Saturday, 13 June 2020

Bits on Indian Constitution and Indian History


పాలిటిక్స్ బిట్స్  -  II  
                                                                                  ప్రాతూరి పోతయ్య శర్మ  
1)ప్రశ్న   : భారత రాజ్యాంగం లో ఎక్కడ రిపబ్లిక్ అనే పదం కనిపిస్తుంది?
జవాబు:  .preamble లో (తొలి పరిచయం)

2)ప్రశ్న    : బ్రిటిష్ రాజ్యాంగం నుండి మన భారత రాజ్యాంగం కోసం  ఏది తీసుకున్నాము’?
జవాబు:   పార్లమెంటరీ వ్యవస్థ

3)ప్రశ్న   :USA  రాజ్యాంగం నుండి మన భారత రాజ్యాంగం కోసం  ఏది తీసుకున్నాము?
జవాబు:   ప్రాధమిక హక్కులు

4)ప్రశ్న  : భారత రాజ్యాంగం కోసం  శక్తివంతమైన కేంద్రము మరియు బలహీన మైన రాష్ట్రాలు’,  రెసిద్యూరివరి (Residuary) పవరు ఎక్కడనుండి తీసుకున్నాం?
జవాబు:  కెనడా రాజ్యాంగం నుండి

5)ప్రశ్న: భారత రాజ్యాంగ పు ఎమర్జెన్సీ పవర్స్ ఎక్కడనుండి తీసుకున్నాం?
  ?
జవాబు:  వీమర్ రాజ్యాంగం జర్మని ( 1921)

6)ప్రశ్న: భారత రాజ్యాంగం కోసం  concurrent list, concept of cooperative federalism ఎక్కడ నుండి  తీసుకున్నాం?
జవాబు:   Astralia  రాజ్యాంగం

7)ప్రశ్న:  భారత దేశం అంతటా ఉన్నది ఏమిటి?
జవాబు:  సింగల్ సిటిజెన్ షిప్ (ఒకే పౌరసత్వం )

8)ప్రశ్న:   భారత రాజ్యాంగం ఎలాంటిది?
జవాబు:  పూర్తిగా వ్రాయబడినది

8)ప్రశ్న   ఎవర్ని భారత రాజ్యాంగ పితామహుడు అంటారు?
జవాబు:  డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్


9)ప్రశ్న: రాష్ట్రాల పేర్లు మార్చే హక్కు ఎవరికుంది ?
జవాబు:  భారత పార్లమెంట్ కి

10)ప్రశ్న:    రాష్ట్రాల గవర్నర్ లను ఎవరు నియమిస్తారు?
జవాబు:  భారత రాష్ట్రపతి

11)ప్రశ్న: అరునాచలప్రదేశ్, అస్సాం, మేఘాలయ, త్రిపుర, నాగాలాండ్,మిజోరాం, మణిపూర్ లను ఏమంటారు?
జవాబు:  సెవెన్ సిస్టర్స్

12)ప్రశ్న:  భారత దేశం లో 1688 లో తొలి మునిసిపల్ కార్పోరేషన్ ఎక్కడ ఏర్పాటు చేశారు?
జవాబు:  .మద్రాస్

13)ప్రశ్న:  మునిసిపాలిటి లకు ప్రతినిధులను ఎన్నుకోవటం ఎవరు ప్రవేశ పెట్టారు?
జవాబు:  1872 లో లార్డ్ మేయో

14)ప్రశ్న: మింటో – మార్లే సంస్కరణలు ఎప్పుడు చేశారు?
జవాబు:  1909


15)ప్రశ్న: మాంటేగ్-చేమ్స్ ఫోర్డ్ సంస్కరణలు ఎప్పుడు చేశారు?
జవాబు:  1919


16)ప్రశ్న:   ఎలక్షన్లలో వోటు వేయటానికి కనీస వయస్సు ఎంత ?
జవాబు:  18 సంవత్సరాలు నిండాలి

17)ప్రశ్న: భారత రాష్ట్ర పతి పదవి కలం ఎంత?
జవాబు:  5 సంవత్సరాలు

18)ప్రశ్న: భారత దేశ తొలి రాష్ట్రపతి ఎవరు?
జవాబు:  డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్

19)ప్రశ్న: ఉపాధ్యాయ దినం ఎప్పుడు?
జవాబు:  సెప్టెంబర్ 5

20)ప్రశ్న: లోక్ సభ స్పీకర్ ని ఎవరు ఎన్నుకుంటారు?
జవాబు:  లోక్ సభ సభ్యులు


21)ప్రశ్న: కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ని ఎవరు నియమిస్తారు?
జవాబు:  భారత రాష్ట్రపతి

22)ప్రశ్న: 14 వ ఆర్థిక సంఘం అధ్యక్షులు ఎవరు?
జవాబు:  వై.వి. రెడ్డి

23)ప్రశ్న:  మనవ హక్కుల రోజు ఎప్పుడు
జవాబు:  డిసెంబర్ 10
24)ప్రశ్న:   అంతర్జాతీయ మహిళా దినం ఎప్పుడు?
జవాబు:  .మార్చ్ 8

