తెలంగాణాలో
సామజిక , సాంస్కృతిక , రాజకీయ చైతన్యం (FOR TSPSC )
ప్రాతూరి
పోతయ్య శర్మ
1)హైదరాబాద్ సంస్థానం లో ఉన్న మూడు భౌగోళిక
ప్రాంతలేవి ?
a) తెలంగాణా b)మరాఠ్వాడ c) కర్ణాటక
జవాబు : పై మూడు
2) గతం లో ఎవరి అధీనం స్వాధీనం లో వేల ఎకరాల భూము
లుండేవి ?
జవాబులు : జగిర్దారులు ,జమిందారులు, సంస్థానాధి
పతులు , దేశ్ ముఖ్ లు, దేశ్ పాండే లు
3) 19 వ శతాబ్దం రెండవ భాగం లో హైదరాబాద్ వచ్చిన
సాహితీ వేత్తలు ఎవరు ?
జవాబు : మీర్జా ఖాన్ ధాఘ్ , హఫీజ్ జలీల్ హసన్
జలీల్ , మౌన్షి అమీర్ , అహ్మద్ మి నై
4) ఏ ప్రముఖ ఉర్దూ కవి హైదరాబాద్ కు వలస వచ్చారు ?
జవాబు : అమీర్ రాంపూర్
5) ఉర్దూ భోధన భాషగా ప్రారంభమైన విశ్వ విద్యాలయం ఏది
?
జవాబు : ఉస్మానియా విశ్వవిద్యాలయం
6) ఉర్దూ భాషాభి వృద్ది కోసం మౌల్వి అబ్దుల్ హక్
దేన్నీ ప్రారం భించారు ?
జవాబు : అంజుమన్ తారక్ – ఇ – ఉర్దూ
7) తెలంగాణా లో ఒద్దిరాజు సోదరులు గా పేరొందిన సీతారాం
చందర్ రావు , రాఘవ రంగా రావు లు 1920 లో దేన్నీ ప్రారంభిం చారు ? ఇది వరంగల్
జిల్లా లోని ఇనుగుర్తి గ్రామం నుండి వెలువడేది .
జవాబు: ‘తెలుగు ‘ వార పత్రిక
8) నల్గొండ నుండి ‘నీల గిరి ‘ వార పత్రిక ఎవరి
సంపాదకత్వం లో వెలువడేది ?
జవాబు : షబ్నవీసు రామ నర్సింహా రావు
9) ఎవరి సంపాదకత్వం లో డెక్కన్ క్రానికల్ అనే
ఇంగ్లీష్ పత్రిక వెలువడింది ?
జవాబు : బుక్క పట్నం రామాచార్యులు
10) సురవరం ప్రతాప రెడ్డి రాసిన ముఖ్య గ్రంధం ఏది ?
జవాబు : ఆంధ్రుల సాంఘిక చరిత్ర .
చంపకి భ్రమర విషాదం , ప్రేమార్పణం , హిందువుల
పండుగలు , హైందవ ధర్మ వీరులు , రామాయణ విశేషములు ఆయన రాసిన ఇతర గ్రంధాలు .
11
)1925 గోల్కొండ పక్ష పత్రిక స్థాపించి , సంపాద
కత్వం నిర్వహించింది ఎవరు ?
జవాబు : సురవరం ప్రతాప రెడ్డి
12) బూర్గుల రామకృష్ణ రావు రాసిన పుస్తకాలేవీ ?
జవాబు : పండిత రాజ పంచామృతం , కృష్ణ శతకం
13)ఎవరిని అభినవ పోతన అంటారు ?
జవాబు : వానమామలై వరదాచార్యులు
14)వానమామలై వరదాచార్యులు రాసిన పుస్తకాలేవీ ?
జవాబు : పోతన చరిత్ర , విప్ర లబ్ధ
15)మాడపాటి హన్మంత రావు రాసిన గ్రంధం ఏది ?
జవాబు : తెలంగాణా లో ఆంధ్రోద్యమం
16)1946 నుండి 1951 వరకు జరిగిన తెలంగాణా సాయుధ
పోరాటం లోని వివిధ ఘట్టాలను ఎవరు తన పుస్తకం ‘వీర తెలంగాణా ‘ గ్రంధం లో రాసారు ?
జవాబు : రావి నారాయణ రెడ్డి
17)1943 లో ఆంధ్ర సారస్వత పరిషత్ స్థా పించారు .
