Tuesday, 16 June 2020

Vignana Vipanchi : Month : June 2020


విజ్ఞాన విపంచి
జూన్  2020


1)మనిషి చర్మపు చెమట (స్వెట్) (స్వేదం )లో ఏమి ఉంటాయి ?
ఎ )99% నీరు
బి)సోడియం , పొటాషియం , కాల్షియమ్ , మెగ్నీషియం , క్లోరైడ్ అయాన్లు , అమ్మోనియం అయాన్లు , యూరియా , లాక్టిక్ ఆమ్లం , గ్లూకోజ్
సి)డేస్మిసిడిన్
డి )పైవన్నీ
జవాబు :   డి
2)’లిఛి ‘ పండు ఎక్కడ విస్తారం గా పండిస్తారు ?
ఎ )ముజఫర్ పూర్ జిల్లా, బీహార్
బి)ఔరంగాబాద్
సి)బీదర్
డి )కొడగు
జవాబు :   

3 )కుంకుమ పువ్వు పంటలో ఇరాన్ దేశం ప్రధమ స్థానం లో ఉంది . దాని దరిదాపుస్థానం లో కుంకుమ పువ్వు పంటలో  భారత దేశం ఉంది. కాశ్మీర్ కుంకుమ పువ్వుకి G.I.( జియోగ్రఫికాల్ ఐడెంటిఫికేషన్ ) ట్యాగ్ లభించింది . వివరాలు ఏవి ?
ఎ ) జమ్మూ & కాశ్మీర్ లోని కరేవా (హై లాండ్స్ 1600 M నుండి 1800 M  సగటు సముద్ర మట్టానికి ఎత్తు లో ) భూముల్లో దీన్ని పెంచుతారు .
బి) కుంకుమ పువ్వు లో క్రోసిన్ , శాఫ్రానల్ , పిక్రో క్రోసిన్  ఉంటాయి .
సి)ల చ్చా శాఫ్రాన్ , మో o గ్రా శాఫ్రాన్, గుచ్చా శాఫ్రాన్  అనే రకాలు గా కుంకుమ పువ్వు దొరుకుతుంది 
డి )పైవన్నీ
జవాబు :   డి
4)కోవిడ్ – 19(Covid-19) ని కట్టడి చేయటానికి భారత దేశం లోని జిల్లాలను ఎన్ని జోన్ లు గా వర్గీ కరించారు ?
ఎ )రెడ్ జోన్
బి)ఆరంజ్ జోన్
సి)గ్రీన్ జోన్
డి )పైవన్నీ
జవాబు :   డి
5) మే 3,2020 నాటికి, కోవిడ్ – 19(Covid-19) నియంత్రణ కు  భారత దేశం లో ఉన్న  పరిస్థితి గురించి ,   ఈ కింది వాటిల్లో ఏవి కరెక్ట్ ?
ఎ )రెడ్ జోన్ జిల్లాలు : 130 జిల్లాలు
బి)ఆరంజ్ జోన్ జిల్లాలు : 284 జిల్లాలు
సి)గ్రీన్ జోన్ జిల్లాలు : 319 జిల్లాలు
డి ) పైవన్నీ
జవాబు :   డి
6) కో విడ్ – 19(Covid-19) కి  సంబంధిoచిన వ్యాధి  లక్షణాలున్న వ్యక్తులను    ట్రాక్ చేయటానికి దేన్ని   వాడుతున్నారు ?
ఎ ) రాడార్ లు
బి)మొబైల్ ఫోన్ లలో డౌన్ లోడ్ చేసుకోగల  ’ఆరోగ్య సేతు ఆప్’
సి) ఉపగ్రహాలు  
డి ) UPI
జవాబు :   బి
7)SARS,MERS, SARS-CoV-2 ల పై చక్కగా పనిచేయగలదని శాస్త్ర వేత్తలు ఆశిస్తున్న NHC ఔషధం  పూర్తి పేరు ఏది ?
