియు మైక్రో
ఫైనాన్సు సంస్థ లు ,హౌసింగ్ ఫైనాన్సింగ్ కంపెనీ లు , NBFC ల కోసం రు.30,000
కోట్ల స్పెషల్ లిక్విడిటి
సి)మౌలిక సదుపాయాల రంగానికి :-ఇబ్బందుల్లో
ఉన్న రాష్ట్ర విద్యుత్ పంపిణీ ల కోసం విద్యుత్ PSU లు రు.90,000 ట్ల సహాయం ;
డి ) పై వన్ని (ఇవి గాక మూడు నెలల పాటు
ఉద్యోగస్తుల జీతం లో EPF కోసం చట్ట పర డిడక్షన్ ను 12% నుండి 10% కి తగ్గింపు ;
ఇన్ కం టాక్స్ రిటర్న్ దాఖలు చేసే గడువు పొడిగింపు )
జవాబు : డి
59) ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ ఎకనామిక్ ప్యాకేజ్ ని
సంక్షిప్తం గా చెప్పండి ?
ఎ ) ఇది రు.20 లక్షల కోట్ల కు పైగా విలువ గల
ఆర్ధిక ప్యాకేజ్ పధకం
బి)దీనికి ముందు ప్రకటించిన ప్రధాన మంత్రి గరీబ్
కళ్యాణ్ యోజన అంశాలు ఇందులో భాగం గా ఉంటాయి
సి)
ఇందులో భాగం గా రు.8,01,603
కోట్ల విలువ చేసే ,రిజర్వు
బ్యాంకు అఫ్ ఇండియా తీసుకున్న లిక్విడిటీ పెంపు చర్యలు ఉన్నాయి (ఇంకా MSME నిర్వచనాల మార్పులు కూడా ఉన్నాయి )
డి )పైవన్నీ
జవాబు : డి
60) ప్రధాన మంత్రి ప్రకటించిన ఆత్మ నిర్భర్ భారత్
అభియాన్ ఆర్ధిక ప్రోత్సాహక ప్యాకేజ్ లో ఏ ముఖ్య అంశాల పై నిలబడి ఉంది ?
ఎ ) ఎకానమీ , ఇన్ఫ్రా స్ట్రక్చర్ (మౌలిక
సదుపాయాలు )
బి) చైతన్య వంతమైన జనాభా
సి) సిస్టం లు ; డిమాండ్
డి )పైవన్నీ (ఈ ప్యాకేజ్ కి ల్యాండ్,
లేబర్ , లిక్విడిటీ, ‘లా’ (చట్టం) అనే 4
స్తంభాలు అని కూడా తెలిపారు )
జవాబు : డి
61) ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ ప్యాకేజ్ లోని 4 వ
ట్రాoచ్ (విడత ) లో తెలిపిన అంశాలు ఏవి ?
ఎ ) అంతరిక్ష పరిశోధన రంగం లో కొన్ని అంశాలలో ప్రైవేటు సెక్టార్ కి అనుమతి
బి)అటామిక్ ఎనర్జీ లో మెడికల్ ఐసోటోప్ ల ఉత్పత్తి
కోసం PPP పద్ధతి లో రీసెర్చ్ రియాక్టర్ కి అనుమతి
సి)కమర్షియల్ మైనింగ్ లో రెవిన్యూ షేరింగ్ పధ్ధతి ప్రవేశ పెట్టటం ; డిఫెన్సు రంగం లో ఆటోమేటిక్
రూట్ లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 74%
వరకు పెంపుదల మొదలై నవి
డి ) పైవన్నీ
జవాబు : డి
62) ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ ప్యాకేజ్ లోని 5 వ
ట్రాoచ్ లో తెలిపిన అంశాలు ఏవి ?
ఎ )MGNREGA కింద
అదనంగా రు.40,000 కోట్ల కేటాయింపు (ఇది 2020-2021 బడ్జెట్ లో
తెల్పిన దానికన్నా అదనంగా 300 కోట్ల పర్సన్ రోజుల కి నిధులు సమకూర్చారు )
బి) నాన్ – స్ట్రాటజిక్ సెక్టార్ లో ఉన్న
ప్రభుత్వ రంగ సంస్థ లను ప్రైవేటీ కరిoచటం
సి)రాష్ట్రాలు తీసు కునే అప్పుల లిమిట్ ను రు.6.41 లక్షల
కోట్ల నుండి రు.10.69 లక్షల కోట్ల కి పెంచటo
డి )పైవన్నీ
జవాబు : డి
63 )ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ 3వ ట్రాన్
చ్(విడత )లో వ్యవసాయo తదితర రంగాలకు
సంబంధించి తెలిపిన ఆర్ధిక సహాయ పధకాలు ఏవి ?