దీని మొదటి అధ్యక్షుడు ఎవరు ?
జవాబు : లోకనంది శంకర నారాయణరావు
18)దాశరధి కృష్ణ మాచార్యులు రాసిన పుస్తకాలేవీ ?
జవాబు : అగ్ని ధార , రుద్ర వీణ
19)‘నా తెలంగాణా కోటి రతనాల వీణ ‘ అనే మకుటం తో
గేయాలు రాసిన దేవరు ?
జవాబు : దాశరధి కృష్ణమా చార్యులు
20)దాశరధి రంగా
చార్యులు రాసిన నవలలు / పుస్తకాలేవి ?
జవాబు : చిల్లర దేవుళ్ళు , జానపదం
21)‘ప్రజల మనిషి ‘ , ‘ గంగు ‘ , రామప్ప రభస అనే
సాంఘిక , ఆర్ధిక నేపధ్య నవలలు రాసిన దేవరు ?
జవాబు : వట్టికోట ఆళ్వారు స్వామి
22)హైదరాబాద్ లో శ్రీ కృష్ణ దేవరాయ ఆంధ్ర భాష నిలయం
అనే గ్రంధాలయం ఎప్పుడు స్థాపించారు ? ఇది తెలంగాణా లో తొలి తెలుగు గ్రంధాలయం .
జవాబు : 1901
23)ఎవరి కృషి వల్ల హైదరాబాద్ లో శ్రీ కృష్ణ దేవరాయ
ఆంధ్ర భాష నిలయం అనే గ్రంధాలయం 1901 స్థాపించారు?
జవాబు:కొమర్రాజు లక్ష్మణ రావు , రావి చెట్టు రంగా
రావు , మునగాల రాజా , నాయని వెంకట
రంగారావు
24)1905 లో దేన్నీ స్థాపించారు ?
జవాబు : శ్రీ రాజరాజ నరేంద్ర ఆంధ్ర భాష
నిలయం
25)సికింద్రాబాద్ లో ఆంధ్ర సంవర్ధిని గ్రంధాలయం
ఎప్పు డు స్థాపించారు ?
జవాబు: 1905
26)1906 లో ఎవరు విజ్ఞాన చంద్రిక గ్రంధ మండలి ని
స్థాపించారు ?
జవాబు : కొమర్రాజు వెంకట లక్ష్మణ రావు (దీన్ని 1908 లో మద్రాస్ కు తరలించారు )
27)గ్రంధాలయో ద్యమానికి కృషి చేసిన దేవరు ?
జవాబు: కొమర్రాజు వెంకట లక్ష్మణ రావు , వట్టికోట
ఆళ్వారు స్వామి
28)190 6 లో వివేక వర్ధని పాఠ శాల స్థాపించిన దేవరు ?
జవాబు : బి. ఆర్. వెంకట్రావ్ . ఈయన్ని మిత్రులు ప్రేమగా ‘ రావు సాహెబ్ ‘ అని
సంభో దిం చే వారు తర్వాత ఇది వివేక వర్ధని విద్య సంస్థ గా అభి వృద్ది చెందింది
జవాబు : కేశవ రావు కోరట్ కర్ , వామన్ రామచంద్ర
నాయక్ , గణపతి రావు హర్దికర్
తెలంగాణాలో
సామజిక , సాంస్కృతిక , రాజకీయ
చైతన్యం (FOR TSPSC )(Part – 2 )
1)
హైదరాబాద్ లో ఆర్య సమాజ్ ఎప్పుడు స్థాపించారు ?
జవాబు :
1892
2)
1932 వరకు ఎవరు ఆర్య సమాజ్ అధ్యక్షులు గా ఉన్నారు
?
జవాబు :
కేశవ రావు కో రాట్ కర్
3)
192 9 లో హైదరాబాద్ సంస్థానం లోని కన్నడ ప్రాo తం లో
దేన్నీ స్థాపించారు?
జవాబు :
దీన్ దార్ ఉద్యమం
4)
దీన్ దార్ ఉద్యమం ఎవరు ప్రారంభించారు ?
జవాబు : సిద్దిఖి దీన్ దార్
5)
వేదిక్ ఆదర్శ్ అనే ఉర్దూ వార పత్రిక ఎవరు 1934 లో
స్థా పించారు ?
జవాబు : ఆర్య సమాజ్
6)
దేన్నీ తెలంగాణా కాలాపాని అని పిలిచే వారు ?