ఎ )హైడ్రాక్సీ క్లోరో క్విన్ (HCQ)
బి)బీటా –D-N4-హైడ్రాక్సీ సైటి డైన్ ( గతం లో ఇది ఇన్ ఫ్లూయెంజా & ఎబోలా ల నివారణ లో పని చేసింది )
సి)అజి త్రో మై సిన్
డి )జింక్
జవాబు :బి    
8)ఇటీవల చాల మంది గోల్డ్ బ్యాక్ డ్ ఎక్స్ చేంజ్ ట్రేడెడ్  ఫండ్స్ (ETF) లలో బాగా విలువ గల పెట్టుబడులు పెట్టారు . వరల్డ్  గోల్డ్ కౌన్సిల్ ప్రకారం 2020 మొదటి మూడు నెలల్లో ప్రపంచం లో  బంగారానికున్న డిమాండ్ ఎంత ? ( టన్ను లలో )  
ఎ )298
బి)3185
సి)సుమారు 1083.8
డి )325.8
జవాబు : సి   
9) ‘గార్మెంట్స్ & మేడ్ - అప్’ ఎగుమతి దారులకు ROSL స్కీం కింద ఎరియర్స్ ఎవరెవరికి లభించ నున్నాయి.  ROSL లో R అనే అక్షరం దేన్నీ సూచిస్తుంది ?
ఎ ) రేట్
బి) రిబేట్  (ROSL :రిబేట్ అఫ్ స్టేట్ లెవీస్)
సి) రిక్రూట్
డి )రిచ్
జవాబు :   బి
10) లాక్ డౌన్ వల్ల నిలిచి పోయిన వలస కార్మికుల కోసం వేసిన  స్పెషల్ రైళ్ళ పేరేమి  ?
ఎ ) శ్రామిక్ స్పెషల్ రైళ్ళు
బి)దురంతో ఎక్స్ ప్రెస్
సి)రాజధాని ఎక్స్ ప్రెస్
డి )గ్రాండ్ ట్రంక్ ఎక్స్ ప్రెస్
జవాబు :   
11) మొదటి శ్రామిక్ స్పెషల్ రైలు ఎక్కడ నుండి నడిపించారు ?
ఎ ) నాసిక్ నుండి లక్నో
బి)లింగం పల్లి (తెలంగాణా ) నుండి హాటియా ( జార్ఖండ్ ) వరకు
సి)అలువా నుండి భుబనేశ్వర్
డి )జైపూర్ నుండి పాట్నా
జవాబు :   బి
12) ఛాక్ – హావో అనే నల్ల రంగు లో ఉన్న , సువాసన గల  వరి ధాన్యం ఏ రాష్ట్రము లో పండిస్తారు ?
ఎ ) కర్ణాటక
బి) తమిళనాడు
సి)మణిపూర్
డి )మధ్య ప్రదేశ్
జవాబు :   సి
13 )గోరఖ్ పూర్ (UP) టెర్రకోట (మట్టి తో చేసినవి ) ఆకృతులకు G.I. గుర్తింపు లభించింది . ఇక్కడి వారు మట్టి తో ఏ బొమ్మలు తయారు చేస్తారు ?
ఎ )గుర్రాలు , ఏనుగులు
బి)ఎద్దులు
సి)ఒంటెలు
డి )పైవన్నీ
జవాబు :   డి
14) సెంట్రల్ విస్టా కమిటీ , కొత్త పార్లమెంట్ ప్రాజెక్ట్ కి (ప్లాట్ నెంబర్ : 118, న్యూ ఢిల్లీ లో కట్టటానికి )  అనుమతి ఇచ్చింది. దీని చైర్మన్ ఎవరు ?
ఎ ) అనంత కుమార్ ,అడిషనల్  డైరెక్టర్ – జనరల్ (వర్క్స్ ), CPWD
బి)బిమల్ పటేల్
సి)బల్ బీర్ వర్మ
డి )అశ్వని మిట్టల్
జవాబు :   
15)CSIR-NEERI, నాగపూర్ అధ్యయనం ప్రకారం రుద్ర ప్రయాగ్ ఎగువ  భాగాన ప్రవహించే గంగా నది నీటిలో లో ఉండే బా క్టీరియో ఫేజ్ లు వేటిని నాశనం చేస్తాయి ?
