Saturday, 13 June 2020

Science bits Thorium


సైన్స్ బిట్స్  -  
1)      ప్రశ్న:   థోరియం దేనిలో లభిస్తుంది   ?
జవాబు:  మొనోజైట్
2)      2) ప్రశ్న:   ఆసియాటిక్ సొసైటీ ఫౌండర్ ఎవరు    ?
జవాబు:  విలియం జోన్స్

3)      ప్రశ్న:   1814 లొ  ఇండియన్ మ్యూజియం , ఎక్కడ ప్రారంభించారు ?
జవాబు:  కోల్ కత లో

4)      ప్రశ్న:     ELISA  పరీక్ష ఎందుకు చేస్తారు  ?
జవాబు:  ఎయిడ్స్ వ్యాధి పరీక్ష కోసం

5)      ప్రశ్న:    స్వైన్ ఫ్లూ దేని వల్ల వ్యాపిస్తుంది   ?
జవాబు:  పందుల వల్ల

6)      ప్రశ్న:     కాంపౌండ్ మైక్రోస్కోప్ ని ఎవరు తయారు చేశారు  ?
జవాబు:  జకారియా స్ జాన్సెన్ ( Zaccharias Janssen )

7)      ప్రశ్న:     1931 లో ఎలెక్ట్రాన్ మైక్రోస్కోప్ ఎవరు కనుగొన్నారు  ?
జవాబు:    E.Ruska

8)      ప్రశ్న:   Galgi Complex  (గాల్జి కాంప్లెక్స్)ఎవరు కనుగొన్నారు    ?
జవాబు:  కామిల్లో  గాల్జ్జి   (1898 లో)

9)      ప్రశ్న:   మానవుల చర్మ జీవకణాలు ఎన్ని రోజులీ జీవిస్తాయి    ?
జవాబు:  20  నుండి    35 రోజులు

10)  ప్రశ్న:    దుర్గ అనే టెస్ట్ ట్యూబ్ బేబీ ని కొలకత్తా లో సృస్టించిన శాస్త్రవేత్త ఎవరు   ?
జవాబు:  సుభాష్ ముఖోపాధ్య

11)  ప్రశ్న:    సైలెంట్ లోయ ఎక్కడుంది   ?
జవాబు:  కేరళ

12)  ప్రశ్న:    కళింగ ప్రైజ్ ఎవరికిస్తారు   ?
జవాబు:  సైన్సు ప్రజలలో బాగా వ్యాప్తి చేసినవారికి

13)  ప్రశ్న:    shinkansen రైళ్ళు ఎలాంటివి   ?
జవాబు:  బులెట్ ట్రైన్స్   ( వీటి వేగం : 320 కి.మి./గం )

14)  ప్రశ్న:    కోల్ కతా లో ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ ప్రారంభించినదేవారు   ?
జవాబు:  పి.సి. మహలనోబిస్

15)  ప్రశ్న:    భారతదేశం లో ఎక్కడ ఆటం బాంబు పరీక్ష చేశారు   ?
జవాబు:  పోకరణ్, రాజస్తాన్

16)  ప్రశ్న:     భారత అంతరిక్ష శాస్త్ర  పితామహుడు ఎవరు  ?
జవాబు:  విక్రం సారాభాయ్

17)  ప్రశ్న:    భారత పరమాణు శాస్త్ర పితామహుడు ఎవరు   ?
జవాబు:  డాక్టర్ హోమీ జహంగీర్ భాభా

18)  ప్రశ్న:     ఆధునిక భారతదేశంలో రసాయనశాస్త్ర పితామహుడు ఎవరు  ?
జవాబు:  ప్రఫుల్ల చంద్ర రే

19)  ప్రశ్న:    ఈ-మెయిల్ సృస్టించిన భారతీయుడు ఎవరు   ?
జవాబు:  శివ అయ్యదురై

20)  ప్రశ్న:    మోగ్లి ల్యాండ్ అని మధ్యప్రదేశ్ లోని ఏ పార్క్ ని అంటారు    ?
జవాబు:  పెంచ్ నేషనల్ పార్క్

21)  ప్రశ్న:    కజిరంగ నేషనల్ పార్క్ ఎక్కడుంది   ?
జవాబు:  అస్సాం

22)  ప్రశ్న:   రేడియో, మైక్రో ఆప్టిక్స్ సృష్టిo చిన భారత శాస్త్రవేత్త  ఎవరు    ?
జవాబు:  జగదీశ్ చంద్ర బోస్

23)  ప్రశ్న:    చిలక సరస్సు ఏ రాష్ట్రము లో ఉంది   ?
జవాబు:  ఒడిష

24)  ప్రశ్న:   ఆవు పేడ లో ఉండే బి విటమిన్ ఏది    ?
జవాబు:  సయానో కోబాలమిన్

25)  ప్రశ్న:  గవద బిళ్ళలు దేని వల్ల వస్తాయి      ?
జవాబు:  పరామైక్సో వైరస్ లేక  మైక్సో వైరస్ పారోటిడిస్

26)  ప్రశ్న:  రెడ్ పండ ఎక్కడ ఉంటుంది     ?
జవాబు:  తూరుపు హిమాలయాల్లో

27)  ప్రశ్న:   కంగారు లకు ఏది ముఖ్యం    ?
జవాబు:  తోక

28)  ప్రశ్న:     గుజరాత్ లోని గిర్ అడవుల్లో ఉండే సింహాలను ఏమంటారు  ?
జవాబు:  ఆసియా సింహాలు  (పెన్థరాలియో పెర్సికా )