25)ప్రశ్న: గోవా ప్రాంతాన్ని చాలా కాలం పరిపాలించింది ఎవరు ?
జవాబు:  పోర్చుగీసు వారు



చరిత్ర  బిట్స్  -  II  




1)ప్రశ్న   కుతుబుద్దీన్ ఐ బక్  ఎప్పుడు పరిపాలించాడు?
జవాబు:  1206 – 1210 AD

2)ప్రశ్న  పృథ్వి రాజ్ చౌహాన్ ని ఎవరు ఓడించారు?
జవాబు:  మొహమ్మద్ ఘోరి , 1192 లో

3)ప్రశ్న     బహమనీ వంశo స్థాపించినది ఎవరు?
జవాబు:  హసన్ గంగూ  (1347 AD)

4)ప్రశ్న       హసన్ గంగూ రాజధాని ఏది?
జవాబు:  గుల్బర్గా

5)ప్రశ్న     అహమ్మద్ నగర్ లో  1490 AD లో నిజాం షాహీ వంశ పాలన స్థాపించినది ఎవరు?
జవాబు:  మాలిక్ అహ్మద్

6)ప్రశ్న    1490 AD లో బీజాపూర్ లో ఆదిల్ షా వంశాన్ని స్థాపించినది ఎవరు?
జవాబు:   యూసుఫ్ ఆదిల్ ఖాన్

7)ప్రశ్న     1518 AD లో కుతుబ్ షాహీ వంశాన్ని స్థాపించినది ఎవరు?
జవాబు:  సుల్తాన్ కుతుబ్ షా


8)ప్రశ్న     ఎవరు విజయనగర్ సామ్రాజ్యాన్ని స్థాపించారు?
జవాబు:  హరిహర రాయలు మరియు  బుక్క రాయలు

9)ప్రశ్న       శ్రీ కృష్ణ దేవ రాయలు  (1509-1520 AD) ఏ వంశం వాడు?
జవాబు:  తుళువ వంశం

10)ప్రశ్న       1526 లో బాబర్ ఎవర్ని ఓడించాడు?
జవాబు:  ఇబ్రహీం లోడి
11)ప్రశ్న     బాబర్ December 26, 1530 నాడు ఎక్కడ చనిపోయాడు?
జవాబు:  .ఆగ్రా

12)ప్రశ్న    బాబర్ సమాధి ఎక్కడ ఉంది?
జవాబు:  కాబుల్ (ఇక్కడకు బాబర్ శవాన్ని తెచ్చిసమాధి చేశారు)

13)ప్రశ్న       షేర్ ఖాన్ జూన్ 1539 లో ఎవర్ని ఓడించాడు?
జవాబు:   హుమాయున్

14)ప్రశ్న  షేర్ ఖాన్,  గన్ పౌడర్ ప్రేలటం వలన ఎప్పుడు మరణించాడు?
జవాబు:  May  22, 1545

15)ప్రశ్న    1543 లో అక్బర్ ఎక్కడ పుట్టాడు ?
జవాబు:  అమరకోట్

16)ప్రశ్న     1556 లో హుమాయున్ దేని వల్ల చనిపోయాడు?
జవాబు:  ఢిల్లీ లోని లైబ్రరీ మెట్ల నుండి జారి పడటం వలన

17)ప్రశ్న    మొగల్ సామ్రాజ్యానికి  అక్బర్ ఏ వయస్సు లో మహారాజు అయ్యాడు ?
జవాబు:  13 ఏళ్ళు


18)ప్రశ్న       అక్బర్ కి ఎవరు గార్డియన్ గా ఉండేవారు?
జవాబు:  బైరం ఖాన్

19)ప్రశ్న    October 07, 1605,  నాడు అక్బర్ ఏ వ్యాధి వల్ల చనిపోయాడు?
జవాబు:  నీళ్ళ విరోచనాలు


20)ప్రశ్న     నూర్జహాన్ అసలు పేరు ఏది?
జవాబు:  మేహరున్నిస

21)ప్రశ్న    షా జహాన్ మరో పేరు ఏది?
జవాబు:  ఖుర్రం

22)ప్రశ్న    ఔరంగజేబు ఎక్కడ చనిపోయాడు?
జవాబు:  , అహమ్మద్ నగర్ లో 1707 లో

23)ప్రశ్న    1627 శివాజీ ఎక్కడ పుట్టాడు?
జవాబు:  .శివనార్ కోట లో

24)ప్రశ్న   శివాజీ ఎప్పుడు చత్రపతి  గా పట్టభిషక్తుడు అయ్యాడు?
జవాబు:  1674


25)ప్రశ్న    శివాజీ ఎప్పుడు చనిపోయాడు ?
జవాబు:  1680







No comments:

Post a Comment