ఎ )తెల్ల రక్త కణాలు
బి) మైకో బా క్టీ రియం స్ట్రెప్టోకాకస్ & సూడో మోనాస్  యెర్సీనియా 
సి) మీజిల్స్ వైరస్
డి ) పోలియో వైరస్
జవాబు :   బి
16)1962 ఏషియన్ గేమ్స్ , జకార్తా లో బంగారు పతకం సాధించిన సుబిమల్ ‘ఛుని ‘ గోస్వామి దేనిలో ప్రఖ్యాత క్రీడా కారుడు ?
ఎ ) చదరంగం
బి)ఫుట్ బాల్
సి) ఖో ఖో
డి ) కబాడీ
జవాబు :   బి
17) UN లో భారత దేశ శాశ్వత ప్రతినిధి గా ఇటీవల కొత్త గా ఎవర్ని నియమించారు ?
ఎ ) సయ్యద్ అక్బరుద్దీన్
బి)T.S తిరుమూర్తి
సి)నిరుపమా రావు
డి ) విజయ్ గోఖలే
జవాబు :   బి
18)నేషనల్ ఇన్ స్టిట్యూట్ అఫ్ బయో మెడికల్ జెనో మిక్స్ (NIBMG), కళ్యాణి , పశ్చిమ బెంగాల్ శాస్త్ర వేత్తల అధ్యయనం ప్రకారం నావెల్ కోరోనా వైరస్ , 10 టైపు లలో మ్యుటేషన్ చెందిoది. ఈ కింది వాటి ల్లో ఏ రకం ప్రమాద కరమైనది ? 
ఎ ) O
బి) A2a
సి)B1
డి )ఇవేవి కావు
జవాబు :   బి
19) ఇటీవల వార్తలలో ఉన్న  ‘వోన్ సాన్ ‘ నగరం  ఏ దేశం లో ఉంది ?
ఎ ) ఆస్ట్రేలియా
బి)ఉత్తర కొరియా
సి) తైవాన్
డి ) మంగోలియా
జవాబు :   బి
20) మెకాంగ్ నది చైనా పుట్టి , ఏ ఏ  దేశాలగుండా  ప్రవహిస్తుంది ?
ఎ ) మయన్మార్
బి) లావోస్
సి)థాయిలాండ్ , కంబోడియా , వియత్నాం
డి ) పైవన్నీ
జవాబు :    డి

21)వూ హాన్ ఇన్ స్టి ట్యూట్ అఫ్ వైరాలజీ ఎక్కడుంది ?
ఎ )రష్యా
బి)ఆఫ్ఘనిస్తాన్
సి) చైనా
డి )కజాక్ స్తాన్
జవాబు : సి    
22) ‘లాప్ నూర్(Lop Nur) టెస్ట్’ ప్రదేశo ఎక్కడుంది ?
ఎ )చైనా
బి) మెక్సికో
సి) బ్రెజిల్
డి ) ఇజ్రాయిల్
జవాబు :ఎ    
23 )కాం ప్రెహెన్ సివ్ న్యూక్లియర్ టెస్ట్ బాన్ ట్రియటీ ఆర్గానైజేషన్ (CTBTO) ఎన్ని రకాల మానిటరింగ్ పద్ధతుల ద్వారా పరమాణు పరీక్ష లు గురించి తెల్సు కుంటుంది ?
ఎ )సీస్మిక్ (భూకంపాలు )
బి)రేడియో న్యూక్లై డ్
సి ) ఇన్ ఫ్రా సౌండ్ మరియు హైడ్రో ఎకో స్టిక్ (నీళ్ళ లోపల )
డి )పై వన్ని
జవాబు :   డి
24) CERT-IN (ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం ) ఏ మంత్రి త్వ శాఖ కింద ఉంది ?
ఎ )భారీ పరిశ్రమలు
బి)ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
సి)రైల్వే
డి )పౌర విమానయాన శాఖ
జవాబు :   బి
25)బ్రహ్మపుత్ర నది మీద , చైనా లో ఎక్కడెక్కడ డ్యాం లు నిర్మించ దలిచారు ?
ఎ ) జాంగ్ మూ హైడ్రో పవర్ స్టేషన్ , గ్యా భా కౌంటీ , లోకా , టిబెట్
బి)డాగు
సి) జి గ్సూ , జియా ఛా
డి )పైవన్నీ
జవాబు :   డి
26) నది నీటి లో కాలుష్య స్థాయి తెల్సుకునేం దుకు వేటిని వాడతారు ?