29)  ప్రశ్న: టెస్ట్ ట్యూబ్ బేబీ కోసం ఫలదీకరణ ప్రక్రియ ఎక్కడ జరుగుతుంది      ?
జవాబు:  టెస్ట్ ట్యూబ్ లో

30)  ప్రశ్న:     క్లోరిన్ వాయువు ఏ రంగులో ఉంటుంది   ?
జవాబు:  పసుపు పచ్చని రంగులో

31)  ప్రశ్న:    1985 లో DNA ఫింగర్ ప్రింటింగ్ టెక్నిక్ కనుగొన్న దెవరు   ?
జవాబు:  అలెక్ జెఫ్రీ

32)  ప్రశ్న:    నేఫ్రాన్స్ (nephrans) వేటిల్లో ఉంటాయి    ?
జవాబు:  మూత్ర పిండాలలో

33)  ప్రశ్న:    పొగ మంచు గుండా మనం ఎందుకని చూడలేము   ?
జవాబు:  సూక్ష్మ నీటి బిందువులు కాంతిని వెదజల్లటం వలన

34)  ప్రశ్న:   బాంబి క్స్ మోరి దేనికి సంబంధించినది    ?
జవాబు:  పట్టుపురుగుల సీతాకోక చిలుక

35)  ప్రశ్న:    ఉష్ణోగ్రత   జీరో డిగ్రీల సెంటిగ్రేడ్ కన్నా తగ్గాలంటే ఏమి చేయాలి    ?
జవాబు:  సముద్రపు ఉప్పు మరియు ఐస్ ముక్కలు కలిపి ఉంచాలి

36)  ప్రశ్న:     గుండె స్ట్రోక్ వాల్యూం ఎంత  ?
జవాబు:  70 ఎమ్ ఎల్

37)  ప్రశ్న:   గిరి రాజ్ పక్షులు అవి వేటిని అంటారు    ?
జవాబు:  కోళ్ళు

38)  ప్రశ్న:    వేటి శరీర ఉష్ణోగ్రత ,  వాతావరణ ఉష్నోగ్రత తో పాటు మారుతుంటుంది   ?
జవాబు:  కప్పలు, తొండలు

39)  ప్రశ్న:   గర్భం లో ఉన్న పిండం గుండె ఎప్పటినుంచి కొట్టుకుంటుంది    ?
జవాబు:  పిoడం అభి వృద్ధి మొదలైన ఆరో వారం నుండి

40)  ప్రశ్న:   పగలు, రాత్రి నిడివి , దాని ఆక్సిస్ టిల్ట్ , భూమితో సమానంగా ఉంటుంది     ?
జవాబు:  అoగారక గ్రహం

41)  ప్రశ్న: మండే మంట ఏ రంగులో ఉంటె బాగా వేడి ఉంటుంది      ?
జవాబు:  నీలం రంగులో

42)  ప్రశ్న:   సౌండ్ లౌడ్ నెస్ దేనిలో కొలుస్తారు    ?
జవాబు:  డేసిబుల్స్

43)  ప్రశ్న:   బైసికల్ హేండిల్ కి మీద చేసే ప్లేటింగ్  ని ఏమంటారు   ?
జవాబు:  క్రోమియం ప్లేటింగ్

44)  ] ప్రశ్న:   బ్లూ రంగు లైట్ ఏమిటింగ్ డయోడ్ కనుగొన్నందుకు ఎవరికి 2014 నోబెల్ బహుమతి ఇచ్చారు    ?
జవాబు:  షుజీ నకమూర, హిరోషి అమానో, ఇసము  ఆకసాకి

45)  ప్రశ్న:    సాధారణంగా మనం  ఊపిరి తీసుకునేటప్పుడు  వచ్చే శబ్దం లౌడ్ నెస్ ఎంత   ?
జవాబు:  10 డేసిబుల్స్

46)  ప్రశ్న:    తలంటి పోసుకున్నాక తడి ఆరిన వెంట్రుకలను ప్లాస్టిక్ దువ్వెన తో దువ్విన తర్వాత , ఆ దువ్వేన , చిన్న చిన్న కాగితాలను ఆకర్షిస్తుంది. ఎందువలన   ?
జవాబు:  దువ్వెన లో స్టాటిక్ ఎలక్ట్రిసిటీ రావటం చేత

47)  ప్రశ్న:   బిల్డింగ్ లకు ఎర్తింగ్ ఎందుకు ఏర్పాటు చేస్తారు     ?
జవాబు:  మెరుపులలోని విద్యుచ్చక్తి చేత  బిల్డింగ్ లకి నష్టం కలగ కుండ

48)  ప్రశ్న:    శక్తిని దేనిలో కొలుస్తారు   ?
జవాబు:  కేలరీలలో

49)  ప్రశ్న:  వాయిస్ బాక్స్ కు గల మరో పేరు ఏది     ?
జవాబు:  Larynx

50)  ప్రశ్న:   శబ్ద వ్యాప్తికి గాలి గాని, నీరు గాని, ఘన పదార్ధాలు గాని కావాలి. అలాంటి వాటిని ఏమంటారు    ?
జవాబు:  మాధ్యమాలు (మీడియం )


No comments:

Post a Comment