జవాబు : మహబూబ్ నగర్ జిల్లా లో ని మామనూర్ జైలు
7)
ఆర్య సమాజ నాయకు డైన రామచందర రావు ని వందే మాతరం
రామచందర రావు అని ఎందుకు అన్నారు ?
జవాబు : మామనూర్
జైల్లో తీవ్రం గా కొట్టి , చిత్ర హింసలు పెట్టినా ఆయన ‘వందే మాతరం ‘ నినాదం మానలేదు
8)
ఆర్య
సమాజ్ వారు , హైదరాబాద్ లో కేశవ మెమోరియల్ విద్య సంస్థ ను
ఎప్పుడు స్థాపించారు ?
జవాబు : జూలై 29, 1940
9)
192 7 లో ఎవరు మజ్లిస్ ఇత్తేహదుల్ ముస్లి మీన్ ఎవరు స్థా
పించారు ?
జవాబు : బహదూర్ యార్ జంగ్
10)
1944 లో బహదూర్ యార్ జంగ్ మరణించిన తర్వాత ఎవరు మజ్లిస్ ఇత్తెహాదుల్
ముస్లిమీన్ అద్యక్షు డై నాడు ?
జవాబు : ఖాసిం రజ్వి
11)
190 6 లో భాగ్య రెడ్డి వర్మ హైదరాబాద్ లో దేన్నీ
స్థాపించాడు
జవాబు : జగన్ మిత్ర మండలి (తెలంగాణా లో ఇదే మొట్ట మొదటి దళిత సంస్థ )
12)
జగన్
మిత్ర మండలి తొలి దశలో ఎవరు ముఖ్య పాత్ర పోషించారు
జవాబు : భాగ్య రెడ్డి వర్మ మరియు అరిగే రామస్వామి
13)
19 11 లో
‘మన్య సంఘం’ స్థా పించిన దేవరు
జవాబు : భాగ్య రెడ్డి వర్మ
14)
ఘాస్ మండి , సికింద్రాబాద్ లో మరొక ‘మన్య సంఘం’
స్థాపించిన దేవరు
జవాబు : అరిగే రామస్వామి
15)
19 24 లో మన్య సంఘం ను భాగ్య రెడ్డి వర్మ దేనిగా మార్చాడు ?
జవాబు : ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్
16)
సికింద్రాబాద్ లో ఆది హిందూ జతీయోన్నతి సభ ను
ఎవరు స్థాపించారు
జవాబు : అరిగే రామస్వామి
17)
భాగ్య రెడ్డి వర్మ (1888 – 1939 ) అసలు పేరు ఏది
జవాబు : మాదరి భాగయ్య ( మే 22, 188 8 జన్మ దినం ) .
తర్వాత భాగ్య రెడ్డి గా తన పేరు మార్చు కున్నాడు
18)
1913 లో భాగ్య రెడ్డి కి వర్మ అనే బిరుదు ఎవరు
ఇచ్చారు
జవాబు : ఆర్య సమాజ్
19)
భాగ్య రెడ్డి వర్మ దేన్నీ అభి మానిం చాడు
జవాబు : బౌద్ధ ధర్మాన్ని
20)
సికింద్రాబాద్ లోని కుమ్మన గూడా ప్రాంతం లో ‘సునీత
బాల సమాజం ‘ స్థాపించిన దేవరు
జవాబు : అరిగే రామ స్వామి ( 1885 – 1973
)
21)
192 4 లో ‘ ఆది హిందూ జతీయోన్నతి సభ ‘ స్థాపించిన
దేవరు
జవాబు : అరిగే రామస్వామి
22)
బి . యస్ . వెంకట్రావు ఎవరి అనుచరుల్లో ప్రముఖుడు
జవాబు : డాక్టర్ బి. ఆర్ . అంబేద్కర్
23)
1922 లో ‘ఆది ద్రావిడ సంఘాన్ని ‘ స్థాపించిన
దేవరు ?
జవాబు : బి. యస్ . వెంకట్రావ్
24)
1927 లో ఆది హిందూ మహా సభ ను స్థా పించిన దేవరు
జవాబు : బి . ఆర్ . వెంకట్రావ్
25)
194 7 లో మీర్ లాయక్ ఆలి నాయకత్వం లో మంత్రి
వర్గం లో విద్య శాఖ మంత్రిగా పనిచె సిందేవరు
No comments:
Post a Comment