ఎ ) DO : డిజాల్వ్ డ్ ఆక్సిజన్
బి)BOD : బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్
సి)COD : కెమికల్ ఆక్సిజన్ డిమాండ్
డి ) పై మూడు
జవాబు :    డి
27) మ్యూ చ్యు వల్ ఫండ్స్ సంస్థ లను ఆదుకోటానికి RBI ఎంత విలువ గల లిక్విడిటీ స్పెషల్ విండో తెరిచింది( ఏప్రిల్ , 2020 లో  ? ( రు. కోట్ల లో )  
ఎ )10,000
బి)50,000
సి)5,000
డి )25,000
జవాబు :   బి
28)పార్సెల్ దీవులు ఏ సముద్రం లో ఉన్నాయి ?
ఎ )ఎర్ర సముద్రం
బి)సౌత్ చైనా సముద్రం
సి)నల్ల సముద్రం
డి )అట్లాంటిక్ మహాసముద్రం
జవాబు :   బి
29) ‘నాటునా’ సముద్రం ఏ దేశం దగ్గర ఉంది ? (ఈ సముద్రం లో 272 దీవులున్నాయి )
ఎ )ఈజిప్ట్
బి) ఇండోనేషియా
సి) సిరియా
డి ) జోర్డాన్
జవాబు :   బి
30) వెస్ట్ ఫిలిప్పైన్ సముద్రం  లో  ఉన్న రీఫ్ లు  ఏవి ?
ఎ ) కాగి టింగన్ రీఫ్ & జమోరా రీఫ్
బి)లక్ష ద్వీప్
సి)ఆడమ్స్ బ్రిడ్జి
డి )ముళ్ళయ్ దీవులు
జవాబు :   

31) నీలాచల్ హిల్స్ లో ఉండే కామాఖ్యా ఆలయం ఎక్కడుంది ?
ఎ )సిమ్ల
బి) గువహాటి , అస్సాం
సి)శ్రీనగర్
డి )చండీఘర్
జవాబు :   బి
32)  డెహింగ్ పాట్ కాయ్ ఎలి ఫెంట్ రిజర్వు లో ఉన్న ‘సాలేకి ‘ ప్రాంతం లో ఎలాంటి భూగర్భ నిక్షేపాలు ఉన్నాయి ?
ఎ ) బొగ్గు గనులు
బి)మైకా గనులు
సి)జింక్
డి )కాపర్
జవాబు :   
33 ) అంచనాల ప్రకారం 2019-2020 లో భారత దేశం లో ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎంత ? (మిలియన్ టన్నులలో )
ఎ )117.5
బి) 291.95
సి) 298.3
డి ) 106.21
జవాబు :   సి
34)చేపలు , రొయ్యలు  మొదలైన వి అమ్మే ‘బై షా జౌ ‘ మార్కెట్ ఏ దేశం లో ఉంది ?  
ఎ )మొజాంబిక్ 
బి)చైనా
సి ) పెరూ
డి )క్యూబా
జవాబు : బి    
35) SNPP (సౌ మీ నేషనల్ పోలార్  ఆ ర్బిటింగ్  పార్టనర్ షిప్ ) – VIIRS (విజిబుల్ ఇన్ ఫ్రా రెడ్ ఇమేజింగ్ రేడియో మీటర్ స్యూట్ )  సెన్సార్ ఆధారంగా ఏప్రిల్ , 20 20 మొదటి వారం లో ఏ రాష్ట్రము లో ఎక్కువ చోట్ల అడవుల్లో మంటలు చెలరేగాయి ?
ఎ ) ఒడిష
బి) మహారాష్ట్ర
సి) మధ్య ప్రదేశ్
డి ) ఛత్తీస్ ఘర్
జవాబు :   
36) బీహార్ రాష్ట్రము ఇండియన్ పీనల్ కోడ్ లోని ఏ సెక్షన్ ప్రకారం పబ్లిక్ స్థలాలో ఉమ్మి వేయటం నేరం గా పరిగణిం చింది ? (ఉమ్మి ద్వారా కో విడ్-19, ఎన్ సెఫాలిటిస్, క్షయ , స్వైన్ ఫ్లూ , ఇతర వైరస్ వ్యాధులు వస్తాయి గనుక )
ఎ )సెక్షన్ 268 , మరియు సెక్షన్ 269
బి) సెక్షన్ 420
సి)సెక్షన్ 144
డి )సెక్షన్ 120
జవాబు :   
37) ‘సహ యోగ్’ ఎవరు రూపొందించిన మొబైల్ ఆప్ ?