ఎ )రు.ఒక లక్ష కోట్లు :- వ్యవసాయ కో పరేటివ్
సొసైటీ లకి , PPO, స్టార్ట్ అప్ లకి
బి)రు.10,000 కోట్లు
:- మైక్రో ఫుడ్ సంస్థ లకి , క్లస్టర్ ఆధారిత వ్యవసాయ పద్ధతులకోసం
సి)రు.20,000
కోట్లు ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన కింద మత్స్య కారులకి , రు.15,000
కోట్లు పశు పోషణ , రు.4,000
కోట్లు ఔషధ మొక్కల పెంపకం కోసం , రు.5,000 కోట్లు తేనెటీగ పెంపకం కోసం
డి )పైవన్నీ
జవాబు : డి
64) ఆత్మ
నిర్భర్ భారత్ అభియాన్ కోసం పలు ట్రాo చ్(విడత )ల లో ప్రకటించిన ఆర్ధిక సహాయ
పధకాల మొత్తం విలువ సుమారు
రు.20,97,053 కోట్లు కేటాయిం పులు గా ఉన్నట్లు అవగాహన అవుతోంది . దీని వివరాలు ఏవి ?
ఎ ) పార్ట్ 1ప్రకటన :-రు. 5,94,550 కోట్లు;
పార్ట్ 2 ప్రకటన :-రు. 3,10,000
కోట్లు ; పార్ట్ 3ప్రకటన :- రు.1,50,000
కోట్లు
బి) పార్ట్ 4 & 5 ప్రకటన లు : - రు. 48,100
కోట్లు & రు.1,92,800
కోట్లు (ఇంతకు ముందు ప్రకటించిన PMGKP తో కలుపుకుని )
సి) రు.8,01,603 విలువ
గల రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా లిక్విడిటీ
పెంపు మొదలైన చర్యలు
డి ) పైవన్నీ
జవాబు : డి
65)కుడం కులం న్యూక్లియర్ పవర్ రియాక్టర్ (తమిళనాడు )
లో ఎన్నిన్యూక్లియర్ రియాక్టర్ లు ఉంటాయి ,
(ఇప్పు డున్నవి + నిర్మాణం కోసం అనుమతించినవి కలుపుకుని) ?
ఎ ) రెండు
బి) నాలుగు
సి) ఆరు
డి ) ఇవేవి కావు
జవాబు : సి
66) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ (SBI లో ఉన్న
రకరకాల వడ్డీ రేట్ లు )?
ఎ ) MCLR : 7 % ( 10.6.2020 నుండి )
బి)EBR :
7.05 % ( 1.7.2020 నుండి )
సి)RLLR : 6.25 % ( 1.6.2020 నుండి )
డి ) పైవన్నీ
జవాబు : డి
67) ఏ దేశం Covid-19 ఫ్రీ దేశం గా ప్రకటించు కున్నది
, ఇటీవల ?
ఎ )న్యూ జిలాండ్
బి) USA
సి) UK
డి )స్పెయిన్
జవాబు : ఎ
68)ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ )సోహ్రాయ్ ఖో వార్ పెయింటింగ్ : జార్ఖండ్ రాష్ట్రము
బి)తేలియా రుమాల్ : పుట్టపాక , తెలంగాణా రాష్ట్రము
సి) కాంచీపురం సిల్క్ చీర : తమిళనాడు రాష్ట్రము
డి )పైవన్నీ
జవాబు : డి
69) ఢాకా గ్లే షియర్ ఎక్కడుంది ?
ఎ ) హిమాచల్ ప్రదేశ్
బి)అరుణాచల్ ప్రదేశ్
సి) నాగాలాండ్
డి ) అస్సాం
జవాబు : ఎ
70) సూపర్ సైక్లోన్ ‘ఆంఫన్’ వివరాలు ఏవి ?
ఎ ) ఇది బంగాళా ఖాతం లో ఏర్పడింది
బి) ఒడిష , పశ్చిమ బెంగాల్ లో ఎక్కువ నష్టం
కల్పించింది .
సి)సాగర్ దీవి వద్ద తుఫాన్ ల్యాండ్ ఫాల్ అయ్యింది
. గాలులు 150 నుండి 160 KMPH వేగం తో, కొన్ని సార్లు అంతకన్నా ఎక్కువ వేగం తో వీచాయి
.
డి )పైవన్నీ
జవాబు : డి
No comments:
Post a Comment