ఎ )NSSO
బి)సర్వే అఫ్ ఇండియా
సి)CSO
డి )CSIR
జవాబు :   బి
38) కాజి రంగా నేషనల్ పార్క్ లో జీవించే ఖడ్గ మృగాలున్న ‘బిశ్వనాథ్ జిల్లా ‘ ఏ రాష్ట్రము లో ఉంది ?  
ఎ )అరుణాచల్ ప్రదేశ్
బి)నాగాలాండ్
సి) అస్సాం
డి )సిక్కిం
జవాబు :   సి
39)భారత వరావరణ శాఖ వర్ష పాతం గురించి తెలిపే వివరాలు ఏవి ?
ఎ )ఏప్రిల్ లో ఒక సారి , మే చివరి వరం లో ఒక సారి , వర్ష పాతం గురించి ముందస్తు అంచనాలు ప్రకటిస్తుంది
బి)అంచనాల కోసం , డైనమిక్ మోడల్ (లేక ) మాన్సూన్ మిషన్ కపుల్డ్ ఫోర్ కాస్టింగ్ సిస్టం మీద ఆధార పడుతుంది
సి) ఇందుకోసం సూపర్ కంప్యూటర్స్ , సముద్రములు  మరియు వాతావరణం ను గణిత శాస్త్రం సాయం తో సిమ్యులేట్ చేసే పద్ధతులు వాడతారు
డి ) పై వన్ని
జవాబు :   డి
40)క్రీస్తు శకం 6 వ శతాబ్దం లో వచ్చిన జస్టినియన్ ప్లేగు వ్యాధి వివరాలు ఏవి ?  
ఎ )ఈస్ట్ రోమన్ (బైజాంటైన్) ఎంపైర్(సామ్రాజ్యం ) లో వచ్చింది
బి) ఇది కాన్ స్టాoటి  నోపుల్ కి పశ్చిమo వైపు మరియు తూర్పు వైపు వచ్చి సుమారు 25 నుండి 100 మిలియన్ మంది మరణించారు  
సి) బై జాంటైన్ ఎంపైర్ ను జస్టినియన్ అనే రాజు పాలిస్తుం డే వాడు. అందుకే ఆయన పేరు పెట్టారు .
డి )పైవన్నీ
జవాబు :   డి

41) సార్స్ – కోవ్ – 2 వచ్చిన తర్వాత దేశ వ్యాప్తం గా  దక్షిణ కొరియా లో ఎన్నికలు జరిపారు . మూన్ – జే – ఇన్ కి చెందిన డెమోక్రాటిక్ పార్టీ గెలిచింది . దక్షిణ కొరియా పార్లమెంట్ ( సింగల్ ఛాంబర్ ) లో మొత్తం ఎన్ని సీట్లు ఉన్నాయి ?
ఎ )177
బి)131
సి)300
డి )163
జవాబు : సి    
42)ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ )’బ్లాక్ డెత్’ (లేక ) ‘పెస్టి లెన్స్’  అనే వ్యాధి : 14 వ శతాబ్దం లో యూరోప్ & ఆసియా లో వచ్చింది
బి) ‘ది గ్రేట్ లెవెల్లర్ ‘ పుస్తక  రచయిత : వాల్టర్ షీ డెల్
సి) స్పానిష్ ఫ్లూ : సుమారు  1917-1918 (మొదటి ప్రపంచ యుద్ధo చివరి సంవత్సరాలలో వచ్చింది )
డి ) పైవన్నీ
జవాబు :    డి
43 )iGOT వివరాలు ఏవి ?
ఎ )ఇంటిగ్రేటెడ్ గవర్నమెంట్ ఆన్ లైన్ ట్రైనింగ్ కోర్స్ లు , దీక్షా ప్లాట్ ఫారం మీద లభ్యమవుతున్నాయి
బి)దీన్ని లాప్ టాప్ / డెస్క్ టాప్ కంప్యూటర్ లకు , మొబైల్ ఫోన్ ల లోను వాడుకోవచ్చును
సి) ఫ్రంట్ లైన్ వర్కర్స్ కు ఇన్ ఫె క్షన్ సోకకుండా ఉండేందుకు శిక్షణ ఇస్తారు , దీని ద్వారా
డి ) పైవన్నీ
జవాబు :   డి
44) భారత దేశం తో  , భూ సరి హద్దులు ఉన్న దేశాలనుండి విదేశీ ప్రత్యక్ష పెట్టు బదులను పొందే కంపెనీ లు ముందస్తు అనుమతి తీసుకోవాలని ప్రకటన వచ్చింది . భారత దేశం తో దేనికి భూ సరిహద్దులు ఉన్నాయి ?
ఎ ) మయన్మార్
బి) చైనా
సి) భూటాన్
డి )పైవన్నీ
జవాబు :   డి
45) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ ) కిన్నర  కం ఠ  గీత్ : ఢిల్లీ     
బి)పటోలా సిల్క్ : గుజరాత్
సి) ఛామా ద్యాచ బహుళ్ళ : మహారాష్ట్ర
డి ) పైవన్నీ (కల్చరల్ హెరిటేజ్ గా ఖ్యాతి పొందాయి  )
జవాబు :   డి
46)జర్మాట్ లో ఉన్న మాటర్ హార్న్ పర్వతాలు ఏ దేశం లో ఉన్నాయి ?
ఎ )ఆస్ట్రేలియా
బి)స్విట్జర్లాండ్
సి)న్యూజిలాండ్
డి )అర్జంటినా
జవాబు :   బి
47) Covid-19 (కోవిడ్ – 19) ట్రీట్మెంట్ కోసం తెల్పుతున్న ‘కన్వల్సెంట్ ప్లాస్మా ‘ అంటే ఏమిటి ? వివరాలు ఏవి ?  
ఎ )కోవిడ్ – 19 వ్యాధి నుండి కోలుకున్న వ్యక్తుల రక్తం లోని ప్లాస్మా ను , వ్యాధి గ్రస్తుల ట్రీట్మెంట్ కోసం  వాడటం
బి)దీనిలో యాంటి బాడీ లు ఉంటాయి
సి)ఒక వ్యక్తి నుండి సుమారు 800 ml రక్తం తీసుకుంటారు. ఇందులో మరే ఇతర వ్యాధులు లేకుండా ఉండేదుకు పరీక్ష లు నిర్వహిస్తారు . ప్లాస్మా వేరు చేస్తారు. కో విడ్-19 చేత బాధ పడుతున్న వ్యక్తి రక్తం లోకి ఎక్కిస్తారు. తద్వారా కోవిడ్-19 రోగి కోలుకుంటాడు .
డి )పైవన్నీ (ఇందుకోసం ICMR సూచనలు ఉన్నాయి  )
జవాబు :   డి
48)1948 లో స్థాపించిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజే షన్ కి ఆర్ధిక వనరులు ఎలా సమకూరుతాయి ? 2020 – 2021 ( రెండు సంవత్సరాలకి ) ఎంత ఆర్ధిక వనరులు కావాలి ? 
ఎ ) ‘అస్సెస్స్ మెంట్స్ ‘ (లేక) సభ్యుల బకాయిల రూపం లోనూ; మరియు వాలెంటరి కాంట్రిబ్యూషన్స్ గాను  లభిస్తాయి
బి) 2020 – 2021 కి : అస్సెస్స్ మెంట్స్ ‘ లేక సభ్యుల బకాయిల రూపం లో వచ్చేవి : $957 మిలియన్ లు
సి) 2020 – 2021 కి: వాలెంటరి కాంట్రిబ్యూషన్స్ రూపం లో వచ్చేవి : $ 4.9 బిలియన్ లు
డి ) పైవన్నీ
జవాబు :   డి
49)13058 అడుగుల ఎత్తులో ఉన్న రో హ్ తాంగ్ పాస్ ఏ పర్వత శ్రేణిలో ఉంది ?
ఎ )మిజో హిల్స్
బి)తూర్పు పీర్ పంజాల్ హిమాలయాలు
సి)హిందూ ఖుష్
డి )పూర్వాంచల్
జవాబు :   బి
50) ‘వన్ హెల్త్ ‘ అనే ముఖ్య పధ్ధతి ద్వారా వేటిని నియంత్రించ వచ్చును ?
ఎ )జంతువుల ద్వారా వ్యాపించే వ్యాధులు
బి)యాంటి మైక్రో బియల్ రెసిస్టెన్స్
సి)ఆహారభద్రత లోపాలు
డి )పైవన్నీ
జవాబు :   డి

51) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ? (వ్యాధి : దేన్నించి సంక్రమిస్తుంది )
ఎ )ఏవియన్ ఇన్ ఫ్లూయెంజా : పక్షుల నుండి
బి)MERS : ఒంటెల ద్వారా
సి)నిఫా  : గబ్బిలాలు ద్వారా
డి ) పైవన్నీ
జవాబు :   డి
52)ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ 1897 ని సవరించటానికి జారీ చేసిన ఆర్డినెన్సు ద్వారా వైద్యుల పై దాడి చేసిన వారి పై ఏఏ చర్యలు తీసుకోవచ్చును ?
ఎ ) విచారణ 30 రోజులలో పూర్తి చేయాలి
బి)మాములు గాయాలు చేసిన వారికి  3 నెలల నుండి 5 ఏళ్ల వరకు జైలు శిక్ష  మరియు రు.50,000 నుండి రు.2లక్ష ల వరకు జరిమానా
సి) తీవ్ర గాయాలు చేసిన వారికి  6 నెలల నుండి 7 ఏళ్ల వరకు జైలు శిక్ష  మరియు రు.ఒక లక్ష  నుండి రు.5లక్ష ల వరకు జరిమానా

డి )పైవన్నీ
జవాబు :   డి
53 )గంగా నది మీద మహాత్మా గాంధీ సేతు ( బ్రిడ్జి)  ఎక్కడ నిర్మిస్తున్నారు ?
ఎ )హరిద్వార్
బి)పాట్నా
సి) వారణాసి
డి )అలహాబాద్
జవాబు :  బి  
54) ‘మార్కాజి ‘ ఎడారి (దస్త్ –ఎ –కవిర్ ) ఏ దేశం లో ఉంది ?
ఎ ) ఉజ్బెకిస్తాన్
బి)తుర్కమేనిస్తాన్
సి)ఇరాన్
డి ) కిర్గిస్తాన్
జవాబు : సి   
55) అభిశంసన  (ఇం పీచ్ మెంట్ ) ద్వారా  భారత సుప్రీమ్ కోర్ట్ న్యాయ మూర్తులను మరియు రాష్ట్ర హై కోర్ట్ జడ్జ్ లను ఏ విధంగా మాత్రమే పదవి నుండి తొలగించాలి అని భారత రాజ్యాంగం లో ని ఏ ఆర్టికల్ లో తెలిపారు   ?
ఎ ) ఆర్టికల్ 356
బి) ఆర్టికల్ 124(4) మరియు 217(1)(b)
సి) ఆర్టికల్ 2
డి ) ఆర్టికల్ 52
జవాబు :   బి
56)భారత రాజ్యాంగం లోని ఆర్టికల్ 80(3) ప్రకారం భారత రాష్ట్రపతి ఏ రంగం లో నిష్ణాతులైన వారిని రాజ్య సభ సభులు గా నామినేట్ చేయవచ్చును ?
ఎ ) లిటరేచర్
బి) సైన్సు
సి) ఆర్ట్ & సోషల్ సర్వీస్
డి ) పైవన్నీ
జవాబు :   డి
57) థెoగై థి ట్టు  ఫిషింగ్ హార్బర్ ఎక్కడుంది ?  
ఎ )గుజరాత్
బి)పుదుచ్చేరి
సి)కేరళ
డి )మహారాష్ట్ర
జవాబు :   బి
58) దేన్ని కోవిడ్ – 19 రహిత (ఫ్రీ )(జీరో ) రాష్ట్రము గా ప్రకటించారు ( 20.4.2020నాడు ) ?  
ఎ )గోవా
బి)కేరళ
సి)తమిళనాడు
డి )కర్ణాటక
జవాబు :ఎ    
59) రుషికుల్య నది , ఏ రాష్ట్రము లో ప్రవహిస్తోంది ?
ఎ ) ఒడిష  
బి)పశ్చిమ బెంగాల్  
సి)బీహార్
డి ) ఉత్తర ప్రదేశ్
జవాబు :   
60) కాళీ జై దీవి ఎక్కడ ఉంది ?
ఎ ) సంభార్ సరస్సు
బి) చిలకా సరస్సు , ఒడిష
సి)దాల్ సరస్సు
డి )లోక్ తక్ లేక్
జవాబు :   బి

61) ఇండియన్ ఓషన్ కమిషన్ (IOC) లో భారత దేశాన్ని ‘అబ్జర్వర్’ హోదా లో తీసుకున్నారు . ఇండియన్ ఓషన్ కమిషన్ ను ఏ దేశాలు 1982 లో స్థాపించాయి ?
ఎ ) కామరోస్; మడగాస్కర్
బి)మారిషస్
సి) రీ యూనియన్ & సి షెల్స్
డి ) పైవన్నీ
జవాబు :   డి
62) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ )SAGAR : సెక్యూరిటీ & గ్రోత్ ఫర్ అల్ ఇన్ ది రీజియన్ (ఇండియన్ ఓషన్ )
బి)MASE : మారి టైం సెక్యూరిటీ ఇన్ ఈస్టర్న్ & సదరన్ ఆఫ్రికా & ఇండియన్ ఓషన్
సి)RMIFC : రీజినల్ మారి టైం ఇన్ఫర్మేషన్ ఫ్యూజన్ సెంటర్
డి ) పైవన్నీ
జవాబు :   డి
63 ) ‘గోoడి’ మరియు ‘హల్బీ ‘ భాషలు ఎక్కడి వారి మాతృ భాషలు ? 
ఎ )అస్సాం
బి)బస్తర్ , ఛత్తీస్ ఘర్
సి)నాగాలాండ్
డి )మిజోరాం
జవాబు :   బి
64)  ‘మాహే’ జిల్లా ఏ కేంద్ర పాలిత  ప్రాంత  పరిపాలన  లో ఉంది ?
ఎ )పుదుచ్చేరి
బి)లక్ష ద్వీప్
సి) జమ్మూ & కాశ్మీర్
డి ) లడక్
జవాబు :   
65) పుదుచ్చేరి లోని అరవింద ఆశ్రమం లో  ది మదర్  అని పిలవబడే  మాతృ మూర్తి అసలు పేరు ఏమి ? 
ఎ )మిర్రా అల్ఫస్సా  
బి)మార్గరెట్ ఎలిజబెత్ నోబెల్
సి)ఆగ్నస్ G.B.
డి )కుసుమ్
జవాబు :   
66)అరుణాచల్ ప్రదేశ్ లో వెస్ట్ కాం పెన్ జిల్లా లో నివసించే కమ్యూనిటీ ఏది ?
ఎ )షెర్ డుక్ పెన్ కమ్యూనిటీ
బి)గోండు లు
సి)భిల్లులు
డి )గూర్ఖా
జవాబు :   

67)మౌంట్ వెసువియస్ ఎక్కడ ఉంది ?
ఎ ) రష్యా
బి ) ఇంగ్లాండ్
సి) ఇటలి
డి )ఉగాండా
జవాబు :   సి
68)కైలాస మానస సరోవర్ యాత్రా మార్గం లో భాగమైన ‘లి పు లెఖ్ పాస్ ‘ ఎక్కడుంది ?
ఎ ) జమ్మూ & కాశ్మీర్
బి) కాలాపానీ మరియు సుస్తా
సి) లడక్
డి ) పంజాబ్
జవాబు :   బి
69)వార్తల్లో ఉన్న కోయం బేడు హోల్ సేల్ మార్కెట్ ఎక్కడుంది ?
ఎ )బెంగలూరు
బి)చెన్నై
సి) ఎర్నాకుళం
డి )ఇండోర్
జవాబు :బి    
70) G.I. గుర్తింపు ఉన్న , చెక్క తో చేసిన,   ‘చన్న పట్న’  ఆట బొమ్మలు ఎక్కడ తయారౌతాయి ?
ఎ ) కొండపల్లి
బి) రామ్ నగర జిల్లా , కర్ణాటక
సి)శ్రీకాకుళం
డి )విజయనగరం
జవాబు :    బి


No comments:

Post a Comment